మోతే మండలం నామవారం శివారులో 7.10 ఎకరాల భూమిని అక్రమంగా పౌతి చేశారంటూ తహశీల్దార్ సంఘమిత్రపై దివ్యాంగ మహిళ పూలమ్మ చేసిన ఆరోపణల నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఈ విషయంపై బాధితులు నేడు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు పై స్పందించిన కలెక్టర్, విచారణ అనంతరం తహశీల్దార్ సంఘమిత్రను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. అలాగే, ఈ వ్యవహారంలో ప్రమేయమున్న కంప్యూటర్ ఆపరేటర్ నాగరాజును కూడా విధుల నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయానికి బాధితులు స్పందిస్తూ, కలెక్టర్‌కి కృతజ్ఞతలు తెలిపారు.

