అవునుల్లా..! గీ సైకిల్ ను తొక్కేటోడు కంటికి కనిపించడు. కనీ, గా సైకిల్ మాత్రం రోడ్ల మీద పోతనే ఉంటది. ఇగ గిది సూసినోల్లు.. గిదేం సిత్రమని నోల్లు ఎల్లబెడతాండ్రు. గీ ముచ్చట గా గుజరాత్ ల జరుగుతాంది. ఏందంటరా? మీరే సూడుండ్రి.

గా సూరత్ ల శివం మౌర్య అనే పొల్లగాడు గిదీన్ని శేసిండు. గదేనుల్లా గీ మద్దెల తెగ శెప్పుకుంటున్న, సిత్రవిసిత్రాలు శేస్తున్న ఏఐ ఉంది గదా? గదాంతోటి ఓ సైకిల్ ను తయారు శేసిండు, గా సైకిల్ మీద మనిషి నడుం కింది నుంచి కాళ్ళ వరకు తొక్కుతున్నట్లుగా కనిపిస్తడు. ఇగ నడుం నుంచి పైకి కనిపించడన్నట్లు. ఇగ హ్యాండిల్ మీద శేతులు గూడ లేవు. కనీ, గా సైకిల్ మాత్రం రోడ్ల మీద నడుస్తనే ఉంది? ఇగ గిది సూసి జనం పరేషాన్ అయితాండ్రు. కొందరు ఈడియో తీసి, నెట్టింట్ల పెట్టిండ్రు. ఇగ గదివైరల్ అయితనే ఉండె!

