Saturday, July 25, 2026
22.7 C
Hyderabad

గీ అక్కాశెల్లెండ్లు ముగ్గురికి ఒక్కడే పెనిమిటి!?|ADUGU TRENDS

మన సంప్రదాయం పకారం ఒక్కొక్కరు ఒక్కల్నే మనువాడాలె. కనీ, గాడ గా పొల్లగాడ్ని, ముగ్గురు అక్కాశెల్లెండ్లు ఒక్కపాలే పెండ్లి శేసుకున్నరు? గదేందో సూద్దాం పదండ్రి.

గిదేంది? అనకుంటాండ్రా? నిజమేనుల్లా… గీ ముచ్చట గా ఉత్తర ప్రదేశ్ రాస్ట్రం అమ్రోహా జిల్లాల జరిగింది. ధౌరియా అనే ఊరికి శెందిన అక్కా శెల్లెండ్లు అల్కా, దేవిక, సంతోశ్ లు, ఏదో సదువైనంక, ఇంటి పట్టునే ఉంటూ, ఈడియోలు శేసి, సోషల్ మీడియల పెడ్తాండ్లు. గవాటిని సూసేటోల్లు గూడా బాగా పెరిగిండ్రు. ఇగీల్లకు ఓ అనుమానం వచ్చింది. తమకు పెండ్లిండ్లయితే, ఎక్కడివాళ్లు గక్కడకు పోతే, గీ ఈడియోలు శేసుడెట్ల? అయితే, గిదీనికి ఓ ఆలోసెన శేసిండ్రు. ఒకే కుటుంబానికి శెందిన ముగ్గుర అన్నా దమ్ముల్ని పెండ్లి శేసుకుంటే, గీ సమస్యపోతది, ఎసక్కా.. గా ఈడియోలు శేసుడాపకుండ ఉండొచ్చని నిర్ణయించుకుండ్రు. గీ ముచ్చటను గవాల్ల తల్లిదండ్రులకు గూడ శెప్పిండ్రు. సరే తియ్యి బిడ్డలూ అని గ వాల్లు గూడా అనుకుండ్రు.

ఇగ ఈ ముగ్గురు అక్కాశెల్లెండ్ల ఈడియోల గాపక్కనే ఉన్న శ్యాంపురి ఊరి వికాస్ తీత్తాంటడు. గట్లనే ఓ రోజు తీత్తాంటే, గవాల్లకు ఓ కొత్త ఆలోశన మెరిసింది. గా వికాస్ నే పెండ్లి శేసుకుంటే, ఇగ ఏ శిక్కూ ఉండదనుకున్నరు. గా ముచ్చటను గా పొల్లగానికి శెప్తే, సరేనన్నడు. అవ్వయ్యలకు శెప్తే గట్లెట్ల? కుదరదుపో అన్నరు. మీతోటి మాకేందని, గా ముగ్గురు అక్కాశెల్లెండ్లు ఓ సక్కా, గా పొల్లగాడొక్కడినే పెండ్లి శేసుకున్నరు. గా ముచ్చను గూడ సోషల్ మీడియల పంచుకున్నరు. ఇగిప్పుడు గీ ఈడియ నెట్టింట మస్తు వైరలైతాంది.

Latest News

ఒక్క ఏసీ మిషినీ, రొండు అర్రలకు సల్లదనం!?|ADUGU TRENDS

‘ఒక్క దెబ్బకు రెండు పిట్టలు!’. ‘ఒకే కాన్పుల ఇద్దరు పిల్లలు!! లెక్కనే’ గీ ‘ఒక్క ఏసీతో రెండు గదుల్ల సల్లదనమన్నట్లు!?’ అరె గదెట్ల? అనుకుంటాండ్రా? కావాల్నంటే ఇగో సూడుండ్రి. ఇగో గీ ఉపాయం ఏడ...

‘బొద్దింకే’ కదాని నిర్లక్ష్యం చేస్తే..!?|EDITORIAL

‘బొద్దింక’లే కదాని చులకనగా చూడొద్దు. వాటిని చంపినా మళ్ళీ అవి పుట్టుకు వస్తూనే ఉంటాయి. వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఉద్యమాలను అణచివేయవచ్చు. కానీ, సమస్యలను పరిష్కరించకపోతే కొత్త రూపాల్లో అసంతృప్తి మళ్లీ...

జూలై 25, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తొలి ఏకాదశి తిధి ఏకాదశి ఉదయం 11.38 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం అనురాధ ఉదయం 05.49 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం బ్రహ్మ రాత్రి 11.00 వరకు ఉపరి ఐంద్ర కరణం భద్ర ఉదయం 11.38...

నీట్-అణచివేతే పరిష్కారం కాదు!|EDITORIAL

దేశ జనాభాలో 65%నికి పైగా 35ఏళ్ళ లోపు వాళ్ళే. ప్రపంచంలో అత్యధిక యువ జనాభా కలిగిన దేశంగా భారత్‌కు గొప్ప అవకాశం. అయితే ఇదే యువత ఉద్యోగాలు, పారదర్శక నియామకాలు, నాణ్యమైన విద్య,...

జూలై 24, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి దశమి ఉదయం 09.51 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం అనురాధ పూర్తిగా రోజంతా యోగం శుక్ల రాత్రి 10.25 వరకు ఉపరి బ్రహ్మ కరణం గరజి ఉదయం 09.53 వరకు ఉపరి వణజి రాహుకాలం ఉదయం...

సింధు నాగరికత కాలం నాటి ముఖ్య నగరాలు|HISTORY|COMPITITIVE EXAMS|ADUGU SPECIAL

సింధు నాగరికతలో సుమారు రెండువందల పట్టణాలకు పైగా పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అందులో ముఖ్యమైనవి హరప్పా, మోహెంజోదారో, లోథాల్, కాళీబంగన్, ఛాన్సుధారో, బాన్వాలీ, ధోలవీర మొదలగునవి. హరప్పా ఇది 1921 లో సింధు నాగరికతలో బయల్పడిన...

యియర్ పోన్లతోటి శెవులకు శిల్లే!?|ADUGU TRENDS

కొత్త టెక్నాలజీ వచ్చిందంటే సాలు..ఇగ దానెంటే పడ్తం. గదాన్నే అనుసరిత్తం. ఏమైతాందో సూసుకోం. గసొంటిదే గీ యియర్ పోన్ల వాడకం. గదేందో సూద్దా పదండ్రి. అదే పనిగా యియర్ పోన్లను వాడేటోల్లకు గా కర్ణభేరి...

నీట్ లీకేజీ.. అంత లోకువా!?|EDITORIAL

పరీక్షల విశ్వసనీయత దెబ్బతింటే విద్యా వ్యవస్థపై నమ్మకం పోతుంది. అందువల్ల నీట్ పేపర్ లీక్ వ్యవహారాన్ని కేవలం రాజకీయ ఆరోపణలు–ప్రత్యారోపణలకే పరిమితం చేయకుండా, పార్లమెంట్‌లో సమగ్రంగా చర్చించి, అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి...

జూలై 23, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి నవమి ఉదయం 08.27 వరకు ఉపరి దశమి నక్షత్రం విశాఖ రాత్రి తెల్ల 03.30 వరకు ఉపరి అనురాధ యోగం శుభ రాత్రి 10.06 వరకు ఉపరి శుక్ల కరణం కౌలవ ఉదయం 08.28...

అడుగు ఎక్స్ క్లూజివ్: సీజేపీ ఆందోళన వెనక కుట్ర కోణం?|CJP|NATIONAL|ADUGU EXCLUSIVE

ప్రాణాలకు తెగించి రావాలని సందేశాలు ప్రాణత్యాగాలు చేసిన వారిని గుర్తుంచుకుంటాం సీక్రెట్ యాప్‌తో పరస్పరం సందేశాలు చేరవేత సంసద్ యాత్రపై కూపీ లాగుతున్న పోలీసులు|SAMSAD న్యూఢిల్లీ, జూలై 21 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం చేపట్టిన...

గాడ వజ్రాల వాన!?|ADUGU TRENDS

మన కాడ.. ఏ తియ్ మనకాడేంది? ఏడైనా.. శినుకంటే నీటి సుక్కే. జల్లంటే నీల్లే. అని అనుకుంటం కానీ, గాడ మాత్రం శినుకంటే వజ్రం. వానంటే వజ్రాలే!? కానీ, గా వజ్రాలను మనం...

యుద్ధ మేఘాలు ప్రపంచ శాంతికి ఆటంకాలు!?|EDITORIAL

యుద్ధం ఎప్పుడూ చివరి పరిష్కారం కాదు. ప్రతి బాంబు పేలుడు వెనుక వేలాది కుటుంబాల విషాదం ఉంటుంది. ప్రతి ఆంక్ష వెనుక లక్షలాది మంది సామాన్యుల జీవనోపాధి దెబ్బతింటుంది. కాబట్టి అమెరికా, ఇరాన్‌తో...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News