Thursday, July 30, 2026
23.7 C
Hyderabad

PENSIONS|పెన్షన్లు పెంచుతరా? గద్దె దిగుతరా?|MANDA KRISHNA MADIGA

CM|సీఎం ఇయ్యడు… KCR|కేసీఆర్ అడగడు
ASSEMBLY|అసెంబ్లీకి పోడు… జనంలోకి రాడు
OPPOSITION LEADER|ప్రతిపక్ష నేతగా కేసీఆర్ పనికి రాడు
తమ SALARIES|జీతాలు పెంచుకునే పాలకులు
పేదలకు పెన్షన్లు ఎందుకు పెంచరు?
కుల, మతాలకంటే మానవత్వమే ముఖ్యం
ఆరోగ్య బీమా నుండి ఆరోగ్యశ్రీ వరకు
తెచ్చిన ఘనత MRPS|ఎమ్మార్పీఎస్ దే!
పెన్షన్లు పెరిగింది ఎమ్మార్పీఎస్ కారణంగానే
మంద కృష్ణ ఉద్ఘాటన, ఘాటైన విమర్శలు
పాలకుర్తిలో సన్నాహక సదస్సు
సెప్టెంబర్ 3న హైదరాబాద్ లో జరిగే చేయూత వికలాంగుల మహాసభ జయప్రదానికి విజ్ఞప్తి

పాలకుర్తి, ఆగస్టు 12 (అడుగు న్యూస్):
పెన్షన్లు పెంచుతరా? లేక గద్దె దిగుతరా? అధికార పార్టీ తేల్చుకోవాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మంద కృష్ణమాదిగ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. పెన్షన్లను పెంచి ఇవ్వాల్సిన కాంగ్రెస్ ఇవ్వదు. అడగాల్సిన బీఆర్ఎస్ అడగదు. అంటే సీఎం ఇయ్యడు, కేసీఆర్ అడగడు. కేసీఆర్ అసెంబ్లీకి పోడు. జనంలోకి రాడు. ప్రతిపక్ష నేతగా పనికి రాడని తేల్చేశారు. ఇద్దరూ చంద్రబాబు శిష్యులే మరి, చంద్రబాబు అమలు చేస్తున్న పెన్షన్లను వీరెందుకు చేయడం లేదని ప్రశ్నించారు? తనకు కులం, మతం కంటే కూడా మానవత్వమే ఎక్కువని అందుకే తాను వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, దీర్ఘ కాలిక వ్యాధిగ్రస్తుల కోసం పోరాడుతున్నానని చెప్పారు. ఇప్పటి వరకు పెరిగిన పెన్షన్లన్నీ ఎమ్మార్పీఎస్ పోరాడి సాధించినవేనని సోదాహరణగా వివరించారు.

వికలాంగులకు రూ.6 వేలు, వ్రుద్ధులకు, వితంతువులకు రూ.4 వేలు, కండరాల సమస్య (మయోసైటీస్)లతో బాధపడేవారికి రూ.15వేలు పెన్షన్లను పెంచాలని డిమాండ్ చేస్తూ, సెప్టెంబర్ 3న హైదరాబాద్ లో నిర్వహించనున్న చేయూత పెన్షన్ దారుల గర్జన మహాసభకు సన్నాహకంగా జరుపుతున్న నియోజకవర్గాల స్థాయి సన్నాహక సమావేశాల్లో భాగంగా పాలకుర్తి నియోజకవర్గ స్థాయి సదస్సు పాలకుర్తిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో మంగళవారం జరిగింది. ఈ సదస్సుకు మంద కృష్ణమాదిగ ముఖ్య అతిథిగా విచ్చేసి, ప్రసంగించారు.

20 నెలలు గడిచినా, కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా పెన్షన్లను పెంచలేదన్నారు. ప్రతిపక్షం ఈ విషయమై ప్రశ్నించడం లేదన్నారు. వాళ్ళు విస్మరించినందునే తాను ఈ సమస్యను నెత్తినెత్తుకుని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నాని మంద కృష్ణ చెప్పారు. అత్యంత పేదల సమస్యలను అత్యున్నత వర్గాల పార్టీలు, పాలకులు, ప్రభుత్వాలు పట్టించుకోవన్నారు. రూ.75గా ఉన్న పెన్షన్ ను రూ.200లకు, తర్వాత 2007లో రూ.500లకు, 2014లో రూ.1500లకు, 2015లో రూ.3,000లకు, దీన్నే ర.3016లకు పెంచే విధంగా ఉద్యమాలు చేసి, ఒత్తిడి తెచ్చిన ఘనత ఎమ్మార్పీఎస్ దేనని ఆయన ఉదాహరణలు, పేపర్, ఫోటో, ఆడియో క్లిప్పింగులతో సహా వివరించారు. ఆనాడు దేశంలోనే అత్యంత తక్కువగా, ఈనాడు అత్యంత ఎక్కువగా పెన్షన్లు నిరుపేదలకు అందుతున్నాయంటే దానికి కారణం ఎమ్మార్పీఎస్ అన్నారు. అలాగే ఆనాడు వైఎస్ఆర్ సీఎంగా ఉన్న ఉమ్మడి ఏపీలో పేదలకు ఆరోగ్య బీమా, తర్వాత ఆరోగ్యశ్రీ పథకాన్ని అందించినందునే ఇవ్వాళ ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ.10లక్షలు చేతిలో ఉన్నట్లేగాక, ఆ మేరకు ఆరోగ్యం అందే అవకాశం ఏర్పడిందంన్నారు. ఇలాంటి ఉద్యమ చరిత్ర ఉన్న ఎమ్మార్పీఎస్ సెప్టెంబర్ 3న హైదరాబాద్ లో నిర్వహించే భారీ బహిరంగ సభకు లక్షలాదిగా పెన్షన్ దారులంతా తరలి రావాలని మంద కృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెన్షన్ దారులతోపాటు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు, మంద కృష్ణ అభిమానులు పాల్గొన్నారు.

Latest News

మా అమ్మాయిని పెండ్లి చేసుకోండి…|CJP|ABHIJITH DIPKE|MARRIAGE

CJP అధినేత అభిజీత్ దీప్కే తల్లి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు|MOTHER|ANITA DIPKE ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడిగా, విద్యార్థుల హక్కుల పోరాటంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిజీత్ దీప్కే వివాహంపై ఆయన తల్లి...

ఆర్యుల/వైదిక నాగరికత|HISTORY|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS

సింధు నాగరికత తర్వాత భారతదేశంలో అభివృద్ధి చెందిన రెండవ నాగరికత ఆర్యుల నాగరికత. ఈ ఆర్యులు నార్దిక్ జాతికి చెందినవారు. ఈ నార్దిక్ జాతి వారు ఆర్య అనే భాషను మాట్లాడడం ద్వారా...

గుండు కొట్టించుకోండ్రి! యేలు పట్టుకుపోండ్రి!?|ADUGU TRENDS

గుండు కొట్టించుకుంటే ఎవలన్నా పైసలిత్తరా? నిజంగనే ఇత్తరాని? ఇత్తరని గవాల్లు నమ్మిండ్రు. గుండు గూడా గీయించుకుండ్రు. పున్నానికొత్తే పినాయిల్ కూడా తాగుతరన్నట్టు, ఉచితాలకు మనోల్లు ఎంత అలవాటైపోయిండ్లో శేప్పే గీ ముచ్చట మీరే...

నీట్ పరీక్షల బిల్లులో పటిష్టతేది!?|EDITORIAL

కొత్త బిల్లు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు. ఎంత కఠినమైన శిక్షల బిల్లు తెచ్చినా, లీకేజీలకు పాల్పడేవారు శిక్షల నుంచి తప్పించుకునే మార్గాలను వెతుకుతూనే ఉంటారు. అందువల్ల శిక్షల కంటే వ్యవస్థను బలోపేతం...

జూలై 30, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పాడ్యమి రాత్రి 07.58 వరకు ఉపరి విదియ నక్షత్రం శ్రవణ సాయంత్రం 05.43 వరకు ఉపరి ధనిష్ఠ యోగం ఆయుష్మాన్ రాత్రి 01.02 నుండి ఉపరి సౌభాగ్య కరణం బాలవ ఉదయం 07.44...

సర్.. ఆ కుటుంబాన్ని కలిపింది సార్!?|ADUGU TRENDS

సర్ పక్రియ ఓట్లను తొలగించి సత్తెనాశనం శేసిందని, పతిపక్ష పార్టీలు అల్లరి శేసి ఆగమాగమైతాంటే, అధికార పార్టీ మాత్రం ఏ గిది మస్తుగుంటాందంటాంది. మొత్తానికి సర్, పార్టీలను యిడగొట్టినా, ఓ కుటుంబాన్ని కలిపింది....

హైడ్రా-పారదర్శకతే ప్రామాణికం కావాలి!|EDITORIAL

ప్రభుత్వ భూములను రక్షించడం ఎంత ముఖ్యమో, రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కు, సహజ న్యాయ సూత్రాలను కాపాడటం కూడా అంతే ముఖ్యమైనది. ప్రభుత్వం హైడ్రా ద్వారా ప్రభుత్వ భూములను కాపాడాలనే లక్ష్యాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం...

జూలై 29, బుధవారం, 2026|RASHI PHALALU

గురు పౌర్ణమి శాకాంబరీ ఉత్సవం శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి పౌర్ణమి రాత్రి 07.05 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 03.48 వరకు ఉపరి శ్రవణ యోగం ప్రీతి రాత్రి 01.03 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం భద్ర ఉదయం...

ద్రవరూప రంగుల విల్లు|ADUGU|SPECIAL STORY|CANO CRYSTALS

కొలంబియాలోని ‘లిక్విడ్ రెయిన్‌బో’ కానో క్రిస్టేల్స్ అద్భుత గాథ! ప్రకృతి ఒడిలో దాగున్న వింతలు, విశేషాలు ఎప్పుడూ మానవాళిని మంత్రముగ్ధులను చేస్తూనే ఉంటాయి. మన భూగోళంపై నీలిరంగులో నిర్మలంగా పారే నదులు, అద్దంలా మెరిసే...

అగ్గి పెట్టెతోటే హాజరీ!?|ADUGU TRENDS

పాఠం సెప్పుడంటే పుస్తకం సూసి సదువుడు కాదు. గండ్లున్నదాన్నే వళ్లె యేసుడు కాదు. బెత్తెం పట్టుకుని, బట్టీ పట్టిచ్చుడు అసలే కాదు. గా పిల్లల మెదల్లకు మేతేసుడు. పదను పెట్టుడు. కొత్తగ ఆచరించుడు,...

పార్టీలకు, ప్రభుత్వాలకు ‘నీట్’ గా ఓ హెచ్చరిక!|EDITORIAL

సామాన్య పౌరులు ప్రారంభించిన చిన్న ఉద్యమాలకు దేశవ్యాప్త ఆదరణ లభించడం రాజకీయ పార్టీలకు ఒక గట్టి హెచ్చరిక. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సంప్రదాయ నాయకత్వంపై మాత్రమే ఆధారపడటం లేదు. కొత్త...

జూలై 28, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 05.30 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం విష్కంబ రాత్రి 12.49 వరకు ఉపరి ప్రీతి కరణం వణజి సాయంత్రం 05.30 వరకు ఉపరి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News