Friday, September 25, 2026
23.6 C
Hyderabad

స్పందించ “వేం” !?

ఉలక’వేం’? పలక’వేం’!?
మౌనంగా ఉంటా”వేం”!?
– అజంజాహి కార్మిక భవనం కూల్చి రెండు నెలలైనా మాట్లాడ “వేం”!?
సీఎం ప్రధాన సలహాదారుగా మీ సూచనలేంటి?
సీఎం గారికి మీరిస్తున్న సలహాలేంటి?
కాంగ్రెస్ నేతగా కార్మికులకు ఏ కబురంపుతారు?
ఈ జిల్లా నేత గా మీ జవాబు ఏంటి?
మీ జోక్యం కోసం కోసం అజం జాహి కార్మిక లోకం ఆశగా ఎదురుచూస్తున్నది

కొందరికి అవకాశాలు అరుదుగా వస్తుంటాయి. కానీ కొందరికి అరుదైన అవకాశాలు వస్తాయి. రెండు కోవలకు చెందిన వారు వేం నరేందర్ రెడ్డి. కే సముద్రం మండలం అర్పణ పల్లె లో పుట్టిన ఆయన వరంగల్ సి కె ఎం కాలేజీలో డిగ్రీ చేసి, 2004లో మహబూబాబాద్ ఎమ్మెల్యే అయ్యారు. కాలక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారాల ప్రధాన సలహాదారుగా నియమింపబడ్డారు. ఆయనకు వరంగల్ చరిత్ర తెలుసు. ఆజం జాహి మిల్లు చరిత్రా తెలుసు. కార్మికుల సంగతి తెలుసు. మిల్లు కార్మిక భవన స్థలం కబ్జా సంగతీ తెలుసు. ఆ స్థలాన్ని ఎప్పుడు? ఎలా? ఏం? చేయాలో కూడా తెలుసు. సమస్య తెలుసు! పరిష్కారం కూడా తెలుసు!! అ(ఇ)న్నీ తెలిసిన, సీఎం కే సలహాలిచ్చే పొజిషన్ లో ఉన్న వేం నరేందర్ రెడ్డి మాత్రం మౌనం వీడటం లేదేం!? ఉలక’వేం’? పలక’వేం’!? మౌనంగా ఉంటా”వేం”!? అజం జాహి కార్మిక భవనం కూల్చి రెండు నెలలైనా మాట్లాడ “వేం”!? అంటూ “వేం” జోక్యం కోసం మిల్లు కార్మిక లోకం కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని మరీ ఎదురుచూస్తున్నది.

వరంగల్ మట్టి పరిమళం వేం నరేందర్ రెడ్డి. ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే చదువుకుని, ఇక్కడే ప్రజా ప్రతినిధిగా ఎన్నుకోబడి… ఇప్పుడు ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి సలహాదారుగా నియమింప పడ్డారు. ఆయన సీఎం కు సలహాలిచ్చే అసాధారణ స్థానంలో ఉన్నారు. ఇది వరంగల్ కే గర్వకారణం. ఇంతటి స్థాయి, స్థానంలో ఉన్న మనిషి నుంచి ఎవరైనా ఏం కోరుకుంటారు? కాస్త మంచి, వీలైతే ఓ మాట సాయం. అంతేగా!? కానీ ఆయన నుంచి ఓ మంచి మాట సాయాన్ని కోరుకున్న అజం జాహి మిల్లు కార్మికులు మాత్రం ఉలుకు, పలుకు లేని మౌనాన్ని ఎదుర్కొంటున్నారు. చారిత్రక అజంజాహి కార్మిక భవనం కబ్జాకు గురైంది. తప్పుడు దస్తావేజులతో అన్యాక్రాంతమైoది, ఓ బడా వ్యాపారి అక్రమ పర్మిషన్లు పొందాడు. కాంగ్రెస్ కే చెందిన ఓ ప్రజా ప్రతినిధి కొబ్బరికాయ కొట్టి, బహుళ అంతస్తుల భవనానికి శంకుస్థాపన చేశారు. కార్మికుల కళ్ళ ముందే వాళ్ళ కలల సౌధం, ఎన్నో కార్మిక ఉద్యమాల సాక్షీభూతం, కార్మిక దేవాలయం, కార్మిక భవనం నేలమట్టం అయింది. ఇది జరిగి రెండు నెలలు గడుస్తున్నాయి. కార్మికులు, కార్మిక కుటుంబాలు, కాంగ్రెస్ సహా పార్టీలన్ని అఖిల పక్షమై, కార్మిక, ప్రజా సంఘాలన్నీ ఏకపక్షమై కోట్లాడుతున్నాయి. అది ముమ్మాటికీ కార్మిక భవన స్థలమే అనడానికి భవన శిలాఫలకం నుండి ఇంటి నెంబర్, ఇంటి పన్ను వరకు అవసరమైన అనేక ఆధారాలను బయట పెట్టారు. కార్మిక నాయకుల కాసుల కక్కుర్తిని, తప్పుడు దస్తావేజులతో చేపట్టిన కబ్జాని, నియమ నిబంధనలు అతిక్రమించిన అధికారుల అవినీతిని సాక్ష్యాలతో సహా ఎలుగెత్తారు. అయినా సరే, ప్రజాపాలనే గీటురాయిగా పనిచేస్తున్న ప్రజా ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టలేదు. అధికారంలో ఉన్న ఏ ప్రజా ప్రతినిధి కీ ఇది తప్పని తోయలేదు. ఏ ఉన్నతాధికారికి తప్పును సరిదిద్దుకోవాలనిపించలేదు. సరిదిద్దే ప్రయత్నం ఏ కోణం నుంచీ జరగలేదు. ఒక అవినీతి కోణం వెనుక ఇంత మౌనమా?!

చివరకు మీలాంటి వారికి కూడా పట్టకపోతే, ఎవరికి పడుతుంది? ఇంకెవరిని అడగాలి సార్!? బహిరంగంగా అందరికీ తెలిసిన అజం జాహి లాంటి చారిత్రక మిల్లు కార్మిక స్థలానికే రక్షణ, దిక్కు దివాణం లేకపోతే, ఈ ప్రజా పాలనలో ఇంకెవరికి రక్షణ ఉన్నట్లు సార్?! మన ప్రజా పాలన ఫలాలు ఎవరికి అందుతున్నట్లు సార్? ప్రజలకేనా సార్?! పాలకులకా? ప్రభుత్వంలో పలుకుబడి ఉన్నోళ్లకా సార్?!

అందుకే సార్, అజం జాహి మిల్లు కార్మికులు, కార్మికుల కుటుంబాలు, అఖిల పక్షాలు, అన్ని ప్రజా సంఘాలు, ప్రజలు అంతా కలిసి, ఈ మట్టి బిడ్డగా మిమ్మల్ని అడుగుతున్నారు. మిల్లు కార్మిక భవన స్థల కబ్జా పై సీఎం ప్రధాన సలహాదారుగా మీ సూచనలేంటి? సీఎం గారికి మీరిస్తున్న సలహాలేంటి? కాంగ్రెస్ నేతగా కార్మికులకు ఏ కబురంపుతారు? ఈ జిల్లా నేత గా మీ జవాబు ఏంటి? ఉలక ‘వేం’? పలుక ‘వేం ‘? మాట్లాడ ‘వేం’? అంటూ మీ ప్రతిస్పందన కోసం అఖిల పక్షం… ప్రజాపక్షమై… మీ జోక్యం కోసం అజం జాహి కార్మిక కుటుంబ లోకం ఆశగా ఎదురుచూస్తున్నది.

Latest News

SIRపై CJP సమరం..|SIR|CJP

సీఈసీకి 48 గంటల డెడ్‌లైన్! న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ **(SIR)**పై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) తీవ్ర స్థాయిలో స్పందించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ 48 గంటల్లో...

తెలంగాణ వార్‌రూమ్‌ టు ఢిల్లీ వార్‌రూమ్‌|TELANGANA|WAR ROOM|DELHI|WAR ROOM

రుద్ర సంతోష్‌ కుమార్‌కు ఏఐసీసీలో కీలక బాధ్యతలు హైదరాబాద్‌: తెలంగాణలో కులగణన కార్యక్రమాన్ని క్షేత్రస్థాయి వరకు సమన్వయం చేసిన కాంగ్రెస్‌ నాయకుడు రుద్ర సంతోష్‌ కుమార్‌కు జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించారు. జాతీయ...

జింబాబ్వేలో ఘనంగా గణేష్ శోభాయాత్ర|ZIMBABWE|GANESH|SHOBHA YATRA

రూ.8 లక్షలకు లడ్డూ సొంతం చేసుకున్న బద్దం నరేష్ రెడ్డి జింబాబ్వే రాజధాని హరారేలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. హరారే గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో తొమ్మిది రోజులపాటు నిర్వహించిన వేడుకలు...

యికటి0చిన ముద్దు కటకాలు సూపింది!?|ADUGU TRENDS

ము ము ముద్దంటే చేదా?! ఆ ఉద్దేశ్యం లేదా? అన్నరు. ముద్దంటే ఎవరికి చేదు చెప్పండి. ఆ ఉద్దేశ్యం ఉందో? లేదో తెలుసుకోకపోతే, ముద్దూ, ముచ్చటా యికటిత్తయి. కటకాలు కూడా సూపిత్తయి. ముద్దుకైన, ముచ్చటకైన...

ఊగిసలాటకు ఊతం భద్రతే!|EDITORIAL

చమురు ధరల ఊగిసలాటకు తాత్కాలిక దౌత్య పరిణామాలు మాత్రమే కాకుండా యుద్ధం, రవాణా అంతరాయాలు, ఉత్పత్తి సామర్థ్యం, భద్రతా ముప్పులు కారణమవుతున్నాయి. పశ్చిమాసియాలో శాంతి నెలకొని, అంతర్జాతీయ నౌకా రవాణా సాధారణ స్థితికి...

సెప్టెంబర్ 24, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు త్రయోదశి రాత్రి 09.33 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం ధనిష్ఠ ఉదయం 09.58 వరకు ఉపరి శతభిషం యోగం ధృతి సాయంత్రం 04.34 వరకు ఉపరి శూల కరణం కౌలవ ఉదయం 09.08...

గా ఊర్ల పేమ పెండ్లిల్లు నిషేధం!?|ADUGU TRENDS

ఇగీ మద్దెల ఏడ సూసినా, లవ్వు మ్యారేజీలు, లివింగ్ టుగెదర్లేనాయె! గియి ఊర్లు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు దాటి దేశాలు, ఖండాంతరాలకు విస్తరించినయి. ఇగ కులం లేదు, మతం లేదు. ఇల0 లేదు....

యూపీ విభజన ప్రతిపాదనా? రాజకీయ వ్యూహమా?|EDITORIAL

దేశంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై చర్చ జరగడం సహజమే. కానీ ఇలాంటి నిర్ణయాలు ప్రజల దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకోవాలి. యూపీ విభజనపై రాజ్‌భర్‌ చేసిన ప్రకటన అధికారిక విధానంగా మారుతుందా?...

సెప్టెంబర్ 23, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ద్వాదశి రాత్రి 08.43 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శ్రవణ ఉదయం 08.18 వరకు ఉపరి ధనిష్ఠ యోగం సుకర్మ సాయంత్రం 04.50 వరకు ఉపరి ధృతి కరణం బవ ఉదయం 08.03...

పుతిన్ తిరుగులేని నేతేనా!?|EDITORIAL

పుతిన్ రాజకీయ పట్టు బలపడినప్పటికీ, ప్రతిపక్ష స్వేచ్ఛ, ఎన్నికల పారదర్శకత, యుద్ధానికి ముగింపు వంటి అంశాలపై రష్యా ఎదుర్కొంటున్న ప్రశ్నలు అలాగే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పుతిన్ ఆధిపత్యాన్ని కేవలం సీట్ల సంఖ్యతో...

బంగారం కొనే ముందు గీ మూడు సూడాలే!|ADUGU TRENDS

మనం బంగారం, నగలు ఏడ కొంటం? ఔసలోల్ల దగ్గర, బంగారం దుకాణాల్ల కొంటం .పెద్దపెద్ద దుకాణాలకు కూడా పోయేటోల్లు ఉంటరు. కానీ, గీ మూడు ముఖ్యమైన ముచ్చట్లు పట్టించుకోం. కానీ మన సర్కార్...

సెప్టెంబర్ 22, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ఏకాదశి రాత్రి 07.23 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 06.14 వరకు ఉపరి శ్రవణ యోగం అతిగండ సాయంత్రం 04.49 వరకు ఉపరి సుకర్మ కరణం వణజి ఉదయం 06.34...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News