Saturday, September 19, 2026
27.3 C
Hyderabad

జూన్ 1 లేదా 2న మంత్రివర్గ విస్తరణ?|MINISTER|EXPANSION

THREE|ముగ్గురు MINISTERS|మంత్రులకు ఉద్వాసన?
మంత్రుల్లో, ఆశావహుల్లో ఉత్కంఠ
CM|సీఎం, PCC CHIEF|పీసీసీ చీఫ్, రాష్ట్ర ముఖ్య నేతలకు ఢిల్లీ పిలుపు
మంత్రులకు, ముఖ్య నేతలకు CM|సీఎం విందు

అసలు అవుతుందో లేదో అనుకున్న తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు రంగం సిద్ధమైందా? గిల్లి కజ్జాలు, బుజ్జగింపుల తర్వాత అన్ని అవాంతరాలను అధిగమించినట్లేనా? అదే జరిగితే, ఇప్పుడున్న మంత్రుల్లో ముగ్గురికి ఉద్వాసన తప్పదా? ఆ ముగ్గురు ఎవరు? కొత్తగా మంత్రులయ్యేది ఎవరు? పీసీసీ కార్యవర్గంలో చోటు దక్కేదెవరికి? కాంగ్రెస్ మార్క్ రాజకీయంలో అంతా ఉత్కంఠ నెలకొంది.

తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ ఈ నెల 30 లేదా జూన్ మొదటి వారంలోనే ఉండనుందా? అదే సమయంలో పీసీసీ కార్యవర్గాన్ని కూడా ప్రకటిస్తారా? ఇదే జరిగితే, ప్రస్తుత మంత్రివర్గంలో ఉన్న ముగ్గురు మంత్రులకు ఉద్వాసన తప్పదా? ఆ ముగ్గురు ఎవరు? కొత్తగా మంత్రులు కానున్నది ఎవరు? పైగా ఈ నెల 30న ఢిల్లీకి ఎఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వస్తున్నారు. ఇదే రోజున ఢిల్లీకి రావాలని సీఎం, పీసీసీ చీఫ్, మంత్రులకు పిలుపు వచ్చినట్లుగా తెలిసింది. మంత్రివర్గ విస్తరణ, కార్యవర్గ కూర్పుపై అధిష్టానం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే, ఇప్పుడు ఇవే అంశాలు రాష్ట్ర కాంగ్రెస్ తోపాటు, మంత్రివర్గ సభ్యులలో ఉత్కంఠ రేపుతున్నాయి. ఇవే అంశాలు చర్చనీయాంశంగా మారాయి.

విందు రాజకీయం
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో మంత్రులకు విందు ఇచ్చారు. ఈ విందుకు డిప్యూటీ సీఎం సహా, రాష్ట్ర మంత్రులు, పీసీసీ చీఫ్, కాంగ్రెస్ ముఖ్య నేతలు హాజరయ్యారు. అంతా ఒక చోట కలిసి పిచ్చా పాటి ముచ్చటించుకుంటున్న సమయంలో మంత్రి వర్గ విస్తరణ అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది. రెండు రోజుల క్రితమే రెండు రోజులపాటు అధిష్ఠానం పిలుపు మేరకు ఢిల్లీలో మకాం వేసి, సుదీర్ఘంగా చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. పీసీసీ కార్యవర్గం తుది జాబితా ఖరారు, మంత్రి వర్గ విస్తరణపైనే కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఎఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తదితరులతో భేటీలు జరిపారు. చర్చించారు. అయితే ఎఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఢిల్లీలో అందుబాటులో లేని కారణంగా ఆయన వచ్చిన వెంటనే మళ్ళీ మరోసారి భేటీ అయ్యేందుకు, తుది జాబితాలు సిద్ధం చేసేందుకు నిర్ణయించారు. 30న ఖర్గే ఢిల్లీలో అందుబాటులో ఉంటారని తెలిసింది. దీంతో విందులో చర్చంతా పీసీసీ కార్యవర్గం, మంత్రివర్గ విస్తరణపైనే జరిగినట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఖర్గే ఆమోదం కోసం ఢిల్లీకి 30న కాంగ్రెస్ ముఖ్య నేతలు వెళ్ళనున్నట్లు చర్చ వచ్చింది. ఇదే సమయంలో ముగ్గురు మంత్రులకు ఉద్వాసన తప్పదన్న విషయం చర్చకు వచ్చింది. ఆ ముగ్గురు ఎవరన్న దానిపై విందులోనే ఉత్కంఠగా చర్చ జరిగినట్లు తెలిసింది. మంత్రుల్లో అప్పుడే గుబులు మొదలైంది. పైకి గంభీరంగా కనిపించినప్పటికీ దాదాపు మంత్రులందరిలోనూ ఏయే కారణాలతో ఎవరిని పక్కన పెడతారోనన్న ఆందోళన కలిగినట్లు తెలిసింది. పైకి నవ్వుతూ ఏదోలా ఆ విందు ముగించుకుని బయట పడ్డారట. అంతేగాక కొత్తగా వచ్చే మంత్రులు ఎవరై ఉంటారన్నదానిపై కూడా కొందరు చర్చించుకున్నట్లు తెలిసింది. ఇప్పటికే బహిరంగంగా చర్చకు వచ్చిన పేర్లను వారు ఉటంకించినట్లు తెలిసింది.

విస్తరణ పూర్తి స్థాయిలోనేనా?
అయితే ఈ సారి మంత్రి వర్గ విస్తరణ పూర్తి స్థాయిలో ఉంటుందా? లేక ఇద్దరు ముగ్గురిని తప్పించి, మరో ఇద్దరు ముగ్గురిని తీసుకుని వివాదాస్పదంగా ఉన్న మిగతా ఒకటి రెండు జిల్లాలను పక్కన పెడతారా? అన్న సందిగ్ధం కూడా నెలకొంది. ముఖ్యంగా అదిలాబాద్ జిల్లాలో సామాజిక వర్గాల సమీకరణలు కుదరడం లేదు. ఒకటి రెండు సామాజిక వర్గాల మధ్య పడటం లేదు. నల్లగొండలోనూ ఒకే సామాజిక వర్గం, ఒకే కుటుంబానికి చెందిన వారికి మంత్రి పదవులు దక్కుతాయా? అన్నది ఉత్కంఠగానే ఉంది. అధిష్టానం నిర్ణయం ఏమై ఉంటుంది? ఏ మేరకు సీఎం, రాష్ట్ర నేతలు ఎఐసీసీని ఒప్పించగలరన్నదానిపై ఈ సమీకరణలు ఆధారపడి ఉన్నాయి.

మీనాక్షి కీలక పాత్ర
ఇక పీపీసీతోపాటు, మంత్రి వర్గ కూర్పులోనూ ఎఐసీసీ వ్యవహారాల ఇన్ చార్జీ మీనాక్షి నటరాజన్ కీలక పాత్ర వహిస్తున్నట్లు తెలిసింది. గతానికి భిన్నంగా కొన్ని నిబంధనలు పెట్టి, దరఖాస్తులు స్వీకరించి, పరిశీలించి, వడపోసి, నిర్ణయించే ప్రక్రియను ఆమె మొదలు పెట్టారు. ఎట్టకేలకు ఒక జాబితాను ఎఐసీసీకి పంపించారు. పీసీసీ మాత్రమేగాకుండా, మరోవైపు సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల పనితీరును సైతం మీనాక్షి మదింపు వేసి, ఎఐసీసీకి పంపించినట్లుగా విశ్వసనీయంగా తెలిసింది. దీంతో ఎవరేంటి? వారి పనితీరేంటి? పార్టీకి వారు పనికొచ్చే తీరేంటి? వంటి అంశాల్లో ఒక నిర్ధారణకు రావడానికి ఎఐసీసీకి సులువైనట్లుగా చెబుతున్నారు.

మొత్తానికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన18 నెలలు తర్వాత కూడా అసలు పీసీసీ విస్తరణ ఉంటుందా? మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందా? అనే అనుమానాలు బలపడి, విస్తారంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ రెండు నియామకాలు ఒక కొలిక్కి రావడం ఆ పార్టీలో కొందరికి ఇబ్బందీగా ఉన్నప్పటికీ, అనేక మందికి ఆనందాన్ని కలిగిస్తున్నది.

Latest News

కరకరలాడే కరెన్సీ నోట్లతో నాయకుడు!|ADUGU TRENDS

అవును. మీరు ఇ0టున్నది నిజమే. కావాలనంటే మీరే సూడు0డ్రి. గాడ కరకరలాడే కొత్త కరెన్సీ నోట్ల తోటి ఇనాయకుడిని అలంకరించినరు. ఒక్క రూపాయి రెండు రూపాయలతోటి కాదుల్ల ఏకంగా 65.03 లచ్చల నోట్ల...

పన్నుల ఉచ్చులో ప్రపంచ వాణిజ్యం!|EDITORIAL

సుంకాల అస్త్రంతో అమెరికా మరోసారి ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేస్తోంది. రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల పేరుతో భారత్, చైనాలపై కూడా భారీ సుంకాల ముప్పు తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రష్యా చమురు దిగుమతుల విషయంలో...

సెప్టెంబర్ 19, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు అష్టమి పగలు 01.40 వరకు ఉపరి నవమి నక్షత్రం మూల రాత్రి 01.14 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం ఆయుష్మాన్ పగలు 03.20 వరకు ఉపరి సౌభాగ్య కరణం బవ పగలు 01.40...

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

యుద్ధానికి భారీ మూల్యం.. అమెరికాపై ఆర్థిక భారం!|EDITORIAL

యుద్ధం అంటే కేవలం బాంబులు, క్షిపణుల మోత మాత్రమే కాదు.. ఖజానాపైనా భారీ దెబ్బే! ఇరాన్‌తో అమెరికా ఘర్షణ నేపథ్యంలో అగ్రరాజ్యంపై పెరుగుతున్న బిలియన్ల డాలర్ల భారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయుధాల...

సెప్టెంబర్ 18, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు సప్తమి ఉదయం 11.40 వరకు ఉపరి అష్టమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 10.37 వరకు ఉపరి మూల యోగం ప్రీతీ పగలు 02.47 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం వణజి ఉదయం 11.40...

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News