NEW|కొత్త MINISTERS|మంత్రుల PORTFOLIO|శాఖల కేటాయింపుపై కీలక చర్చ?
TELANGANA| తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు (జూన్ 9) ఢిల్లీ పర్యటనకు బయలుదేరనున్నారు. ఉదయం 10 గంటలకు SHAMSHABAD| శంషాబాద్ INTERNATIONAL| అంతర్జాతీయAIRPORT| విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళనున్నారు. నిన్న జరిగిన క్యాబినెట్ విస్తరణలో భాగంగా చెన్నూరు MLA| ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. వీరికి శాఖల కేటాయింపుపై తుది నిర్ణయం తీసుకోవడానికి, అలాగే పార్టీ వ్యూహాలపై చర్చించడానికి సీఎం ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం.
ఈ నేపధ్యంలో రేవంత్ రెడ్డి AICC| ఏఐసీసీ పెద్దలను కలవనున్నారు. ముఖ్యంగా CONGRESS| కాంగ్రెస్ అగ్రనేతలు, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌తో విస్తృతంగా చర్చలు జరగనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల ఆమెతో సీఎం సమావేశమై పార్టీ పదవులపై కీలక చర్చలు జరిపిన నేపథ్యంలో, ఈ పర్యటనలో ఆ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
ప్రస్తుతం సీఎం వద్ద మునిసిపల్, పట్టణాభివృద్ధి, హోం, విద్య, మైనారిటీ వ్యవహారాల వంటి కీలక శాఖలున్నాయి. అయితే కొత్త మంత్రులకు ఈ శాఖలే కేటాయిస్తారా లేక ఇప్పటికే ఉన్న మంత్రుల శాఖల్లో మార్పులు చేస్తారా అన్న దానిపై పార్టీలో చర్చ సాగుతోంది. ఈ పరిణామాలు తుదిదశలోకి చేరడంతో ఢిల్లీ పర్యటన కీలకంగా మారింది. ఇటు పార్టీ లోపల సమీకరణలు, అటు ప్రభుత్వ పరిపాలనలో సమతుల్యత కోసం చేపట్టే ఈ పునర్విభజనపై కార్యకర్తలతో పాటు అధికారవర్గాలు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

