దేశంలో రానున్న 48 గంటల్లో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 3 డిగ్రీలు పెరగనున్నట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈశాన్య రుతుపవనాలు ఈసారి జనవరి 26 వరకు 104 రోజులు కొనసాగగా, ఫిబ్రవరి మొదటి వారం నుంచే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉదయం 11 గంటల తర్వాత ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాల్లో ఫిబ్రవరి 9 నుండి 11 వరకు పొడి వాతావరణం కొనసాగనుంది. శుక్ర, శనివారాల్లో ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంది. ఉదయం స్వల్పంగా మంచు కురిసే అవకాశం ఉండగా, చెన్నై నగరంలో మేఘావృత ఆకాశం కనిపించనుందని వాతావరణ శాఖ తెలిపింది.

