పని లేని ఒకాయినె పిలిసి పిల్లి తల కొరిగిండని సామెత. గది సరే గనీ, మరి గీ కోతి మాత్రం.. ఏకంగా గా మంగళాయనె దగ్గరికి పోయి, సవురం శేయించుకుంది. గీ యింతేందో సూద్దామా?

ఓ మంగళాయినె దుకాన్ల హఠాత్తుగ ఓ కోతి సొచ్చింది. సక్కగ పోయి కుర్సీల కూసుంది. తనకు శవురం శేయమని సైగలు శేసింది. ఇగ గా దుకాణం నడిపే దేవరాజ్, మెల్లగ గ కోతి మీద మనుసుల మీదేసినట్లే ఓ గుడ్డేసి, కత్తెర, దువ్వెన పట్టుకుని, కటింగ్ శేసిండు. ఇగ గా శవురం శేత్తాంటే గా కోతి మాత్రం మనిషి లెక్కనే మంచిగ ఎటంటే అటే తిరిగింది. ఇగ గిదీన్ని కొందరు ఈడియోలు తీసిండ్లు. గిప్పుడు గా ఈడియో నెట్టింట్ల తెగ వైరలైతాంది. ఔరా! అని అంతా ముక్కుమీదేలేసుకుంటాండ్రు. గిదేం ఇచ్చెంత్రం! గీ ముచ్చట
కర్ణాటక రాస్ట్రం చామరాజనగర్ జిల్లాల జరిగింది.

