Monday, August 3, 2026
29.5 C
Hyderabad

అన్ని జిల్లాల్లో పర్యటించనున్న బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

ఈ నెల 20న సూర్యాపేటలో, 23న కరీంనగర్‌లో ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు

అసెంబ్లీ సమావేశాల అనంతరం వరుసగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటన

బీఆర్‌ఎస్‌ సిల్వర్ జూబ్లీ సంబరాల విజయానికి దిశానిర్దేశం

భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు పటిష్ట ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనల్లో భాగంగా, జిల్లా కేంద్రాల్లో ముఖ్యమైన పార్టీ నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తారు. ఇప్పటికే పార్టీ అధినేత కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ భవన్‌లో పార్టీ సీనియర్ నేతలు ప్రజాప్రతినిధులతో విస్తృతస్థాయి సమావేశం జరిగింది. అందులో భాగంగా వరంగల్‌లో లక్షలాదిమంది పాల్గొన్న భారీ బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించనునట్లు పార్టీ ప్రకటించింది.

పార్టీ సిల్వర్ జూబ్లీ కార్యక్రమాల్లో భాగంగా అనేక కార్యక్రమాలు, సంబరాలను నిర్వహిస్తూ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కార్యాచరణ రూపొందించబడింది. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను వేటిని అమలు చేయకుండా వంచిస్తున్న తీరు పైన కూడా చేపట్టాల్సిన కార్యాచరణ పైన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు స్వయంగా జిల్లా నేతలకు, కార్యకర్తలకు మార్గదర్శనం చేయనున్నారు.

ఈ నేపథ్యంలో, ఈ నెల 20వ తేదీన సూర్యాపేట జిల్లా కార్యకర్తలతో, 23న కరీంనగర్ జిల్లా నాయకులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల అనంతరం కేటీఆర్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు.

14 ఏళ్ల ఉద్యమం ప్రస్థానంతోపాటు, పదేళ్ల ప్రగతి ప్రస్థానంలో తెలంగాణ సమాజంతో బీఆర్ఎస్ పార్టీ పెనువేసుకున్న ఆత్మీయ అనుబంధాన్ని ఈ సమావేశాల సందర్భంగా మరోసారి గుర్తుచేసుకోనున్నారు.
పార్టీకి ఎన్నిరకాల ఒడిదుడుకులు ఎదురైనా గులాబీ జెండాను గుండెల్లో పెట్టుకుని నిలబడ్డ పార్టీ శ్రేణులకు రానున్న రోజుల్లో మళ్లీ ఉజ్వల భవిష్యత్తు ఉండబోతున్న విషయాన్ని కేటీఆర్ తెలియజేయనున్నారు. ఏడాదిన్నరలోనే తీవ్రమైన ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్న కాంగ్రెస్ సర్కారుపై ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారని, తెలంగాణ ప్రజల భరోసా ఇప్పుడు బీఆర్ఎస్ పైన, కేసిఆర్ గారి పైనే ఉన్న నేపథ్యంలో రానున్న రోజుల్లో మరింత క్రియాశీలకంగా పనిచేయాలని దిశానిర్దేశం చేయబోతున్నారు. కేటీఆర్ పర్యటనల వలన పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం నిండనున్నది.

 

Latest News

ఆగస్టు 03, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పంచమి రాత్రి 08.18 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 08.37 వరకు ఉపరి రేవతి యోగం సుకర్మ రాత్రి 08.54 వరకు ఉపరి ధృతి కరణం కౌలవ ఉదయం 08.40...

అవుమల్లా! కడుపుల బిడ్డ స్పందిత్తదా!?|ADUGU TRENDS

తల్లి గర్భంల ఉండంగనే బిడ్డలకి బయటియి యినబడ్తయా? గవాటికి గా పిల్లలు గూడ స్పందిత్తరా? యెన్కటికి కడుపుల ఉండంగనే అర్జునుడి కొడుకు అభిమన్యుడు పద్మవ్యూహంలకెట్ల పోవాల్నో తెలుసుకున్నడట. గిది నిజమో కాదో కనీ,...

ఉత్తరాంధ్రకు గేమ్ చేంజర్ గా భోగాపురం!?|EDITORIAL

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు ఒక కొత్త అవకాశాన్ని తెరిచింది. ఈ అవకాశాన్ని స్థిరమైన అభివృద్ధిగా మలచడం కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు, స్థానిక ప్రజల సమిష్టి కృషిపైనే ఆధారపడి ఉంటుంది. మౌలిక వసతుల...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 02 నుండి ఆగస్టు 08 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీరు చేపట్టే పనుల్లో ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో...

యిధి యిసిత్రమైందంటే గిదే మరి!?|ADUGU TRENDS

యిధి శాల యిసిత్రమైంది. ఒకపాలి కలిసున్నోల్లను సిడెంల యిడదీత్తది. యిడిపోయినోల్లని శిటికెల కలిపేత్తది. గసొంటిదే గీ ముచ్చట. గదేందో సూద్దాం పాండ్రి. తమిళనాడు రాస్ట్రం విరుదు నగర్ జిల్లా తిరుచూలి పూమాలై పట్టీకి శెందిన...

పోలీసింగ్ పై పార్లమెంటులో సమీక్షేది!?|EDITORIAL

పార్లమెంట్ వరుసగా వాయిదాలు పడుతూ స్తంభిస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర ప్రతిష్ఠంభనల వల్ల ఉభయ సభల్లో కీలక అంశాలపై అసలు చర్చే జరగడం లేదు. పోలీసు వ్యవస్థలో సంస్కరణలు కూడా అత్యవసరం....

ఆగస్టు 01, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ తదియ రాత్రి 09.20 వరకు ఉపరి చవితి నక్షత్రం శతభిషం రాత్రి 08.09 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శోభ రాత్రి 11.43 వరకు ఉపరి అతిగండ కరణం వణజి ఉదయం 09.10...

తెలంగాణ ‘పెద్ద’న్న అస్తమయం!|TELANGANA|PEDDI SUDHARSHAN REDDY

ప్రకటించిన హాస్పిటల్ వైద్యులు హనుమకొండలో గుండెపోటు మెరుగైన వైద్యానికి హైదరాబాద్ కు 5రోజులు మృత్యువుతో పోరాటం కాంగ్రెస్ తోనే రాజకీయ ప్రస్థానం ఆబాల వెంకట్ రెడ్డితో ఓనమాలు మాజీ ఎంపీ సురేందర్ రెడ్డితో పాఠాలు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆరంగేట్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనూ...

ఎలుక ఎంత పని శేసింది!?|ADUGU TRENDS

మనిసి సహా ఏ పాణి సహజ లచ్చణాలు ఆ పాణికి ఉంటయి. గట్లనే కోతి, కొండెంగ, కుక్క, ఎలుక, మనిసి అసొంటివేవీ అతీతమేమీ కావు. గయి గట్లనే మసులుకుంటయి. గందుకే ‘కనకపు సింహాసనం...

ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమవుతోందా!?|EDITORIAL

ప్రతిపక్షం బలహీనంగా ఉంటే ప్రజాస్వామ్యం కూడా బలహీనపడుతుంది. అధికార పక్షం తప్పులను ఎత్తిచూపే శక్తి లేకపోతే ప్రభుత్వ జవాబుదారీతనం తగ్గుతుంది. అందుకే, కాంగ్రెస్ బలపడటం కేవలం ఆ పార్టీ అవసరం మాత్రమే కాదు....

జూలై 31, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ విదియ రాత్రి 09.03 వరకు ఉపరి తదియ నక్షత్రం ధనిష్ఠ రాత్రి 07.09 వరకు ఉపరి శతభిషం యోగం సౌభాగ్య రాత్రి 12.33 వరకు ఉపరి శోభ కరణం తైతుల ఉదయం 08.40...

మా అమ్మాయిని పెండ్లి చేసుకోండి…|CJP|ABHIJITH DIPKE|MARRIAGE

CJP అధినేత అభిజీత్ దీప్కే తల్లి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు|MOTHER|ANITA DIPKE ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడిగా, విద్యార్థుల హక్కుల పోరాటంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిజీత్ దీప్కే వివాహంపై ఆయన తల్లి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News