Wednesday, September 16, 2026
31.2 C
Hyderabad

ఆత్మహత్యా సదృశ్యంగా అమెరికా చర్యలు!?|EDITORIAL

ఏదో ఒక రోజు బాధిత దేశాలతోపాటు ప్రపంచ దేశాలన్నీ కలిసి అమెరికాపై దండయాత్ర చేసే అవకాశం ఎవరూ కాదనలేని వాస్తవం. అమెరికా ఆశించినట్లు దానికి ఎదురే లేకుండా అన్ని దేశాలూ యుద్ధాల వల్లో, సుంకాల వల్లో మరే కారణాల వల్లో నిర్వీర్యం అయ్యాయనుకుందాం. అప్పుడు చుట్టూ జీవంలేని దేశాలు, ప్రజలతో ఆ దేశం ఎలా మనగలుతుంది? ఈ మాత్రం ఇంగితం లేక అనుకోలేం కానీ, ట్రంప్ లాగే, ఎవరికైనా సాగుతున్నంత కాలం సాగించుకోవాలనే ఉంటుంది. అందుకే మనం ముందుగా స్వదేశీ స్వావలంబనను, స్వయం సమృద్ధిని సాధించాలి. లాడెన్‌ ఉగ్రచర్యలను ట్రంప్‌ మరచిపోయారు. పాక్‌ను దువ్వి పాలు పోస్తున్నారు. దీనికి అమెరికా మూల్యం చెల్లించుకోక తప్పదు. పాక్‌ కూడా అమెరికా అండతో భారత్‌పై మరింత కాలుదువ్వే అవకాశాలు ఉన్నాయి. ఉగ్రచర్యలను ప్రేరేపించవచ్చు. మనం మరింత అప్రమత్తంగా ఉండాలి. ‘మార్గం అడుగు’ డాక్టర్ మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్ 

‘ట్రంప్ తన క్లోజ్ ఫ్రెండ్ కు మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు.’ అని అమెరికా అధ్యక్షుడు హెచ్-1బీ వీసాల ఫీజును లక్ష డాలర్లకు పెంచినప్పుడు ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, ప్రధాని మోదీని ఎద్దేవా చేశారు. ఇందులో వ్యంగ్యాన్ని పక్కన పెడితే, ట్రంప్ ఎవరికీ నమ్మకైన ఫ్రెండ్ కాదనేది సారాంశం. అధ్యక్షుడిగా ట్రంపే కాదు, దేశంగా అమెరికా కూడా నమ్మకమైన నేస్తం కాదు. అత్యంత స్వార్థపూరిత, నిరంకుశ, నిరపేక్షమైన దేశంగా ఇటీవలి ఆ దేశ విధి విధానాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచం పట్ల ఆ దేశం ఉచ్ఛనీచాలు మరచి ప్రవర్తిస్తున్న తీరు హేయంగా కనిపిస్తోంది. తన లాంటి ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని సైతం ప్రశ్నించేలా జోక్యం చేసుకోవడం, లేని పెత్తనానికి పూనుకోవడం, సర్వసత్తాక దేశాలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా దాడులకు, యుద్ధాలకు పురికొల్పడం, దిగడం వంటి ఏకపక్ష విపరీత ధోరణులు ఆ దేశ ఔన్నత్యాన్ని ప్రశ్నించేలా ఉన్నాయి. విషయమేదైనా సరే, అది తనకు ఉపయోపడుతుందా? అన్నదే ఆ దేశ లక్ష్యాలుగా ఉన్నాయి. నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్న చందంగా అమెరికా ప్రపంచ దేశాల పట్ల వ్యవహరిస్తున్న పద్ధతులున్నాయి. తన బాధిత దేశాలపై అమెరికా దాష్టీకం కొంత కాలం నడవొచ్చు. కానీ, ఏదో ఒక రోజు ఆ బాధిత దేశాలతోపాటు ప్రపంచ దేశాలన్నీ కలిసి ఆ దేశంపై దండయాత్ర చేసే అవకాశం ఎవరూ కాదనలేని వాస్తవం.

అమెరికా ఆశించినట్లు దానికి ఎదురే లేకుండా అన్ని దేశాలూ యుద్ధాల వల్లో, సుంకాల వల్లో మరే కారణాల వల్లో నిర్వీర్యం అయ్యాయనుకుందాం. అప్పుడు చుట్టూ జీవంలేని దేశాలు, ప్రజలతో ఆ దేశం ఎలా మనగలుతుంది? ఈ మాత్రం ఇంగితం లేక అనుకోలేం కానీ, ఎవరికైనా సాగుతున్నంత కాలం ట్రంప్ లాగే, సాగించుకోవాలనే ఉంటుంది.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొదట భారత్ పై పాక్ ఉగ్రదాడిలో జోక్యం చేసుకున్నారు. పాక్ తోకముడిచి కాళ్ళ బేరానికి వస్తే, ఆ యుద్ధాన్ని ఇరుదేశాలతో మాట్లాడి తామే నిలిపేశామని, తనను నోబెల్ శాంతి బహుమతికి సిఫారసు చేయాలని ఒత్తిడి తెచ్చారు. ఆ పాచిక పారకపోవడంతో తమ దేశ అన్ని ఎగుమతులపై సుంకాలు విధించారు. భారత్ పై కూడా ముందుగా 25శాతం, ఆ తర్వాత దాన్ని 50శాతానికి పెంచి, తిరిగి 25శాతం దగ్గర నిలిపారు. చమురును రష్యా నుంచి కొనుగోలు చేయడం ద్వారా భారత్ పరోక్షంగా ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధానికి సహకరిస్తున్నదని నిందారోపణ చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపేయాలని హూంకరించారు. ఆ తర్వాత వీసాల్లోని లోపాల కారణంతో అమెరికాలోని ఎన్ఆర్ఐలపై వెంటాడి, వేటాడి బేడీలు వేసి, అరెస్టు చేసి నానా యాగి చేసింది. భారత్ కు స్నేహహస్తం సాచినట్లే సాచి, హెచ్-1బీ వీసాల ఫీజును లక్ష డాలర్లకు పెంచారు. అమెరికా జనాభాలో రెండో అత్యధిక జనాభాగా 15శాతం ఉన్న భారతీయ టెకీలపై, టెక్నాలజీలో 70శాతానికి పైగా వాటా ఉన్న మన వాళ్ళపై, కొత్తగా ఆ దేశానికి వెళ్ళాలనుకునే వాళ్ళపై ఈ ప్రభావం తీవ్రంగా పడింది. హెచ్-1బీపై అమెరికాలో ఉన్న లక్ష మంది భారతీయులపై ఆ ప్రభావం పడింది. చివరకు ఆ పెరిగిన రుసుం ప్రతి ఏటా చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకసారి చెల్లిస్తే చాలని ముక్తాయించింది.

సుంకాలపై ఎదురు సుంకాలు విధించి చైనా, అమెరికాను గట్టిగానే ఎదురించింది. భారత ప్రధాని మోదీ సైలెంట్ గా షాంఘై సదస్సులో చైనా, అమెరికా అధ్యక్షులతో అరమరికలు లేకుండా వ్యవహరించి అమెరికా వెన్నులో వణుకు పుట్టించారు. అయితే తోలు మందమైన ట్రంప్ కు, బరితెగించిన అమెరికాకు ఈ టిట్ ఫర్ టాట్ సరిపోలేదనిపిస్తోంది.

భారత్ ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. అధిక జనాభాతోపాటు, వనరులు, మధో సంపత్తి సుసంపన్నగా కలిగిన దేశంగా భారత్ అత్యధిక మార్కెట్ కలిగిన దేశం కూడా. అందువల్ల ప్రపంచ దేశాల దిగ్గజ కంపెనీలన్నీ భారత్ వైపే చూస్తున్నాయి. చివరకు అమెరికా కన్ను కూడా భారత్ పైనే ఉంది. భారత్‌ ఆర్థిక మూలాలలను దెబ్బతీయడమే అమెరికా లక్ష్యంగా కనిపిస్తున్నది. అమెరికాకు భారత్ మోకరిల్లాలనే ఆధిపత్య ధోరణి ట్రంప్‌లో కనిపిస్తోంది. ఓట్ల కోసం భారత్‌ను, ఎన్నారైల కాళ్ళా, వేళ్ళా పడి, మోదీతో చెలిమిని నటించిన ట్రంప్‌, గెలిచాక గేర్‌ మార్చడం వెనక సొంత ప్రయోజనాలు అనేకం ఉన్నాయి.
భారత్‌ ఆర్థికంగా ఎదిగితే తమకు పోటీ అవుతుందన్న బెంగ ప్రధానంగా ఉంది. సైనికంగా స్వయం సమృద్ధిని సాధించడాన్ని కూడా ట్రంప్‌ తట్టుకోలేకపోతున్నాడు. ఆపరేషన్‌ సిందూర్‌ తరవాత అమెరికా పాక్ కు అందించిన తుపాస్ ఆయుధాలు తుస్సు మనడంతో ఆయనలో అవమానం, అసహనం పెరిగింది. భారత్‌ సైనిక సత్తా చాటి, స్వదేశీ ఆయుధాలతోనే పాక్‌ పీచమణిచింది. పాక్‌లో తన స్థావరం ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్న అమెరికాకు ఇది గిట్టడం లేదు. పాక్‌ ఆర్మీ చీఫ్‌ను పిలిపించుకుని, చంకనెత్తుకుని, పాక్‌తో వాణిజ్యం కూడా మొదలు పెట్టారు. తాజాగా అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను కొనేలా భారత్ పై ఒత్తిడి తెస్తున్నారు. మొత్తంగా భారత్‌ మార్కెట్‌ను దెబ్బతీసే కుట్ర కూడా ఇందులో దాగివుంది.

అందుకే, భారత ప్రధాని మొన్న ప్రజలకు ఓ బహిరంగ లేఖ విడుదుల చేశారు. విదేశీ తంత్రానికి స్వదేశీ మంత్రమే బెటరని ఉద్బోధించారు. మనం ముందుగా స్వదేశీ స్వావలంబనను సాధించాలి. మన దగ్గరే ఉద్యోగావకాశాలు పెంచాలి. ఒసామాబిన్‌ లాడెన్‌ ఉగ్రచర్యలను ట్రంప్‌ మరచిపోయారు. పాక్‌ను దువ్వి పాలు పోస్తున్నారు. దీనికి అమెరికా మూల్యం చెల్లించుకోక తప్పదు. పాక్‌ కూడా అమెరికా అండతో భారత్‌పై మరింత కాలుదువ్వే అవకాశాలు ఉన్నాయి. ఉగ్రచర్యలను ప్రేరేపించవచ్చు. మనం మరింత అప్రమత్తంగా ఉండాలి.

Latest News

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

గుప్తుల సమాజం|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|HISTORY

గుప్తుల సామ్రాజ్యం అనేక రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ రాష్ట్రాలను భుక్తులు అని పిలిచేవారు. ఒక భుక్తి యొక్క ముఖ్య అధికారిని ఉపారిక అన్నారు. ఈ భుక్తులను విషయాలుగా (జిల్లాలుగా) విభజించారు. ఒక విషయం...

గీ ఊర్లల్ల యేడ సూసినా, యేడి నీల్లే!?|ADUGU TRENDS

గా ఊర్లల్ల భూమి కింద మంట పెట్టినట్లు... అదే పనిగ కట్టెలెగేస్తున్నట్లు... కరెంటుతో గీజరేసినట్లు... యేడి నీల్లు ఉబికి వత్తయి.! ఒకేళ వాన పడ్డా సరే, పెనం మీద నీల్లు పోసినట్లు భూమి...

ప్రపంచానికి బ్రిక్స్ సరికొత్త దశాదిశ!?|EDITORIAL

ఢిల్లీ సదస్సు బ్రిక్స్ కు కొత్త దిశను సూచిస్తోంది. ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్‌కు గొంతుక, ఆర్థిక సంస్థల్లో సమాన ప్రాతినిధ్యం వంటి లక్ష్యాలు స్వాగతించదగినవే. అయితే, తీర్మానాల అమలే అసలు...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 13 నుండి సెప్టెంబర్ 19 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం...

గీ బూచోడు, ఎంత మంచోడో!?|ADUGU TRENDS

మనుసుల్లో మంచి మనుసులున్నట్లే.. దొంగల్ల కూడ మంచి దొంగలుంటారని నిరూపించాడో దొంగ. తను దోసుకున్న దేవుడి నగలే కాదు, వాటిని మరమ్మతు సేయడానికి కొంత నగదు కూడా పెట్టి, దేవుడా శమించు... తప్పైందని...

వానల్లేక అన్నదాతల విలవిల!?|EDITORIAL

వర్షం పడటం ప్రకృతి చేతిలో ఉండొచ్చు. కానీ వర్షం పడకపోయినా రైతును కాపాడే వ్యవస్థను నిర్మించడం మాత్రం పాలకుల చేతుల్లోనే ఉంది. వరుణుడి కోసం ఎదురుచూస్తూ చేతులు ముడుచుకుంటే కరువు ముప్పు మరింత...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News