Saturday, November 21, 2026
20.7 C
Hyderabad

‘సర్’ సర్వేపై సర్వత్రా నిరసనలు.. భరోసా ఏది!|EDITORIAL

‘సర్’పై నెలకొన్న వివాదాన్ని విస్తృత ప్రజాస్వామ్య విశ్వాస సంక్షోభంలో భాగంగా చూడాలి. ఎన్నికల సంఘం నిష్పక్షపాతత్వంపై సందేహాలు రాకుండా ప్రతి అభ్యంతరానికీ పారదర్శకంగా సమాధానం చెప్పాలి. అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి బయటపడకుండా పునఃపరిశీలనకు అవకాశం కల్పించాలి. అదే సమయంలో అనర్హుల తొలగింపు ప్రక్రియకు కూడా స్పష్టమైన ప్రమాణాలు, అప్పీల్‌ వ్యవస్థ ఉండాలి.!

మార్గం – అడుగు, ఎడిటోరియల్

ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ‘సర్’ రేపిన ప్రకంపనలు అంతా ఇంతా కావు. ఓటర్ల జాబితాలో అర్హులైన ఒక్క పౌరుడి పేరు కూడా తొలగిపోకూడదని, అనర్హులెవరూ చేరకూడదన్నదే ఎన్నికల సంఘం ప్రకటించిన లక్ష్యం. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 324, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల ఆధారంగా 2026 మేలో 16 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ‘సర్’ చేపట్టాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.

అయితే, ప్రక్రియలో ఎదురైన ఇబ్బందులు, ఓటర్ల పేర్ల తొలగింపుపై వచ్చిన ఆరోపణలు, పత్రాల సమర్పణపై నెలకొన్న సందేహాలు రాజకీయ దుమారం రేపాయి. ఇది కేవలం ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సాంకేతిక సమస్య కాదు. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది. ఒక అర్హుడి పేరు జాబితాలో లేకపోవడం అంటే అతని రాజకీయ స్వరం వినిపించకుండా పోవడమే. అందుకే ‘సర్’పై స్పష్టత కోరుతూ ప్రతిపక్షాలు, విద్యార్థి, యువజన సంఘాలు నిరసనలకు దిగుతున్నాయి. అక్టోబర్‌ 2న ఢిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ గ్యానేశ్‌ కుమార్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలో వెయ్యిమందికి పైగా అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.

అయితే, విమర్శలకు సమాధానం కేవలం రాజకీయ ప్రకటనలతో సరిపోదు. ఎన్నికల సంఘమే ‘సర్’ పూర్తయిన ప్రాంతాల్లో మిగిలిపోయిన, తొలిసారి ఓటు వేయబోయే యువతను గుర్తించి ప్రత్యేకంగా నమోదు చేయాలని అక్టోబర్‌ 2న ఆదేశించడం గమనార్హం. అంటే, వ్యవస్థలో ‘లెఫ్ట్‌-ఔట్‌’ ఓటర్లను తిరిగి చేర్చాల్సిన అవసరం అధికారికంగానే గుర్తించబడింది.

ఇక్కడి నుంచి ప్రశ్న మరింత విస్తరిస్తుంది. ప్రజలలో వ్యవస్థలపై నమ్మకం ఎందుకు తగ్గుతోంది? సమాధానం మన దేశ సరిహద్దులు దాటి ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. ఫ్రాన్స్ లో విద్యా రంగంపై యువత ఆగ్రహం అక్టోబర్‌ 6న దేశవ్యాప్త ఉద్యమంగా మారింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2.5 లక్షల మందికి పైగా ర్యాలీల్లో పాల్గొనగా, 891 పాఠశాలల్లో తరగతులు పూర్తిగా లేదా పాక్షికంగా నిలిచిపోయాయి. విద్యా నిధుల కొరత, సిబ్బంది సమస్యలు, పాఠశాలల అధ్వాన్న పరిస్థితులే ప్రధాన ఆందోళనలుగా నిలిచాయి.
ఇది యాదృచ్ఛికం కాదు. యువత తమ భవిష్యత్తుపై భద్రతను కోరుతోంది. విద్య తర్వాత ఉద్యోగం, ఉద్యోగం తర్వాత స్థిరమైన జీవితం, సొంత ఇల్లు ఒకప్పుడు సాధారణంగా కనిపించిన ఈ లక్ష్యాలు ఇప్పుడు అనేక దేశాల్లో అందని ద్రాక్షగా మారుతున్నాయి. వ్యవస్థలు తమ సమస్యలకు పరిష్కారం చూపడం లేదన్న భావన పెరిగినప్పుడు వీధే వారి వేదికగా మారుతోంది.

స్పెయిన్‌లో గృహ సంక్షోభం ఇదే వాస్తవాన్ని మరో కోణంలో చూపుతోంది. మాడ్రిడ్‌లో 87 ఏళ్ల వృద్ధురాలిని ఇంటి నుంచి ఖాళీ చేయించేందుకు జరిగిన ప్రయత్నం దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది. పెరుగుతున్న అద్దెలు, గృహాల కొరత, అందుబాటులో లేని ఇళ్లు ప్రధాన రాజకీయ అంశాలుగా మారాయి. ప్రధాని పెడ్రో సాంచెజ్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన గృహ సంస్కరణలను పార్లమెంట్‌ తిరస్కరించడంతో సంక్షోభం మరింత రాజకీయరూపం దాల్చింది. 2028 నాటికి స్పెయిన్‌లో గృహాల లోటు పది లక్షలకు చేరవచ్చన్న అంచనాలు పరిస్థితి తీవ్రతను సూచిస్తున్నాయి.

అమెరికా నుంచి యూరప్‌ వరకు, ఆసియా నుంచి ఆఫ్రికా వరకు కనిపిస్తున్న ఈ నిరసనల వెనుక ఒకే సామాన్య అంశం ఉంది. ప్రజల, ముఖ్యంగా యువత, వ్యవస్థలపై నమ్మకం క్షీణించడం. నిరుద్యోగం, సామాజిక అసమానతలు, జీవన వ్యయం, వాతావరణ మార్పులు, యుద్ధాలు, రాజకీయ అస్థిరత ఇవన్నీ భవిష్యత్తుపై భయాన్ని పెంచుతున్నాయి.

ఈ నేపథ్యంలో ‘సర్’పై నెలకొన్న వివాదాన్ని కూడా విస్తృత ప్రజాస్వామ్య విశ్వాస సంక్షోభంలో భాగంగా చూడాలి. ఎన్నికల సంఘం నిష్పక్షపాతత్వంపై సందేహాలు రాకుండా ప్రతి అభ్యంతరానికీ పారదర్శకంగా సమాధానం చెప్పాలి. అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి బయటపడకుండా పునఃపరిశీలనకు అవకాశం కల్పించాలి. అదే సమయంలో అనర్హుల తొలగింపు ప్రక్రియకు కూడా స్పష్టమైన ప్రమాణాలు, అప్పీల్‌ వ్యవస్థ ఉండాలి.

ప్రజల నిరసనలను అణచివేయడం సులభం. వాటికి కారణమైన అసంతృప్తిని తొలగించడం కష్టం. అందుకే ప్రభుత్వాలు కొత్తతరం స్వరాన్ని శత్రుత్వంగా కాకుండా హెచ్చరికగా వినాలి. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కుపై నమ్మకం దెబ్బతింటే, ఆ నమ్మకాన్ని పునరుద్ధరించడమే మొదటి కర్తవ్యం. ‘సర్’పై స్పష్టత ఎంత త్వరగా వస్తే, అంత త్వరగా అనుమానాల మబ్బులు తొలగుతాయి.

Latest News

ఢిల్లీ సుల్తానులు|HISTORY|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS|EDUCATION

ఢిల్లీ సుల్తానులు పాలించిన ప్రాంతాలను ఇస్లాం భాషలో సల్తనత్ అంటారు. సల్తనత్ అనగా రాజ్యము అని అర్థం. రాజ్యాన్ని పాలించిన రాజులను సుల్తానులు అంటారు. కాబట్టి ఈ ఢిల్లీ సుల్తానులకు గల మరో...

భారత్ కు సవాల్ గా పాక్, చైనా వ్యూహాలు!?|EDITORIAL

పాకిస్తాన్ కు చైనా అండదండలు. భారత్‌ను చుట్టుముట్టే వ్యూహాలు! డ్రాగన్ ద్వంద్వ నీతిపై అమెరికా నివేదిక సంచలన వ్యాఖ్యలు. ఆసియాలో మారుతున్న శక్తి సమీకరణాలు భారత్‌కు కొత్త సవాళ్లను విసురుతున్నాయి! మార్గం - అడుగు,...

వార/ఈ రోజు రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

నవంబర్ 22 నుండి నవంబర్ 28 వరకు రాశి ఫలాలు మేష రాశి అనుకున్న పనులను పూర్తి చేసే అవకాశం లభిస్తుంది. ఉద్యోగ రంగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారస్తులకు కొత్త పరిచయాల ద్వారా...

వలెయ్యకుండనే శేతికి లచ్చల శేపలు!?|ADUGU TRENDS

ఎన్కటికి వట్టి శేపల కూర వడిపిల్ల మెతుకులని మస్తు తినేటోల్లు. ఇప్పటికీ శేపలంటే కొందరు శెవులు కోసుకుంటరు. రుశికి రుశి, ఆరోగ్యానికారోగ్యం. గా కౌసుకు, ముండ్లకు భయపడ్తరు గనీ, గాదాన్ని కాదంటే, గా...

నగరానికి గోదావరి జలాలు పరిష్కారమేనా?|EDITORIAL

హైదరాబాద్‌కు 40 ఎంజీడీల అదనపు గోదావరి జలాలు అందుబాటులోకి రావడం ఉపశమనమే తప్ప శాశ్వత పరిష్కారం కాదు. పైప్‌లైన్ పనులు, ట్రయల్ రన్ విజయవంతమై, నీటి పంపిణీ సమర్థంగా జరగాలి. మరోవైపు వర్షపు...

నవంబర్ 21, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు కార్తీకమాసం శుక్లపక్షం చిలుకు ద్వాదశి తులసి వివాహం చాతుర్మాస్య వ్రతసమాప్తి తిధి శు ద్వాదశి రాత్రి 01.16 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం రేవతి రాత్రి తెల్ల 03.24 వరకు ఉపరి అశ్విని యోగం సిద్ది రాత్రి 12.55...

ఆకరి సూపు కోసం అవ్వ శవం ఎదురు సూత్తాంది!?|ADUGU TRENDS

తలంత బలగం, తలకు పోసే దిక్కులేకుండా పోయిందనే సామెత గా అవ్వకు బాగా అతికింది. గా తల్లికి ఇద్దరు బిడ్డలు. బంధుగులు కూడా ఉన్నరు. కానీ, గవాల్లంతా గిప్పుడు యాడున్నరో తెలవదు. 40...

రైతులకు, వినియోగదారులకు ‘గిట్టు’బాటేది!?|EDITORIAL

రైతుకు గిట్టుబాటు ధర రావడం, వినియోగదారుడికి సరసమైన ధరకు కూరగాయలు అందడం పరస్పర విరుద్ధమేమీ కావు. మధ్యలోని సరఫరా వ్యవస్థను సమర్థంగా తీర్చిదిద్దితే, రెండూ సాధ్యమే. రైతు నష్టపోకుండా, వినియోగదారుడికి భారం కాకుండా...

నవంబర్ 20, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు కార్తీకమాసం శుక్లపక్షం తిధి శు ఏకాదశి రాత్రి 01.54 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 03.29 వరకు ఉపరి రేవతి యోగం వజ్ర రాత్రి 02.33 వరకు ఉపరి సిద్ది కరణం వణజి పగలు 02.01...

పచ్చని సంసారంల చాట్ జీపీటీ చిచ్చు!?|ADUGU TRENDS

దేని మీదనైనా ఆధారపడినా, అలవాటైనా ఇగంతే సంగతులు. అయిన దానికి, కాని దానికి కూడా గాదాని మీదకే పానం గుంజుతది. గట్లనే గా లెక్కలు శేసే కాలుక్ లేటర్, శేతుల్ల పట్టుకునే పోన్లు...

కాలుష్య కాసారంగా భూగోళం!?|EDITORIAL

ప్రకృతిని కాపాడితేనే మన భవిష్యత్తును కాపాడుకోగలం. భావితరాలకు కాలుష్య భరిత ప్రపంచాన్ని కాకుండా ఆరోగ్యకరమైన భూగోళాన్ని అందించడం నేటి తరంపై ఉన్న చారిత్రక బాధ్యత!? మార్గం - అడుగు, ఎడిటోరియల్  ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి పేరుతో...

నవంబర్ 19, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు కార్తీకమాసం శుక్లపక్షం తిధి శు.దశమి రాత్రి 02.03 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం పూర్వాభాద్ర రాత్రి 03.02 వరకు ఉప6 ఉత్తరాభాద్ర యోగం హర్షణ రాత్రి తెల్ల 03.53 వరకు ఉపరి వజ్ర కరణం తైతుల పగలు 01.54...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News