పెయిల యేడితోటి అరికాళ్ళ మడిమలు పల్గి, ఇర్రుమని మస్తు ఇబ్బందీ పెడ్తయి. నడవాల్నంటేనే నరకం కనబడ్తాంటది. ఇగ నెర్రెలు బాసిన కాల్లల్లకు మట్టిపోయి ఒకోపాలి రక్తాలు కారుతాంటయి. ఇగ గీ తిప్పలు పోవాల్నని, వైద్గుల కాడికిపోతం. ఏవేవో మందులు రాస్తం. ఇగ గదంత లేకుండ ఓ శిట్కె శెబుత రాసుకోండ్లి.

ఒక నిమ్మకాయల సగం ఒక్కను తీసుకోవాలె. గదాని మీద గింత పసుపు ఏయాలె. మల్ల గదాని మీద గింత పండ్లు తోముకునే పేస్టును పెట్టాలె. మల్లోపాలి గదాని మీద గింత నెత్తికి పెట్టుకునే షాంపూను పోయాలె. ఇగ గా దాంతోటి మెల్లగా గా కాల్లు పల్గిన కాడ మర్ధనం చేసినట్లుగ రుద్దాలె. గట్ల శేస్తే… గా కాళ్ళ మడిమెల పల్గుడు పోయి, నున్నగ నిగనిగలాడ్తయట. గంతేకాదుల్ల… గా మడిమలు గట్టిపడి బలంగా తయారైతట. గీ శిట్లాను మీరు కూడా శేసి సూడుండ్లి!

