అభిమానానికి కూడా హద్దులుండాలంటరు. కనీ, కొందరు సూపే పేమకు హద్దులుండయి. ఎవలికి తోచిన విధంగా వాళ్ళు తమకిట్టమైన వాల్ల మీద అభిమానం సూపుతరు. గట్లనే గీ మామ, తన అల్లుడి సూపిన ముచ్చట.. తెగ వైరలైతాంది.

ఎవలకైనా బిడ్డంటే పానముంటది. కనీ గీ మామ తన బిడ్డను బాగా సూసుకుంటడని అనుకున్నడేమో గనీ, తన అల్లుడి మీద పానం శేసిండు. మహారాష్ట్రకు చెందిన గీ మామ, తన అల్లునికి ఏకంగా వెండి శెప్పులు శేయించిండు. ఏదో పిసరి పితుకంత కాదుల్లా… ఏకంగా కిలోన్నర వెండితోటి! మల్ల గది గూడ కొల్హాపురి శెప్పుల్లెక్క!! మంచిగ శేయించి కానుకగ ఇచ్చిండు. గదే గా కొల్హాపూర్ లోని పేరున్న విక్రాంత్ అనే ఒకాయినె గా వెండి శెప్పులను తయారు శేయడానికి ఎనిమిది రోజులు శమ పడ్డడట!

