సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కోటా, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కోసం ఢిల్లీ బయల్దేరారు. అక్కడ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) పెద్దలతో చర్చించి అభ్యర్థులను నిర్ణయించనున్నట్లు సమాచారం. అనంతరం, ఆయన ఈ రాత్రి లేదా రేపు ఉదయం హైదరాబాద్ కి తిరిగి రానున్నారు. రేపు మహిళా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొని, తర్వాత మళ్లీ ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం.

