ప్రొఫెసర్ హరగోపాల్ ను నాగర్ కర్నూల్ జిల్లా, మైలారంలో మైనింగ్ వ్యతిరేక నిరసనకు మద్దతు ఇచ్చినందుకు అరెస్టు చేయడం అన్యాయమని ప్రజా సంఘాలు విమర్శిస్తున్నాయి. పౌరహక్కుల నేత హరగోపాల్ ను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘనగా భావిస్తున్నారు. ఈ అరెస్టును మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. “రేవంత్ రెడ్డి పాలనలో అణచివేత, ఆంక్షలు, నిర్బంధాలు నిత్యకృత్యంగా మారాయి. ప్రజా సంఘాల నాయకులను వెంటనే విడుదల చేయాలి” అని డిమాండ్ చేశారు. ప్రొఫెసర్ హరగోపాల్, గ్రామస్తుల నిరసనకు మద్దతు ఇవ్వడం ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణలో భాగం అని హరీష్ రావు అన్నారు.

