ఎన్కటేమో గనీ, ఇగిప్పుడైతే నీల్లకు ప్లాటిక్, స్టీలు, రాగి సీసాలే వాడుతాండ్రు. ప్రిజ్జులనే కాదుల్లా, యేడికిపోయినా, గవాటినే తీస్కపొతాండ్రు, లేకపోతే కొనుక్కుని తాగుతాండ్రు. గనీ గవి వాడంగ, వాడంగ… దుర్వాసన వేస్తయి. దుర్గంథం కొడతయి. మరి గవాటిని పోగొట్టే శిన్న శిట్కా మీ కోసం.

ఒక బిర్యానీ ఆకు తీసుకోండ్రి. గదానికి అగ్గిపుల్లతోటో, గ్యాస్ స్టౌతోటో ముట్టించుండ్రి. మంటతోటే గా ఆకుని గా దుర్వాసన కొడుతున్న గా స్టీలు లేదా రాగి సీసల యేసి మూత పెట్టుండ్రి. కొద్దిసేపైనంక గదాని మూత తీసేసి మంచినీల్లతోటి కడుగుండ్రి. గంతే, గా దుర్వాసన పోతది. ఇక మంచిగ వాసన వత్తది. ఎట్టుంది గీ శిట్కా? శేసి సూడుండ్రి మరి!

