Monday, August 10, 2026
29.8 C
Hyderabad

నీట్ పరీక్షల బిల్లులో పటిష్టతేది!?|EDITORIAL

కొత్త బిల్లు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు. ఎంత కఠినమైన శిక్షల బిల్లు తెచ్చినా, లీకేజీలకు పాల్పడేవారు శిక్షల నుంచి తప్పించుకునే మార్గాలను వెతుకుతూనే ఉంటారు. అందువల్ల శిక్షల కంటే వ్యవస్థను బలోపేతం చేయడంపైనే ప్రభుత్వం దృష్టి సారించాలి. కనీసం ఈ బిల్లు సందర్భంగా అయినా విద్యా విధాన సంస్కరణలపై పార్లమెంటులో సార్థకమైన చర్చ జరిగి ఉంటే దేశానికి మరింత ఉపయోగకరంగా ఉండేది. ఆ పని మన పార్టీలు, మన ప్రభుత్వాలు చేయలేవన్నది మరోసారి ఆవిష్కారమైంది. ఆ చిత్తశుద్ధి మన పాలకులకు కొరవడటం మన దేశ ప్రజల దౌర్భాగ్యం.

‘పిల్లికి చెలగాటం… ఎలుకకు ప్రాణసంకటం’ అన్నట్లు మన దేశంలోని పరీక్షల వ్యవస్థ మారిపోయింది. ఇటీవల జరిగిన నీట్ ప్రవేశ పరీక్ష పేపర్ లీక్ ఘటన దేశ పరీక్షల నిర్వహణ ఎంత బలహీనంగా ఉందో మరోసారి బహిర్గతం చేసింది. డబ్బు కోసం కొందరు అధికారులు, విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు కలిసి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతూ అడ్డంగా బుక్కయ్యారు. ఆ తర్వాత పరిణామాల్లో ప్రభుత్వం కొత్త బిల్లును తెచ్చింది.

నీట్ పేపర్ లీక్ నేపథ్యంలో ప్రభుత్వం పరీక్షలలో అక్రమాలను నిరోధించేందుకు కొత్త బిల్లును తీసుకొచ్చింది. పార్లమెంటులో దీనిపై చర్చ జరిగినా, అధికార పక్షం గానీ, ప్రతిపక్షం గానీ పరీక్షల వ్యవస్థను సమూలంగా సంస్కరించే స్పష్టమైన నిర్మాణాత్మక సూచనలు చేయలేకపోయాయి. ప్రతిపక్షం ప్రధానంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడానికే పరిమితమైంది. ప్రభుత్వం కూడా కఠిన శిక్షలపై దృష్టి పెట్టింది తప్ప, అసలు లీకేజీలకే అవకాశం లేకుండా పరీక్షల నిర్వహణను పటిష్ఠం చేయాలనే కీలక అంశానికి తగిన ప్రాధాన్యం ఇవ్వలేదు.

పేపర్ లీకేజీ వంటి నేరాలకు కఠిన శిక్షలు అవసరమే. అయితే శిక్షలతో మాత్రమే సమస్య పరిష్కారం కాదు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం, సాంకేతిక భద్రత, స్వతంత్ర పర్యవేక్షణ వంటి అంశాలను బిల్లులో తప్పనిసరిగా పొందుపరచాలి. లేకపోతే ఈ చట్టం కూడా కేవలం ప్రతీకాత్మక చర్యగానే మిగిలిపోతుంది.

నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాతోనే దేశ విద్యా వ్యవస్థలోని లోపాలు తొలగిపోవు. తర్వాత జరిగే పరీక్షలన్నీ సజావుగా జరిగిపోవు. అసలు సమస్య వ్యవస్థలో ఉంది. అవినీతి, అక్రమాలు, పేపర్ లీకేజీలకు వ్యవస్థీకృత మూల కారణాలను నిర్మూలించకుండా వ్యక్తులను మార్చడం వల్ల శాశ్వత పరిష్కారం లభించదు.

ఈ నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) పనితీరును సమగ్రంగా సమీక్షించాల్సిన అవసరం ఉంది. ఎన్‌టీఏ ఒక అకడమిక్ లేదా రాజ్యాంగబద్ధ సంస్థ కాదు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పరీక్షల నిర్వహణ సంస్థ మాత్రమే. అయినప్పటికీ దేశవ్యాప్తంగా అనేక కీలక ప్రవేశ, పోటీ పరీక్షల నిర్వహణ బాధ్యతను దానికే అప్పగించారు. ఫలితంగా పరీక్షల నిర్వహణలో అధికారం కేంద్రీకృతమైంది.

నీట్ కోచింగ్ సెంటర్ల నిర్వాహకులే ప్రశ్నపత్రాల రూపకల్పనలో భాగస్వాములయ్యారన్న ఆరోపణలు వినిపించడం ఆందోళనకరం. దీని ద్వారా కోచింగ్ మాఫియా పరీక్షల వ్యవస్థపై ఎంత ప్రభావం చూపుతోందో అర్థమవుతోంది. వేల కోట్ల రూపాయల వ్యాపార ప్రయోజనాలు ముడిపడిన ఈ వ్యవస్థలో అధికార యంత్రాంగం సహకారం లేకుండా ఇలాంటి అక్రమాలు జరగడం సాధ్యం కాదు.

అందువల్ల ఎన్‌టీఏ ఉనికిని, దాని పనితీరును, జవాబుదారీతనాన్ని పునఃసమీక్షించాల్సిన అవసరం ఉంది. కేవలం కొందరు మధ్యవర్తులను, అధికారులు లేదా ఉద్యోగులను శిక్షించడం ద్వారా సమస్య పరిష్కారం కాదు. అవినీతికి కారణమవుతున్న మొత్తం వ్యవస్థనే సంస్కరించాలి.

అదే సమయంలో, మెడికల్ ప్రవేశ పరీక్షలను మళ్లీ రాష్ట్రాల స్థాయిలో నిర్వహించే ప్రతిపాదనను కూడా చర్చించి, సమీక్షించాల్సిన అవసరం ఉంది. విద్య ఉమ్మడి జాబితాలో ఉన్న నేపథ్యంలో రాష్ట్రాల హక్కులను పరిరక్షించే విధానాలపై కూడా చర్చ జరగాలి. అయితే రాష్ట్రాల స్థాయిలో గతంలో కూడా పేపర్ లీకేజీలు, అక్రమాలు జరిగిన విషయం మరవకూడదు. కాబట్టి పరిష్కారం కేవలం కేంద్రం లేదా రాష్ట్రం అనే ప్రశ్నలో కాకుండా, పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన పటిష్టమైన పరీక్షల నిర్వహణ వ్యవస్థను రూపొందించడంలో ఉంది.

ఇప్పటి పరిస్థితుల్లో చదువు అంటే వైద్యం, ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, మేనేజ్‌మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కొద్ది కోర్సులకే పరిమితమైపోయింది. జేఈఈ, నీట్ వంటి పరీక్షల్లో ర్యాంకు సాధించడమే విద్యార్థుల లక్ష్యంగా మారింది. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని కోచింగ్ పరిశ్రమ వేల కోట్ల రూపాయల వ్యాపారంగా విస్తరించింది. విద్య ఒక సేవగా కాకుండా వ్యాపార వస్తువుగా మారిపోవడానికి ప్రభుత్వ విధానాలు కూడా కారణమయ్యాయి.

నిరుద్యోగం పెరగడం, ఉపాధి అవకాశాలు తగ్గిపోవడం వల్ల తల్లిదండ్రుల్లో పిల్లల భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ పరిస్థితులను కోచింగ్ సంస్థలు వ్యాపార అవకాశాలుగా మలుచుకుంటున్నాయి. ఫలితంగా విద్యార్థులపై మానసిక ఒత్తిడి పెరుగుతోంది.

కాబట్టి పేపర్ లీకేజీలను అరికట్టేందుకు కేవలం కఠిన శిక్షలు విధించడం సరిపోదు. సమగ్ర విద్యా సంస్కరణలు, పారదర్శక పరీక్షల నిర్వహణ, కోచింగ్ మాఫియాపై కఠిన నియంత్రణ, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడం, విద్యలో సమాన అవకాశాలను కల్పించడం వంటి చర్యలు అవసరం. ఇవన్నీ ప్రజల భాగస్వామ్యంతో, విస్తృత చర్చల ద్వారా అమలు చేయాల్సి ఉంటుంది.

కొత్త బిల్లు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు. ఎంత కఠినమైన శిక్షల బిల్లు తెచ్చినా, లీకేజీలకు పాల్పడేవారు శిక్షల నుంచి తప్పించుకునే మార్గాలను వెతుకుతూనే ఉంటారు. అందువల్ల శిక్షల కంటే వ్యవస్థను బలోపేతం చేయడంపైనే ప్రభుత్వం దృష్టి సారించాలి. కనీసం ఈ బిల్లు సందర్భంగా అయినా విద్యా విధాన సంస్కరణలపై పార్లమెంటులో సార్థకమైన చర్చ జరిగి ఉంటే దేశానికి మరింత ఉపయోగకరంగా ఉండేది. ఆ పని మన పార్టీలు, మన ప్రభుత్వాలు చేయలేవన్నది మరోసారి ఆవిష్కారమైంది. ఆ చిత్తశుద్ధి మన పాలకులకు కొరవడటం మన దేశ ప్రజల దౌర్భాగ్యం.

Latest News

ఆగస్టు 10, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి ద్వాదశి ఉదయం 06.13 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం ఆరుద్ర ఉదయం 11.53 వరకు ఉపరి పునర్వసు యోగం వజ్ర రాత్రి 11.10 వరకు ఉపరి సిద్ది కరణం తైతుల ఉదయం 06.13 వరకు ఉపరి...

బోనాలు – చరిత్ర, సంస్కృతి, సంప్రదాయం|BONALU|HISTORY|CULTURE

చారిత్రక, పురావస్తు, శాసన, సాహిత్య ఆధారాల విశ్లేషణ ప్రకారం బోనం సమర్పించే ఆచారం ఆషాఢ మాసంలో తెలంగాణతో పాటు దక్షిణ భారతదేశంలోని అనేక గ్రామాల్లో గ్రామదేవతారాధనలో అంతర్భాగంగా కొనసాగుతోంది. వర్షాకాలం ప్రారంభ దశలో...

కల్లుకు శిల్లు.. సీసీ కెమెరా!?|ADUGU TRENDS

యెన్కటికి దొంగకు శెప్పే లాభమన్నరు. దోసుకుంటోనికి శెప్పైనా, తప్పైనా ఒకటే. పడదలే సూసుకుంటడు. గట్లనే గీ మద్దెల దొంగలు తమ రూటు మార్సుకున్నరు. కంటికి కనుకు లేకుండా ఇంటికి కన్నాలేసుడు అసొంటివి మానేసిండ్రు....

రాహుల్ ముందున్న మార్గాలివే!?|EDITORIAL

రాహుల్‌ ముందున్నది ‘బొద్దింకలను బుట్టలో వేసుకోవడం’ కాదు. యువత నమ్మకాన్ని సంపాదించడం. ఆ నమ్మకం ఒక్క ఆందోళనతో రాదు. నిరంతర పోరాటం, స్పష్టమైన విధానాలు, ప్రత్యామ్నాయ పాలనా నమూనా, విశ్వసనీయ నాయకత్వం కావాలి....

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 09 నుండి ఆగస్టు 15 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశివారికి అనుకూలమైన మార్పులు చోటుచేసుకుంటాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. మీ పనితీరుకు ఉన్నతాధికారుల...

నవ్వినోల్లే నోర్లెల్లబెట్టిండ్రు!?|ADUGU TRENDS

సంకల్పించాలె కనీ, కాని పని ఉంటదా? ఉండనే ఉండదని నిరూపించిండు గీ పెద్దాయినె. నల్గురు సూసి నవ్వినా, నా పని నేను శేసుక పోతానని, శేసి సూపిండు. గీయినె పేరు హీలియో డా సల్వా....

క్యా బోల్తే… పాలక్!?|EDITORIAL

దేశ భవిష్యత్తు యువతే. ఆ యువత ప్రశ్నిస్తే వినాలి, సూచిస్తే ఆలోచించాలి, సమస్యలు చెబితే పరిష్కరించాలి. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలంటే అధికారానికి సమాంతరంగా జవాబుదారీతనాన్ని పెంపొందించే స్వతంత్ర ప్రజా వేదికలు అవసరం. ప్రజల...

ఆగస్టు 08, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి దశమి ఉదయం 11.09 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం రోహిణీ మధ్యాహ్నం 03.15 వరకు ఉపరి మృగశిర యోగం ధ్రువ ఉదయం 08.20 వరకు ఉపరి వ్యాఘాత కరణం భద్ర ఉదయం 11.09 వరకు ఉపరి...

ఇగిప్పుడు ‘సావు’కొచ్చింది!?|ADUGU TRENDS

మన ఊర్లల్ల ఎవ్వలన్న కాలం శేసిండ్రంటేనే సూసొత్తం. కనికరం సూపి తలో సెయ్యేత్తం. దిక్కూమొక్కూలేనోల్లతై మనమే తలా ఇంతేసుకుని గాయింత ఇగ గా కట్టెల్లేసొత్తం. కానీ, తలకొరివి పెట్టాల్సిన కన్న బిడ్డలే కడసారి...

శ్రద్ధేది? శుద్ధ దండగ!?|EDITORIAL

2025 వర్షాకాల సమావేశాల్లో నిర్ణయించిన సమయంలో లోక్‌సభ కేవలం 29%, రాజ్యసభ 34% మాత్రమే పనిచేశాయి. ప్రశ్నోత్తరాల సమయంలో లోక్‌సభలో కేవలం 23%, రాజ్యసభలో 6% మాత్రమే పని జరిగింది. అదే సమావేశాల్లో14...

ఆగస్టు 07, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి నవమి మధ్యాహ్నం 01.29 వరకు ఉపరి దశమి నక్షత్రం కృత్తిక సాయంత్రం 04.48 వరకు ఉపరి రోహిణీ యోగం వృద్ధి ఉదయం 11.17 వరకు ఉపరి ధ్రువ కరణం గరజి మధ్యాహ్నం 01.29 వరకు ఉపరి...

మౌర్య పూర్వయుగం|ADUGU SPECIAL|HISTORY|COMPITITIVE EXAMS

క్రీ.పూ.650 నుండి క్రీ.పూ.250 మధ్య ఉన్న కాలాన్ని మౌర్యుల పూర్వయుగం లేదా బుద్ధుని యుగం లేదా షోడశ మహాజనపాదాల యుగం అని అంటారు. ఈ కాలంలో గౌతమ బుద్ధుడు ముఖ్య పురుషుడు కాబట్టి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News