– కూరగాయలు కొంటూ కుశలం అడిగిన ఎమ్మెల్యే
అవ్వా..! ఎట్లున్నవు? బాగున్నవా? గిరాకీ బాగుందా? ఏమేం కూరగాయలు ఉన్నాయి? క్యారెట్స్, బీట్ రూట్ ఎట్లిస్తున్నవు? అంటూ కుశల ప్రశ్నలు వేస్తూ పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి స్వయంగా కొన్నారు. పాలకుర్తి మండలం చెన్నూరు గ్రామంలో ఈ ఘటన జరిగింది. తన కార్యక్రమాలు ముగించుకొని వెళ్తుండగా, చెన్నూరులో వారం వారం జరిగే అంగడి నుంచే వెళుతూ, మార్గమధ్యంలో ఎమ్మెల్యే కారు ఆపి మరీ కూరగాయలు కొన్నారు. అదే సమయంలో అక్కడి ప్రజలతో మమేకమవుతూ… వారి సమస్యలు తెలుసుకుంటూ సాధారణ మహిళగా కలిసిపోయారు. ఈ దృశ్యాలు చూసిన ప్రజలు సంబ్రమాశ్చర్యానికి గురయ్యారు.



