ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్‌లు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్‌ను కలిశారు. రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధికి మైక్రోసాఫ్ట్ సహకారం అందించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ప్రత్యేకంగా, ఆంధ్రప్రదేశ్‌లో వరల్డ్ క్లాస్ ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు నేపథ్యంలో, ఆ యూనివర్సిటీ సలహా మండలిలో బిల్ గేట్స్ భాగస్వామ్యం వహించాలని కోరారు. ఈ యూనివర్సిటీ ప్రపంచ స్థాయి శిక్షణ, పరిశోధనల కోసం కీలకంగా నిలుస్తుందని చంద్రబాబు వివరించారు. రాష్ట్ర ఐటీ రంగం విస్తరణకు, కొత్త ఉపాధి అవకాశాల సృష్టికి మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యం కీలకమని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు ప్రతిపాదనలపై సహచరులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని బిల్ గేట్స్ హామీ ఇచ్చారు.

