Saturday, September 19, 2026
23.7 C
Hyderabad

కుల గణనపై నెగెటివ్ ప్రచారం – బీఆర్ఎస్‌పై మంత్రుల విరుచుకుపాటు

కుల గణనను ప్లాప్ చేయాలని కుట్ర జరుగుతోందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. హక్కులను కోరినందుకే ఈటల రాజేందర్‌ను బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించారన్నారు. బీసీ నేత అయిన ఈటలను బీఆర్ఎస్ బయటకు పంపిందేమిటని ప్రశ్నించారు.

బీఆర్ఎస్‌లో మూడు కీలక పదవులు ఒక్కరే చేపట్టినప్పుడు, దీని గురించి మాట్లాడే ధైర్యం ఉన్నదా అని ప్రశ్నించారు. కుల గణనలో పాల్గొనని వాడికి ఎలాంటి నైతికత ఉందని నిలదీశారు. కుల గణనలో ఏం తప్పు జరిగిందో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ గణన ద్వారా బలహీన వర్గాలకు ఒక స్పష్టమైన రోడ్‌మ్యాప్ సిద్ధమైందని ప్రజలకు సూచించారు. ఏదైనా పొరపాట్లు ఉంటే అవి బాధ్యతగా సరిచేస్తామన్నారు.

“పదేళ్లలో బీసీల కోసం ఏమి చేశారో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. అసెంబ్లీలోనా? చార్మినార్ వద్దనా? లేక బల్కంపేట ఎల్లమ్మ గుడి దగ్గరనా? ఎక్కడైనా చర్చకు రండి” అని బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం అన్ని హామీలను అమలు చేస్తామని, బీసీల హక్కుల కోసం కేంద్రంపై పోరాడాలని పిలుపునిచ్చారు.

మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, “రెండు కులాల ప్రతినిధిగా చెబుతున్నా, కుల గణన ఒక చారిత్రక చర్య. బీసీల సంఖ్య పెరుగుతున్నా వారికి న్యాయం జరగడం లేదు. రాహుల్ గాంధీ ఆలోచన ప్రకారమే ఈ గణన చేపట్టాం. అసెంబ్లీలో దీనిపై చర్చకు అనుమతించినా, బీఆర్ఎస్ నేతలు మధ్యలోనే వెళ్లిపోవడం వారి నిజమైన వైఖరి ఏమిటో స్పష్టంగా చూపిస్తోంది” అని విమర్శించారు.

సమగ్ర కుటుంబ సర్వే పేరుతో బీసీల కోసం ఏమైనా చేశారా? కనీసం ఆ రిపోర్ట్‌ను కూడా బహిర్గతం చేయలేదని మండిపడ్డారు. కుల గణనపై నెగటివ్ ప్రచారం చేస్తూ, దాని అమలును అడ్డుకునే ప్రయత్నం బీసీలకే నష్టమని హెచ్చరించారు.

Latest News

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

యుద్ధానికి భారీ మూల్యం.. అమెరికాపై ఆర్థిక భారం!|EDITORIAL

యుద్ధం అంటే కేవలం బాంబులు, క్షిపణుల మోత మాత్రమే కాదు.. ఖజానాపైనా భారీ దెబ్బే! ఇరాన్‌తో అమెరికా ఘర్షణ నేపథ్యంలో అగ్రరాజ్యంపై పెరుగుతున్న బిలియన్ల డాలర్ల భారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయుధాల...

సెప్టెంబర్ 18, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు సప్తమి ఉదయం 11.40 వరకు ఉపరి అష్టమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 10.37 వరకు ఉపరి మూల యోగం ప్రీతీ పగలు 02.47 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం వణజి ఉదయం 11.40...

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News