ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అరెస్ట్
మెదక్ జిల్లా గుమ్మడిదల మండలం ప్యారానగర్‌లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ 10 గ్రామాల ప్రజలు ఉద్యమం ప్రారంభించారు. పోలీసులు గ్రామాలను వలయంలా ముట్టడి చేయగా, బీఆర్ఎస్ నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిని అరెస్టు చేశారు. అర్ధరాత్రి ఇళ్లలోకి చొరబడి అక్రమ అరెస్టులు జరిపారని, తమ కుటుంబ సభ్యులను ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లగచర్ల ఘటన తరహాలోనే ఈ ఉద్యమం జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. గ్రామస్తుల నిరసనలు కొనసాగుతుండగా, డంపింగ్ యార్డ్ ప్రాంతంలో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

