‘మాతృ దేవో భవ, పితృ దేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ’ అన్నరు. గంట్లంటే గా తల్లిని దైవంగ సూడాలె. తండ్రిని కూడా దైవంగనే భావించాలె. ఇగ గట్లనే గా గురువును కూడా దైవంగ పూజించాలె. గా అతిథిని కూడా దైవంతో సమానంగా ఆదరించాలె. అని గిదీని అర్థం. గిది గా తైత్తిరీయ ఉపనిషత్తు ల ఉన్న శిక్షావల్లిల రాసి ఉందట. ఇగ గీ రోజుల్ల అయ్యవ్వను ఎవ్వలూ సూత్తనేలేరాయె. గురువంటే బరువేనాయె. ఎవ్వలింటికైన అతిథి పోయేటట్లున్నాది? అంతా మారిపోయింది. లింగు లిటుకని మొగడు పెండ్లమే ఉండబట్టరి. గీ ఎడమొగం, పెడమొగమోల్లకు పక్కోన్ని పట్టించుకునే టైమే లేదాయె. కనీ, గా ఊర్లె మాత్రం గా సారును మస్తు గౌరవించిండ్రు. గదేందో సూద్దాం పదండ్రి.

గది ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం రాయిగూడ ఊరు. గా ఊల్లె ఆశ్రమ పెద్ద బడిల నైతం ప్రభాకర్ రావు అనే సారు గీ మద్దెల పదవిని విరమించిండ్రు. ఇగ గీ ముచ్చను గా ఊరోల్లు, సార్లు, పిల్లలు కలిసి ముద్దుగ శేసిండ్రు. గా సారును, పంతులమ్మను మంచిగ పూదించిన ఎడ్లబండిల ఎక్కించి, డప్పు సాటింపులతోటి ఊరేగించిండ్రు. ఐటెంక మస్తుగ సత్కరించిండ్రు. గట్ల గవాల్లు గా గురువు మీద గౌరవాన్ని సాటిండ్రు.

