ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎల్లుండి రాష్ట్రంలోని 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగనుంది. మొత్తం కోటీ యాభై లక్షల మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకోనున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలు తీవ్రంగా ప్రచారం నిర్వహించాయి, చివరి దశలో నేతలు ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 8న వెలువడనున్నాయి. ఢిల్లీలో ఈసారి గట్టి పోటీ నెలకొన్న నేపథ్యంలో చివరి నిమిషం వరకు అన్ని పార్టీలూ వ్యూహాలను అమలు చేశాయి. ఇప్పుడు మొత్తం దృష్టి పోలింగ్ శాతంపై ఉంది.

