ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యూనివర్సిటీలకు వీసీలను నియమిస్తూ గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆంధ్రా వర్సిటీకి జీపీ రాజశేఖర్, రాయలసీమ వర్సిటీకి వెంకట బసవరావు, పద్మావతి మహిళా వర్సిటీకి ఉమ, కృష్ణా వర్సిటీకి కే రాంజీ, అనంతపురం JNTUకు సుదర్శనరావు, కాకినాడ JNTUకు CSRK ప్రసాద్, నన్నయ వర్సిటీకి ప్రసన్న, యోగి వేమన వర్సిటీకి ప్రకాశ్ బాబును వీసీలుగా నియమించారు. వీరంతా మూడేళ్ల పాటు పదవుల్లో కొనసాగుతారు.

