జనగామ జిల్లా, పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో స్వయంభు శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో(జాతర) బందోబస్తులో వున్న పాలకుర్తి ఎస్సై దూలం పవన్ కుమార్ మానవతను చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే తెల్లవారుజామున భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయంలో దర్శనానికి వచ్చిన ఒక మహిళ ఫిట్స్ తో స్పృహతప్పి పడిపోగా, తక్షణమే స్పందించిన పాలకుర్తి ఎస్సై దూలం పవన్ కుమార్ ఆమెకు ప్రథమ చికిత్స చేసి ఆ మహిళను ఎత్తుకొని పాలకుర్తి జాతర లో వున్న వైద్య శిబిరానికి చేర్చారు. ఈ సంఘటనలో మానవతను చాటుకున్న ఎస్సై పవన్ కుమార్ ను ఏసిపి నర్సయ్య, సీఐ మహేందర్ రెడ్డిలు అభినందించారు.


