హైదరాబద్ మలక్‌పేటలో గల జమున టవర్స్‌లో నివాసం ఉంటున్న సింగం శిరీష ఎనే వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందగా, శిరీష గుండెపోటుతో మృతి చెందింది అని కుటుంబ సభ్యులకు భర్త వినయ్ కుమార్ సమాచారం ఇచ్చాడు. అయితే మృతి రాలి అత్తమామలు, మృతురాలి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరకముందే మృతదేహాన్ని సొంత గ్రామం శ్రీశైలం సమీపంలో దోమల పెంటకు అంబులెన్సులో తరలిస్తుండగా సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించి మృతదేహన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహం పై గాయాలు ఉండటంతో కొట్టి చంపి.. గుండెపోటుగా చెపుతున్నారని మృతురాలి కుటుంబసభ్యులు మలక్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

