ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా సహకరించాలి – మంత్రి పొన్నం
ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సిద్ధంగా ఉన్నట్టు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులు మంచి స్థితిలో లేవని గుర్తిస్తూ, కార్మికులు ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరారు. ఆర్టీసీ సంస్థ ఇప్పుడిప్పుడే లాభాల బాటలోకి వచ్చిందని, ఇలాంటి సమయంలో కార్మికుల సహకారం అవసరమని చెప్పారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వానికి పూర్తి బాధ్యతగా ఉన్నామని స్పష్టం చేసిన ఆయన, మే 5, 6 తేదీల్లో కార్మిక ప్రతినిధులు ఎప్పుడైనా వచ్చి చర్చించవచ్చని వెల్లడించారు. ఉద్యోగుల సంక్షేమం పట్ల ప్రభుత్వం తగిన విధంగా స్పందిస్తుందని, అందువల్ల కార్మికులు సమ్మె దిశగా వెళ్లకుండా చర్చలతో సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.

