ఉత్తర భారత రాష్ట్రాల్లో డిసెంబర్ 30 నుంచి జనవరి 2 వరకు తీవ్ర చలి ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. జమ్ముకశ్మీర్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరుతాయని తెలిపింది. హిమాచలప్రదేశ్‌లో మంచు కురుస్తుండగా, కశ్మీర్‌లో రోడ్లు, రవాణాపై ప్రభావం పడింది. పలు విమానాలు, రైళ్లు రద్దయ్యాయి. ఢిల్లీలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

