Saturday, November 7, 2026
25.9 C
Hyderabad

బోనాలు – చరిత్ర, సంస్కృతి, సంప్రదాయం|BONALU|HISTORY|CULTURE

చారిత్రక, పురావస్తు, శాసన, సాహిత్య ఆధారాల విశ్లేషణ ప్రకారం బోనం సమర్పించే ఆచారం ఆషాఢ మాసంలో తెలంగాణతో పాటు దక్షిణ భారతదేశంలోని అనేక గ్రామాల్లో గ్రామదేవతారాధనలో అంతర్భాగంగా కొనసాగుతోంది. వర్షాకాలం ప్రారంభ దశలో వాతావరణ మార్పులు, కలుషిత జలాల వినియోగం వల్ల అంటువ్యాధులు ప్రబలే పరిస్థితుల్లో గ్రామదేవతలకు బోనం సమర్పించి ప్రజలు ఆరోగ్యం, పంటల సమృద్ధి, పశుసంపద రక్షణ కోసం ప్రార్థించే సంప్రదాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. అనేక ప్రాంతాల్లో దేవతకు సమర్పించిన బోనాన్ని వ్యవసాయ భూముల్లో చల్లడం ద్వారా సస్యశ్యామలతను ఆకాంక్షించే వ్యవసాయ-సాంస్కృతిక విశ్వాసం కూడా ఈ ఆచారంలో భాగంగా కొనసాగుతోంది.

ప్రస్తుతం లభ్యమవుతున్న శాసనాధారాల ప్రకారం, బోనం గురించి స్పష్టంగా ప్రస్తావించిన ఏకైక శాసనం 1516 క్రీ.శ. నాటి విజయనగర కాలానికి చెందినది. రాజశాసనాలు సాధారణంగా రాజకీయ, పరిపాలనా, మతపరమైన దానాలు, దేవాలయ నిర్మాణాల వంటి అంశాలకే పరిమితమై ఉండడం వల్ల జానపద ఆచారాలు శాసనాల్లో అరుదుగా నమోదయ్యాయని భావించవచ్చు.

అయితే, దేవతలకు ఆహార నైవేద్యం సమర్పించే సంప్రదాయం బోనం అనే ఆచారానికి మరింత ప్రాచీనమైన నేపథ్యం ఉందని పురావస్తు ఆధారాలు సూచిస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలోని మఠంరాళ్ల తండా, హైదరాబాద్ శివారులోని దాసర్లపల్లి, కొత్తగూడెం జిల్లాలోని అక్షరాల లోద్ది (నల్లముడి) తదితర ప్రాంతాల్లో గుర్తించిన ప్రాగైతిహాసిక శిలాచిత్రాల్లో దేవతారాధనలో భాగంగా ఆహార సమర్పణలను సూచించే దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ ఆధారాల ఆధారంగా బోనం సంప్రదాయ మూలాలు కనీసం 2,300 సంవత్సరాలకు పూర్వం ప్రాగైతిహాసిక సాంస్కృతిక సంప్రదాయాలతో అనుబంధం కలిగి ఉన్నాయని ప్రతిపాదించవచ్చు.

సాహిత్య ఆధారాలు కూడా ఈ సంప్రదాయ ప్రాచీనతను బలపరుస్తున్నాయి. కాకతీయుల కాలానికి చెందిన సిద్ధేశ్వర చరిత్ర, ప్రతాప చరిత్ర వంటి మధ్యయుగ గ్రంథాల్లో రుద్రమదేవి తన కుమార్తె ముమ్మడమ్మకు కుమారుడు జన్మించాలని ఆకాంక్షిస్తూ వరంగల్ జిల్లా మొగిలిచర్లలోని ఏకవీర దేవికి బోనం సమర్పించినట్లు ప్రస్తావించబడింది. ఈ సాహిత్య ప్రస్తావనలు 13వ శతాబ్దానికే బోనం ఆచారం రాజవంశీయుల స్థాయిలో కూడా ఆచరణలో ఉన్నట్లు సూచిస్తున్నాయి.

అదేవిధంగా, హైదరాబాద్ నగరం 1591 క్రీ.శ.లో స్థాపించబడక ముందే బోనాల ఉత్సవం ఉనికిలో ఉన్నట్లు కళా ఆధారాలు తెలియజేస్తున్నాయి. మహమ్మద్ కులీ కుతుబ్ షాకు సంబంధించిన ఒక సూక్ష్మ చిత్రంలో చిక్కులం గ్రామంలో బోనాల ఉత్సవం నిర్వహించబడుతున్న దృశ్యం చిత్రీకరించబడింది. ఈ ఆధారం బోనాల సంప్రదాయం హైదరాబాద్ నగర స్థాపనకు పూర్వమే స్థానిక సాంస్కృతిక జీవితంలో భాగంగా ఉన్నట్లు నిర్ధారిస్తుంది.

అందుబాటులో ఉన్న పురావస్తు, శాసన, సాహిత్య, కళా ఆధారాల సమగ్ర పరిశీలన బోనం సంప్రదాయం కేవలం ఒక మతాచారం మాత్రమే కాకుండా, ఆరోగ్య రక్షణ, వ్యవసాయ శ్రేయస్సు, గ్రామదేవతారాధన, స్థానిక సామాజిక-సాంస్కృతిక విశ్వాసాల సమ్మిళిత రూపంగా శతాబ్దాలుగా పరిణామం చెందిందని స్పష్టం చేస్తోంది.

– డా. ద్యావనపల్లి సత్యనారాయణ, 9490957078

Latest News

గ్రాడ్యుయేట్స్ కి ప్రజాస్వామ్య చైతన్యమేది?|ESSAY|GRADUATES

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు కేవలం ఒక గుర్తుపై ముద్ర వేసే సాధనం మాత్రమే కాదు, అది పౌరుల భవిష్యత్తును, ప్రభుత్వ విధానాలను నిర్దేశించే అత్యంత శక్తివంతమైన ఆయుధం. సమాజంలో అందరికంటే ఉన్నతంగా...

దేవుడా! గా బాధ లేకుండ సూడు!?|ADUGU TRENDS

ఎవలైనా దేవుడ్ని ఏం కోరుకుంటరు? గా కట్టాలు ఎడబాపమంటరు. కాదంటే కాసిన్ని సిరి సంపదిలయ్యమని అడుక్కుంటరు. ఇంకొందరైతే ఆరోగ్యం, సుఖసంతోషాలు, పశాంతమై జీవితం కావాలని కోరుకుంటరు. కనీ, గీ భక్తుడు ఏం కోరుకున్నడో...

భాగ్యనగరానికి సరికొత్త మణిహారం!|EDITORIAL

దశాబ్దాల చరిత్రకు ఆధునిక హంగులు తోడవుతున్నాయి! విమానాశ్రయాన్ని తలపించేలా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ రూపురేఖలు మారుతున్నాయి. రూ.715 కోట్లతో సరికొత్త ప్రపంచం ఆవిష్కృతమవుతోంది. భాగ్యనగరి కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరనుంది! మార్గం - అడుగు, ఎడిటోరియల్ హైదరాబాద్...

నవంబర్ 07, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజమాసం కృష్ణపక్షం మాస శివరాత్రి తిధి త్రయోదశి ఉదయం 10.17 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం చిత్త ఉదయం 05.56 వరకు ఉపరి స్వాతి యోగం ప్రీతి రాత్రి తెల్ల 04.28 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం వణజి ఉదయం...

మనువుల బడి!?|ADUGU TRENDS

గీ రోజుల్ల కొందరు పెండ్లంటనే భయపడతాండ్రు. ఇగ గా మనువాడినోల్లు బాధలు పడతాండ్రు. గిట్ల పెండ్తైతాందో లేదో గట్ల యిడుపుకాయితాలైతానయి. కలిసి బతికే శానామంది ఆలుమొగల్లల్ల ఓ ముద్దూ లేదు ఓ ముచ్చటా...

ప్రశ్నించడమే నేరమా?|EDITORIAL

అధికారాన్ని ప్రశ్నిస్తే ఆంక్షలు.. అవినీతిని ఎండగడితే కేసుల భయం.. ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తే చట్టాల సంకెళ్లు! ఇదేనా ప్రజాస్వామ్యం? పాలకులను నిలదీయాల్సిన మీడియా గొంతుకలకే అడ్డుకట్ట వేస్తే ప్రజల పక్షాన నిలిచేదెవరు? మార్గం...

నవంబర్ 06, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజమాసం కృష్ణపక్షం తిధి ద్వాదశి ఉదయం 10.44 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం హస్త రాత్రి తెల్ల 05.23 వరకు ఉపరి చిత్త యోగం వైధృతి ఉదయం 07.18 వరకు ఉపరి విష్కంబ కరణం తైతుల ఉదయం 10.44...

జనాలకు గా సర్కార్ నజరానా!?|ADUGU TRENDS

పండుగలొత్తే గ దుకాణదారులు, కంపెనీలోల్లు ఆపర్లు పెట్టడం శూసినం. కనీ, ఏకంగా పభుత్వమే పజలకు బంపబరాఫర్ ఇచ్చుడు ఎక్కడైన సూసినమా? ఇగో గా సర్కార్ ఏం శేసిందో సూడుండ్రి. ఇగ దీపాలి రానే వచ్చే....

ట్రంప్ కు అమెరికన్ల షాక్ !|EDITORIAL

ప్రపంచాన్నే తన నిర్ణయాలతో గడగడలాడిస్తున్న ట్రంప్‌కు సొంత దేశంలోనే ఓటర్లు షాక్‌ ఇచ్చారు. మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్ల దెబ్బకు రిపబ్లికన్ల ఆధిపత్యం కుప్పకూలింది. రెండు సభల్లోనూ ఎదురుదెబ్బతో ట్రంప్‌కు ఇక రాజకీయ గండం...

నవంబర్ 05, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజమాసం కృష్ణపక్షం తిధి ఏకాదశి ఉదయం 11.40 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ఉత్తర రాత్రి తెల్ల 05.19 వరకు ఉపరి హస్త యోగం ఐంద్ర ఉదయం 09.15 వరకు వైధృతి కరణం బాలవ ఉదయం 11.40 వరకు ఉపరి...

గివీల్లు సావును జయించిండ్రు!?|ADUGU TRENDS

భూమ్మీద నూకలున్నోడ్ని ఎవరూ సంపలేరు. గా నూకలే లేనోల్లను ఎవరూ కాపాడలేదరంటే గిదే. నిజంగా గివీల్లు మ్రుత్యుంజయులే! సంద్ర పయాణంల తుఫాన్ల శిక్కకున్నరు. గల్లైంతన మూడు నెలలకు పానాలతో కనపడ్డరు!! గా పసిఫిక్ మహాసంద్రంల...

పుర పోరులో కూటమి జోరు!|EDITORIAL

జగన్ కంచుకోటలకే బీటలు.. పట్టణ పీఠాలపై కూటమి జైత్రయాత్ర! ఆంధ్రప్రదేశ్ స్థానిక సమరంలో పసుపు ప్రభంజనం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. పులివెందుల నుంచి మాచర్ల వరకు విజయదుందుభి మోగిస్తూ వైసీపీకి కూటమి గట్టి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News