కామెడీ కింగ్ బ్రహ్మానందం ప్రధాన పాత్రలో, రాజా గౌతమ్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్న చిత్రం బ్రహ్మా ఆనందం . ఎప్పుడూ తన కామెడీతో అలరించే బ్రహ్మానందం, ఈసారి ఎమోషనల్ రోల్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సినిమా ప్రారంభమైనప్పటి నుంచే మంచి బజ్ క్రియేట్ అవుతున్న ఈ చిత్రానికి ట్రైలర్ మరింత ఆసక్తిని పెంచుతోంది. నవ్వించడమే కాకుండా మనసును తాకే భావోద్వేగాలతో కూడిన కథాంశం ఇందులో కనిపిస్తోంది. బ్రహ్మానందం కొత్త అవతారం ఎలా ఉందో తెలుసుకోవాలంటే ట్రైలర్‌పై ఓ లుక్కువెయ్యాల్సిందే.

