Tuesday, September 22, 2026
24.7 C
Hyderabad

భారత రాజ్యాంగ పరిరక్షణ – మనందరి బాధ్యత

పాదయాత్రకు ప్రజల ఘనస్వాగతం

రాజ్యాంగ పరిరక్షణ కోసం అందరూ ముందుకు రావాలి

సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఈ యాత్రలో భాగస్వామ్యం కావాలి

సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయాలి

జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ యాత్రలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

పాలకుర్తి నియోజకవర్గంలో భారత రాజ్యాంగ పరిరక్షణ కోరుతూ.. ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. రాజ్యాంగ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అనే నినాదంతో, ఏఐసీసీ (అఖిల భారత కాంగ్రెస్ కమిటీ), పీసీసీ (ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) ఆదేశాల మేరకు రాయపర్తి మండలం కాట్రపల్లి గ్రామం నుండి బురహాన్ పల్లి గ్రామం వరకు “జై బాపు, జై భీమ్, జై సంవిధాన్” పేరుతో రాజ్యాంగ పరిరక్షణ సన్నాహక  సమావేశం, పాదయాత్ర నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్ని పాలకుర్తి శాసనసభ్యురాలు యశస్విని రెడ్డి, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, దేశ ప్రజలు రాజ్యాంగాన్ని గౌరవించి, దానిని కాపాడే బాధ్యత తీసుకోవాలని వారు పిలుపునిచ్చారు. కాట్రపల్లి నుండి బురహాన్ పల్లి వరకు సాగిన ఈ పాదయాత్రలో గ్రామస్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రజలు, మహిళలు కోలాట నృత్యాలతో, సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొన్నారు. కిలోమీటర్ల మేర సాగిన ఈ పాదయాత్ర “భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం, దేశాన్ని పరిరక్షించుకుందాం” అనే నినాదాలతో విజయవంతంగా ముగిసింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ, భారత రాజ్యాంగ అమలుకు 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, పార్లమెంట్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌ను అవమానించే విధంగా చేసిన వ్యాఖ్యలపై నిరసనగా “జై బాపు, జై భీమ్” కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. రాజ్యాంగ పరిరక్షణ అనేది ఒక ప్రత్యేక వ్యక్తి లేదా పార్టీకి చెందినదికాదు, ఇది దేశంలోని ప్రతి పౌరుడి బాధ్యత అని స్పష్టంగా చెప్పారు. రాజ్యాంగాన్ని గౌరవించకుండా, ప్రజాస్వామ్య విలువలను అపహాస్యం చేసే విధంగా వ్యవహరించడం అన్యాయం అని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యుత్తమమైన రాజ్యాంగాల్లో ఒకటని, దేశాన్ని ఏకతాటిపై ఉంచే గొప్ప శక్తిగా నిలుస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా చేతిలో మహాత్మా గాంధీ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటాలు పట్టుకుని ప్రజలు పాల్గొనడం గర్వించదగిన విషయమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయాలని ఎమ్మెల్యే సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయాన్ని సాధించేందుకు, రాజ్యాంగ పరిరక్షణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ పరిరక్షణకు అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాలని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పిలుపునిచ్చారు. రాజ్యాంగ విలువలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, దేశ ప్రజలు రాజ్యాంగాన్ని గౌరవించి, దానిని పరిరక్షించే బాధ్యత తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, బ్లాక్ మండల నాయకులు, స్థానిక ప్రజలు, వివిధ గ్రామ శాఖ అధ్యక్షులు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

https://youtu.be/FEdJZs_8XP8?feature=shared

Latest News

బంగారం కొనే ముందు గీ మూడు సూడాలే!|ADUGU TRENDS

మనం బంగారం, నగలు ఏడ కొంటం? ఔసలోల్ల దగ్గర, బంగారం దుకాణాల్ల కొంటం .పెద్దపెద్ద దుకాణాలకు కూడా పోయేటోల్లు ఉంటరు. కానీ, గీ మూడు ముఖ్యమైన ముచ్చట్లు పట్టించుకోం. కానీ మన సర్కార్...

సెప్టెంబర్ 22, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ఏకాదశి రాత్రి 07.23 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 06.14 వరకు ఉపరి శ్రవణ యోగం అతిగండ సాయంత్రం 04.49 వరకు ఉపరి సుకర్మ కరణం వణజి ఉదయం 06.34...

సెప్టెంబర్ 21, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు దశమి సాయంత్రం 05.43 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం ఉత్తరాషాఢ పూర్తిగా ఉంది యోగం శోభ సాయంత్రం 04.30 వరకు ఉపరి అతిగండ కరణం గరజి సాయంత్రం 05.43 వరకు ఉపరి వణజి రాహుకాలం...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 20 నుండి సెప్టెంబర్ 26 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త అవకాశాలు కనిపిస్తాయి, ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపార రంగాల్లో ముందడుగు వేసే పరిస్థితులు ఏర్పడతాయి. నిలిచిపోయిన పనులను...

కరకరలాడే కరెన్సీ నోట్లతో నాయకుడు!|ADUGU TRENDS

అవును. మీరు ఇ0టున్నది నిజమే. కావాలనంటే మీరే సూడు0డ్రి. గాడ కరకరలాడే కొత్త కరెన్సీ నోట్ల తోటి ఇనాయకుడిని అలంకరించినరు. ఒక్క రూపాయి రెండు రూపాయలతోటి కాదుల్ల ఏకంగా 65.03 లచ్చల నోట్ల...

పన్నుల ఉచ్చులో ప్రపంచ వాణిజ్యం!|EDITORIAL

సుంకాల అస్త్రంతో అమెరికా మరోసారి ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేస్తోంది. రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల పేరుతో భారత్, చైనాలపై కూడా భారీ సుంకాల ముప్పు తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రష్యా చమురు దిగుమతుల విషయంలో...

సెప్టెంబర్ 19, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు అష్టమి పగలు 01.40 వరకు ఉపరి నవమి నక్షత్రం మూల రాత్రి 01.14 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం ఆయుష్మాన్ పగలు 03.20 వరకు ఉపరి సౌభాగ్య కరణం బవ పగలు 01.40...

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

యుద్ధానికి భారీ మూల్యం.. అమెరికాపై ఆర్థిక భారం!|EDITORIAL

యుద్ధం అంటే కేవలం బాంబులు, క్షిపణుల మోత మాత్రమే కాదు.. ఖజానాపైనా భారీ దెబ్బే! ఇరాన్‌తో అమెరికా ఘర్షణ నేపథ్యంలో అగ్రరాజ్యంపై పెరుగుతున్న బిలియన్ల డాలర్ల భారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయుధాల...

సెప్టెంబర్ 18, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు సప్తమి ఉదయం 11.40 వరకు ఉపరి అష్టమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 10.37 వరకు ఉపరి మూల యోగం ప్రీతీ పగలు 02.47 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం వణజి ఉదయం 11.40...

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News