అమెరికా ఇంటెలిజెన్స్ వెల్లడి
ఇరాన్ అణుబాంబు తయారీకి రహస్య ప్రయత్నాలు ప్రారంభించినట్లు అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఈ విషయం ఇటీవల న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో వెల్లడించింది. ఇరాన్ ప్రభుత్వం అణ్వస్త్ర తయారీకి అనుమతి ఇస్తే, అక్కడి శాస్త్రవేత్తలు ఇప్పటికే సిద్ధంగా ఉన్న యూరేనియం నిల్వలతో కొన్ని నెలల్లోనే బాంబు తయారు చేసేలా ప్రణాళికలు రూపొందించారని ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఈ సమాచారం బైడెన్ అధికారంలో ఉన్నప్పుడే సేకరించారని, తాజా పరిణామాలను ఇప్పుడు ట్రంప్ కార్యవర్గంతోనూ పంచుకున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ ఈ ప్రయత్నాలను ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.

