Sunday, October 18, 2026
25.1 C
Hyderabad

యూపీ విభజన ప్రతిపాదనా? రాజకీయ వ్యూహమా?|EDITORIAL

దేశంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై చర్చ జరగడం సహజమే. కానీ ఇలాంటి నిర్ణయాలు ప్రజల దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకోవాలి. యూపీ విభజనపై రాజ్‌భర్‌ చేసిన ప్రకటన అధికారిక విధానంగా మారుతుందా? లేక ఎన్నికల రాజకీయాల్లో మరో హామీగానే మిగిలిపోతుందా? అనేది రానున్న పరిణామాలే తేల్చాలి.

మార్గం – అడుగు, ఎడిటోరియల్

దేశ రాజకీయాలను ప్రభావితం చేసే ఉత్తరప్రదేశ్‌ విభజన అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన సుహేల్‌దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ (ఎస్బీఎస్పీ) అధినేత, రాష్ట్ర మంత్రి ఓం ప్రకాశ్‌ రాజ్‌భర్‌ చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి. కులగణన అనంతరం ఉత్తరప్రదేశ్‌ను నాలుగు భాగాలుగా విభజించే అవకాశం ఉందని, ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించినట్లు రాజ్‌భర్‌ పేర్కొన్నారు. పూర్వాంచల్‌ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే రాజ్‌భర్‌ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి కావాలన్న ఆకాంక్షను కూడా ఆయన వ్యక్తం చేశారు. అయితే రాజ్‌భర్‌ ప్రకటనకు భిన్నంగా, విభజనపై కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. అందువల్ల ఈ వ్యాఖ్యలను తుది నిర్ణయంగా కాకుండా రాజకీయ ప్రకటనగా చూడాల్సి ఉంటుంది.

దేశంలోనే అత్యధికంగా 80 లోక్‌సభ స్థానాలు కలిగిన ఉత్తర ప్రదేశ్ కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కీలకంగా నిలుస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఎదురైన రాజకీయ సవాళ్లు, సమాజ్‌వాదీ పార్టీ–కాంగ్రెస్‌ కూటమి సాధించిన ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో సామాజిక సమీకరణాల ప్రాధాన్యాన్ని స్పష్టం చేశాయి. మొత్తం 80 స్థానాల్లో సమాజ్‌వాదీ పార్టీ 37, కాంగ్రెస్‌ 6 స్థానాలు గెలుచుకోగా, బీజేపీ 33 స్థానాలకు పరిమితమైంది. అయోధ్య ఉన్న ఫైజాబాద్‌ నియోజకవర్గంలో బీజేపీ ఓటమి కూడా రాజకీయ చర్చల్లో ప్రస్తావనకు వచ్చింది. ఈ ఫలితాల నేపథ్యంలో యూపీలో భవిష్యత్‌ రాజకీయ వ్యూహాలపై అన్ని పార్టీలు దృష్టి సారించాయి.

ఉత్తరప్రదేశ్‌ను చిన్న రాష్ట్రాలుగా విభజించాలన్న డిమాండ్‌ దశాబ్దాలుగా ఉంది. 2011లో మాయావతి ముఖ్యమంత్రిగా ఉన్న బహుజన్‌ సమాజ్‌ పార్టీ ప్రభుత్వం రాష్ట్రాన్ని నాలుగు భాగాలుగా విభజించే ప్రతిపాదనను అసెంబ్లీలో ఆమోదించింది. పూర్వాంచల్‌, బుందేల్‌ఖండ్‌, అవధ్‌ప్రదేశ్‌, పశ్చిమప్రదేశ్‌ పేర్లతో ప్రాంతీయ పునర్వ్యవస్థీకరణను ప్రతిపాదించారు. అయితే ఆ ప్రతిపాదన ఆచరణలోకి రాలేదు. తాజాగా రాజ్‌భర్‌ ప్రస్తావించిన పూర్వాంచల్‌, మధ్యాంచల్‌, బుందేల్‌ఖండ్‌, హరిత్‌ప్రదేశ్‌ విభజన రూపకల్పన గత ప్రతిపాదనలతో కొంత భిన్నంగా ఉంది.

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 3 ప్రకారం కొత్త రాష్ట్రాల ఏర్పాటు, రాష్ట్రాల సరిహద్దుల మార్పు వంటి అంశాలపై చట్టం చేసే అధికారం పార్లమెంటుకు ఉంది. సంబంధిత రాష్ట్ర శాసనసభ అభిప్రాయం కోరడం తప్పనిసరైనా, ఆ అభిప్రాయాన్ని అంగీకరించడం పార్లమెంటుకు తప్పనిసరి కాదు. కాబట్టి రాష్ట్ర విభజన అనేది రాజకీయ ప్రకటనతో పూర్తయ్యే ప్రక్రియ కాదు. పార్లమెంటరీ చర్చలు, పరిపాలనా అధ్యయనాలు, ఆస్తులు–అప్పుల పంపకం, ఉద్యోగుల విభజన, నీటి వనరులు, ఆర్థిక వనరుల పంపిణీ వంటి అనేక అంశాలు పరిష్కరించాల్సి ఉంటుంది.

కులగణన, ఓబీసీ రిజర్వేషన్లలో సముచిత ప్రాతినిధ్యం వంటి అంశాలతో రాష్ట్ర విభజనను అనుసంధానించడం సామాజిక న్యాయ చర్చకు కొత్త కోణాన్ని తెస్తోంది. అయితే ఒక ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించడం మాత్రమే అన్ని సామాజిక వర్గాల సమస్యలకు పరిష్కారం కాదు. విద్య, ఉపాధి, ఆరోగ్యం, సాగునీరు, మౌలిక వసతులు, భూసంస్కరణలు వంటి రంగాల్లో సమగ్ర విధానాలు అవసరం. కొత్త రాష్ట్రాల ఏర్పాటు వల్ల పరిపాలనా సేవలు ప్రజలకు చేరువ కావచ్చని మద్దతుదారులు చెబుతున్నప్పటికీ, కొత్త రాజధానులు, ప్రభుత్వ యంత్రాంగం, ఆర్థిక స్వయం సమృద్ధి వంటి అంశాలపై స్పష్టమైన ప్రణాళిక అవసరం.

2027 అసెంబ్లీ ఎన్నికలకు ముందు విభజన చర్చ మళ్లీ వేడెక్కడం రాజకీయంగా సహజమే. అయితే ఎన్నికల ప్రయోజనాల కోసం ఇచ్చే హామీలకు, వాస్తవిక పరిపాలనా నిర్ణయాలకు మధ్య తేడా ఉండాలి. ఉత్తరప్రదేశ్‌ విభజన జరిగితే ప్రాంతీయ అభివృద్ధి ఎలా మెరుగుపడుతుంది? ప్రజలపై ఆర్థిక భారం ఎంత ఉంటుంది? సామాజిక ప్రాతినిధ్యం ఏ విధంగా పెరుగుతుంది? వంటి ప్రశ్నలకు రాజకీయ పార్టీలు స్పష్టమైన సమాధానాలు ఇవ్వాలి.

దేశంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై చర్చ జరగడం సహజమే. కానీ ఇలాంటి నిర్ణయాలు ప్రజల దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకోవాలి. యూపీ విభజనపై రాజ్‌భర్‌ చేసిన ప్రకటన అధికారిక విధానంగా మారుతుందా? లేక ఎన్నికల రాజకీయాల్లో మరో హామీగానే మిగిలిపోతుందా? అనేది రానున్న పరిణామాలే తేల్చాలి.

Latest News

ఈ దంపతులు సింపతీ కోల్పోతున్నారా!?|KONDA SUREKHA|KONDA MURALI|FAMILY

పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలకు దూరం..పైగా సెపరేట్ ఈసీపై ఏఐసీసీ ఆందోళనలకు కూడా హాజరుకాని వైనం పట్టభద్రుల ఎమ్మెల్సీ సమాయత్త సమావేశానికి గైర్హాజర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు మంత్రుల సందర్శనలోనూ నో వేర్ పైగా విడిగా పార్టీ...

బతుకమ్మ వాయినం!?|ADUGU TRENDS

‘ఇత్తినమ్మ వాయినం అంటే, తీస్కుంటినమ్మ వాయినం.’ అని అంటరు. గిదేందంటే, పండుగలు, పబ్బాలకు, శుభ కార్యాలకు, రతాలకు ముత్తైదువులకు అందించే తాంబూలం, పిండివంటలు, పండ్లు-పూలు, పసుపు-కుంకుమలను కలిపి ఇచ్చే కానుకలను వాయినం అంటరు....

పటిష్ట వ్యవస్థ తప్పనిసరి!|EDITORIAL

ఓటరు జాబితాలో ఒక్క పేరు మాయమైనా.. ప్రజాస్వామ్యానికి గట్టి దెబ్బే! దేశవ్యాప్తంగా ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై పెరుగుతున్న ఆందోళనలు, ఓటర్ల పేర్ల తొలగింపుపై ఆరోపణలు ఎన్నికల వ్యవస్థ పారదర్శకతను ప్రశ్నిస్తున్నాయి. జాబితాల ప్రక్షాళన అవసరమే.....

అక్టోబర్ 17, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజ మాసం శుక్లపక్షం శ్రీ చండికాదేవి అలంకరణ తిధి సప్తమి రాత్రి తెల్ల 05.10 వరకు ఉపరి అష్టమి నక్షత్రం మూల ఉదయం 08.16 వరకు ఉపరి పుర్వాషాఢ యోగం అతిగండ రాత్రి 10.31 వరకు ఉపరి సుకర్మ కరణం...

ఆడ ఏడో రోజే|SADDULA BATHUKAMMA

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. అయితే జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని పెద్దమడూరు గ్రామంలో మాత్రం ఈ పండుగను ఏడో...

పొద్దుగాల పెండ్లి.. సీకటి పడంగనే పెటాకులు!?|ADUGU TRENDS

పెండ్లంటే నూరేండ్ల పంట అన్నరు. ఒకపాలి పెండ్లైందంటే వందేండ్లైనా గా అనుబంధం యిడి పోదని దానర్థం. కానీ, గీ మద్దెల పెండ్లిల్లు.. పెటాకులైపోవడానికి పెద్దగ టైమేం పడ్తలేదు. గిప్పుడు పెండ్లి సేసుకుంటాండ్లో లేదో.....

రియాద్ సంక్షోభం!|EDITORIAL

మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి! హౌతీల భీకర క్షిపణి దాడులతో సౌదీ రాజభవనాలు వణుకుతుండగా, క్రౌన్ ప్రిన్స్ ప్రాణభయంతో అజ్ఞాతంలోకి వెళ్లిన వేళ.. ఇజ్రాయెల్ స్నేహహస్తాన్ని తిరస్కరించిన రియాద్ నిర్ణయం గల్ఫ్ రాజకీయాల్లో...

అక్టోబర్ 16, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజ మాసం శుక్లపక్షం శ్రీ సరస్వతిదేవి అలంకరణ తిధి షష్ఠి రాత్రి తెల్ల 03.02 వరకు ఉపరి సప్తమి నక్షత్రం మూల పూర్తిగా ఉంది యోగం శోభ రాత్రి 09.56 వరకు ఉపరి అతిగండ కరణం కౌలవ పగలు...

గియేం పోస్టాపీసుల్రా నాయినా!?|ADUGU TRENDS

మనం సూసిన పోస్టాపీసులకు గీ పోస్టాపీసులకు పోలికలే లేవు. ఒకటేమో నీల్ల మీద. ఇంకోటేమో నీల్ల లోపల, మరోటేమో ఎత్తనై భూమ్మీద, ఇంకా గుహల్ల, రైలు పట్టాల మద్దెల... గిట్ల గీ పోస్టాపీసులన్నయి....

ప్రపంచానికి పెను ముప్పు!?|EDITORIAL

క్షిపణుల మోతతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది! విమానాశ్రయాలే లక్ష్యంగా దాడులు.. చమురు కేంద్రాలపై ప్రతీకార దాడులు.. కీలక సముద్ర మార్గాల్లో పెరుగుతున్న ఉద్రిక్తతలు! అగ్రరాజ్యాల జోక్యంతో యుద్ధం మరింత విస్తరిస్తుందా? చమురు ధరల నుంచి...

అక్టోబర్ 15, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజ మాసం శుక్లపక్షం శ్రీ లలిత త్రిపుర సుందరిదేవి అలంకరణ తిధి పంచమి రాత్రి 01.00 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి తెల్ల 05.41 వరకు ఉప6 మూల యోగం సౌభాగ్య రాత్రి 09.28...

బంగారం సొరంగంలకి!?|ADUGU TRENDS

ఆశకు అంతుండాలంటరు. అత్యాశకు పోతే ఒక్కోపాలి పానమే పోతది. గట్లనే అయింది గీ ఇద్దరి దోస్తుల పని. యూ ట్యూబ్ సూసి, బంగారం కోసం ఓ సొరంగంలకి పోయి పానం మీదికి తెచ్చుకున్నర...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News