Tuesday, June 9, 2026
26.6 C
Hyderabad

గుమ్మడి నర్సయ్య అందరికీ ఆదర్శం

గుమ్మడి నర్సయ్యకు జీవన సాఫల్య అవార్డు ప్రదానోత్సవంలో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి

కమ్యూనిస్టు యోధుడు ఇల్లెంద మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య రాజకీయ ప్రస్థానం ఆయన త్యాగం పోరాటం నిరాడంబరత చిత్తశుద్ధి ప్రజలతోనే నేటికీ జీవితం కొనసాగిస్తున్న స్పూర్తి అందరికీ ఆదర్శనీయమని ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి అన్నారు. శనివారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని తిరుమల ఫంక్షన్ హాల్ లో సి.ఎన్.ఆర్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో చింతలపల్లి నిర్మలాదేవి నారాయణ రావు జీవన సాఫల్య పురస్కారాన్ని గుమ్మడి నర్సయ్యకు ప్రదానోత్సవ కార్యక్రమంలో చింతలపల్లి భాస్కర్ రావు సభ అధ్యక్షత వహించగా, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని, గుమ్మడి నర్సయ్యను శాలువతో సత్కరించి మెమొంటో,25000 నగదును సన్మాన పత్రాన్ని అందచేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దామోదర రెడ్డి మాట్లాడుతూ కమ్యూనిస్టుగా ఆయన జీవితం అంకితం చేశాడని ఆయన ప్రజలకు చేస్తున్న సేవ జనాదరణ అభినందనీయమని నేటి యువతే కాకుండా ప్రజా జీవితంలో అందరం ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని అన్నారు. కీర్తి శేషులు సి. నారాయణ రావు తన రాజకీయ జీవితానికి మొదటి దశలో బాసటగా నిలిచి వారి కుటుంబమంతా అండగా నిలిచిందని అన్నారు.తల్లి తండ్రులను స్మరిస్తూ అవార్డు నెలకొల్పడం నేటీరోజుల్లో చాలా అరుదైన విషయమని అన్నారు.

అవార్డు గ్రహీత గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ నాగర్ కర్నూల్ జిల్లాలో నా సేవల్ని నా జీవితాన్ని గుర్తించి సి.ఎన్.ఆర్్ విద్యాసంస్థల తరుపున అవార్డు ఇవ్వటం గర్వకారణమని అన్నారు.తన జీవితాంతం కమ్యూనిస్టు పార్టీలోనే ఉంటూ ఇల్లెందు ప్రజల గొంతుకగా నిస్వార్థ సేవ చేస్తానని ఆదీవాసీల హక్కుల కోసం జనంతోనే జీవిస్తూ సమసమాజం కోసం పేదరిక నిర్మూలనకోసం కూలిరేట్లకోసం గిట్టుబాటు ధరలకోసం పనిచేస్తానని తెలిపారు. ప్రభుత్వం పోడుభూముల సమస్యలు పరిష్కరించాలని ఆదివాసీ గిరిజనులకు పట్టాలివ్వాలని కోరారు. కమ్యూనిజం పోయిందని బాధపడాల్సిన అవసరం లేదని తరతరాలుగా త్యాగాలు చేసి కమ్యూనిస్టు పార్టీ పేదలకోసం పనిచేసిందని అదే లక్ష్యంతో మనమంతా ముందుకు సాగాలని సమసమాజం తప్పనిసరి గా ఏదో ఒకరోజు వస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర నాయకులు బాల్ నర్సింహ్మా,ఆనంద్ జీ,సిపిఎం నాయకులు వర్దం పర్వతాలు,ఆర్.శ్రీనివాస్లు,ఐద్వామహిళాసంఘం అద్యక్షురాలు కందికొండగీత ,టి యు సిఐ.ఉపాద్రక్షురాలు ఎస్.ఎల్. పద్మ,,గుమ్మడి నర్సయ్య కూతురు ప్రొఫెసర్ అనురాధ, ప్రజాపంథ నాయకులు కృష్ణ ,బయోపిక్ డైరెక్టర్ పరమేశ్వర్ హివ్రాలే,డాక్టర్ నూర్జహాన్,కోట్ల వెంకటేశ్వర్ రెడ్డి,నాగవరం బాల్ రాం ,డాక్టర్ రామ్ కిషన్ ,సమన్వయ కర్తలు వనపట్ల సుబ్బయ్య, కందికొండ మోహన్ కల్వకోలు మద్దిలేటి పి.వహీద్ ఖాన్, ఎదిరెపల్లి కాశన్న,ముచ్చర్ల దినకర్,వెంకటపతి గుడిపల్లి నర్సింహ్మా రెడ్డి , కాశీదాసు, ఆర్కల రాజేష్,విష్ణుమూర్తి గాయకుడు సత్తార్,గుడిపల్లి నిరంజన్ ,సి.భాస్కర్ రావు కుటుంబ సభ్యులు వెంకటేష్ చంద్రకళ, కవిత, ఫస్టియోద్దీన్,గౌస్ ,తదితరులు పాల్గొన్నారు.

Latest News

సేఫ్టీ డోర్లు!|ADUGU TRENDS

భద్రతకే భద్రత లేని రోజులియి.! మరైతే మనమెంత భద్రంగుండాలె? మనమెంత జాగర్త పడ్డా దోసేటోడు కొత్త కొత్త దారుల్ల దోస్తనే ఉన్నడు. కట్టం లేకుండా మన సొక్కం మన గాబుల్ల, జేబుల్ల నిండాలె....

దేశానికి ముప్పుగా డ్రగ్స్ దందా!|EDITORIAL

యువతను మాదక ద్రవ్యాల మహమ్మారి నుంచి కాపాడటం కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు. అది సమాజం మొత్తం నిర్వర్తించాల్సిన సామూహిక కర్తవ్యం. నేడు అప్రమత్తంగా వ్యవహరిస్తేనే రేపటి తరాన్ని ఆరోగ్యవంతమైన, సురక్షితమైన...

09-06-2026, మంగళవారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:45 సంకల్ప తిథి: కృష్ణ-నవమి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-నవమి తిథి : కృష్ణ-నవమి తె. ఝా 2:35 వరకు...

08-06-2026, సోమవారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:45 సంకల్ప తిథి: కృష్ణ-అష్టమి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-అష్టమి తిథి : కృష్ణ-అష్టమి తె. ఝా 3:24 వరకు...

ప్రొఫెసర్ వ్యాఖ్యలు-పోస్టు మార్టం|JANASENA|PROF.NAGESHWAR|PSPK

స్థానిక బీజేపీ నాయకత్వం నుంచి కాని పనిని జాతీయ పార్టీ నెత్తికెత్తుకుందా? అందుకే జన సేనాని పవన్ ని తెలంగాణపైకి ఉసి గొల్పిందా? ఈ స్కెచ్ లో భాగంగానే జగన్ ను అరెస్ట్...

మందా? ‘మజా’కా!?|ADUGU TRENDS

ఎనకటికి ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే, సుట్టకు అగ్గి కావాలని మరొకడేడిసిండట! గీ ముచ్చట గట్లనే ఉన్నది. రోజులు మారినా, గా సామెతల అర్థాలు మారట్లేదు. గీ సామెతసొంటి ముచ్చటే గా చిత్తూరు జిల్లా...

ఆర్థిక మోసాలకు అడ్డుకట్టలే లేవా!?|EDITORIAL

చిన్న మోసగాళ్లనే కాదు, పెద్ద కార్పొరేట్ సంస్థలు, ప్రభావశీల వ్యక్తులు చేసిన అక్రమాలపై కూడా సమానంగా చర్యలు తీసుకోవాలి. చట్టం ముందు అందరూ సమానమనే నమ్మకం ఏర్పడినప్పుడే ఆర్థిక క్రమశిక్షణ బలపడుతుంది. లేకపోతే...

ఈ రోజు/ వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూన్ 07 నుండి జూన్ 13 వరకు వారఫలాలు: మేషం: ఈ వారం కుటుంబ వ్యవహారాల్లో కొంత ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సౌహార్దంగా వ్యవహరించడం మంచిది. వ్యాపారవేత్తలు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా...

రెండోసారి రాజ్యసభకు సానా…|AP|TDP|RAJYASABHA|SANA SATHISH BABU

బాబుకు ధన్యవాదాలు తెలిపిన సతీష్ బాబు|CHANDRABABU|CM రాష్ట్ర రాజకీయాల్లో, సామాజిక సేవలో, క్రీడా రంగంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త, తెలుగుదేశం పార్టీ నేత సానా సతీష్ బాబు రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా...

ఏపీ రాజ్యసభ అభ్యర్థుల ఖరారు|AP|RAJYASABHA|TDP|JANASENA|BJP

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారిన రాజ్యసభ స్థానాల భర్తీ ప్రక్రియ తుది ఘట్టానికి చేరుకుంది. రాష్ట్రం నుండి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాలకు గాను అధికార కూటమిలో అభ్యర్థుల ఎంపిక...

గడ్డి కావాలా, బాబూ..!|ADUGU TRENDS

పసువులకే కాదు, కాస బుద్ధి తక్కువున్నోల్లకు గడ్డి పెడతం.! గడ్డంటే గడ్డి కాదు కనీ, తిట్లన్నట్లు.!! గడ్డి మేసి ఆవు పాలిస్తుంది, పాలుతాగి మినిసి విషమవుతాడు అంటాడు ఆత్రేయ. మరి ఆవు మేసే...

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత!|EDITORIAL

పర్యావరణ దినోత్సవం ఒక ఉత్సవం మాత్రమే కాదు. ప్రకృతిని కాపాడుకోవాలనే సామూహిక సంకల్పానికి ప్రతీక. పర్యావరణాన్ని రక్షించడం అంటే మానవజాతి భవిష్యత్తును రక్షించడమే. నేటి నిర్లక్ష్యం రేపటి విపత్తుకు దారితీయవచ్చు. అందుకే ప్రకృతి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News