శిన్న శిన్న ఇకమతులే పెద్ద పెద్ద పనుల్ల శెమను తగ్గిస్తయి. అల్కగ అయ్యేట్లు శేత్తయి. గట్లనే ఇగో గీ ఉపాయమన్నట్లు. సిమిటి మాల్ కు ఓ శిన్న శిట్కాను కనిపెట్టిండు. గా పనిల కట్టాన్ని తగ్గిచ్చిండు.
కాస పెద్దగ, లావుగ ఉండే, ఓ ప్లాస్టిక్ పైపును తీసుకున్నడు. గాపైపుకు పట్టుండేటట్లు ఓ యినుప సలాకను బిగిచ్చిండు. గా పైపుకే ముందు మూత సోపుగ కట్ శేసిండు. ఇగ దాంతోటి సిమిటి, ఇసికె, నీల్లు కలిపిన మాల్ ను ఎత్తుతాండు. గదాంతోటే పైకి లేపి గా పిల్లర్లల్ల పోస్తాండు. ఇగ గిదీంతోటి తట్టల్ల కెత్తే శెమ తగ్గిందన్నట్లు? కూలీ మనిసులు తగ్గుతాండ్లు. పని గూడ తొందరగైతాంది. మంచిగుంది కదా గీ ఉపాయం.

