పుష్ప సినిమా విడుదల ప్రివ్యూ షో రోజు హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడు శ్రీతేజ్‌ను నటుడు అల్లు అర్జున్ పరామర్శించారు. తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్, నిర్మాత దిల్ రాజుతో కలిసి ఆస్పత్రికి వెళ్లిన అల్లు అర్జున్, వైద్యులతో సుమారు 20 నిమిషాలు మాట్లాడి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని వివరంగా తెలుసుకున్నారు. బాలుడి తండ్రి భాస్కర్‌తో మాట్లాడి ఆయనకు ధైర్యం చెప్పారు. అల్లు అర్జున్ రాకతో ఆస్పత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


