Warangal East Consistituency|వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని బీరన్న బోనాల ఉత్సవానికి State Minister| రాష్ట్ర మంత్రి కొండా సురేఖ హాజరయ్యారు. First Bonam|తొలిబోనం వరంగల్ బీరన్నకే కావడం సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న బోనాల ఉత్సవానికి ప్రభుత్వం నుండి అన్ని రకాల సహాయ, సహకారాలు అందిస్తున్నట్టు తెలిపారు. బోనం ఎత్తడం ఒక ప్రత్యేకత అయితే, ఇక్కడి బోనాల ప్రత్యేకతగా కురుమ పూజారులు గొర్రెను పట్టడం ఉందని పేర్కొన్నారు. పలు అనివార్య కారణాల వల్ల ఈ ఏడాది Badrakali|భద్రకాళికి తొలిబోనం సమర్పించాలన్న సంకల్పాన్ని వాయిదా వేయాల్సి వచ్చిందని వెల్లడించారు. అయితే, సోషల్ మీడియా ద్వారా ఈ అంశం విస్తృతంగా ప్రచారమవడం వల్ల ప్రజల్లో సందిగ్ధత ఏర్పడిందని, త్వరలోనే ప్రభుత్వం ఈ విషయంలో పునరాలోచన చేసి నిర్ణయం ప్రకటిస్తుందని తెలిపారు. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణకు నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు.

