Sunday, September 20, 2026
26.4 C
Hyderabad

సట్టుబండల సదువుతో సంపూర్ణ అక్షరాస్యత సాధ్యమేనా!?|EDITORIAL

అక్షరాస్యత అంటే వ్యక్తి చదవగలగడం, రాయగలగడం, ప్రాథమిక లెక్కలలో చక్కగా వ్యవహరించగలగడం. కానీ ‘సంపూర్ణ అక్షరాస్యత’ అంటే కేవలం అక్షరాల పరిచయం మాత్రమే కాదు. అది వ్యక్తి చైతన్యం, సంఘంలో విజ్ఞానంతో పాల్గొనగల సామర్థ్యం, ప్రాథమిక విద్యను మించిన జీవిత నైపుణ్యాలు కలిగి ఉండటమని అర్థం.

భారతదేశం సహా అనేక రాష్ట్రాలు అక్షరాస్యతలో పురోగతిని సాధించినప్పటికీ, అది సంపూర్ణ స్థాయికి చేరలేకపోయింది. దేశంలో 2024 నాటికి అక్షరాస్యత రేటు 77శాతంగా ఉండగా, తెలంగాణలో 72శాతం పైనే ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో, మహిళలలో, ఆదివాసీ గిరిజన సమాజాల్లో, అక్షరాస్యత స్థాయి చాలా తక్కువగా ఉంది.

ప్రతి ఏటా సెప్టెంబర్‌ 8వ తేదీని ’అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం’గా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. నవంబర్‌ 17, 1965లో యునెస్కో సభ్యదేశాల విద్యాశాఖ మంత్రుల మహాసభ అనంతరం అక్షరాస్యత దినోత్సవాన్ని ప్రకటించగా, 1966 నుండి జరుపుకుంటున్నాం. ఉన్నతమైన జీవనానికి, విద్య, విజ్ఞానం ఎంతో అవసరం. ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాలతో పోలిస్తే అక్షరాస్యత విషయంలో భారతదేశం వెనుకబడి వున్నట్లే. అనేక రాష్టాల్రు సగటు అక్షరాస్యతా శాతానికి దూరంగా ఉన్నాయి. ప్రపంచ నిరక్షరాస్యుల్లో సగం మంది మనదేశంలోనే ఉండటం విచారకరం.
దేశంలో సర్వ శిక్షా అభియాన్, మధ్యాహ్న భోజన పథకం, బేటీ బచావో – బేటీ పడావో వంటి కార్యక్రమాలు అమలవుతున్నాయి. గతంలో వయోజన విద్యకు ప్రాధాన్య ఇచ్చేవారు. ఈ మధ్య అది కనిపించడం లేదు. ప్రతి ఒక్కరిని అక్షరాస్యులను చేయాలన్న సంకల్పం మేరకు గ్రామ స్థాయిలో సర్వేచేసి పిల్లలను బలవంతంగా స్కూళ్లకు చేర్చారు. అలాగే పనిప్రదేశాల్లో బాలకార్మికులను లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేవారు అవేవీ ఇప్పుడు పెద్దగా అమలు కావడం లేదు. పలు వైఫల్యాల కారణంగా అక్షరాస్యతను సాధించడంలో మనం విఫలం అవుతున్నాం.

ప్రభుత్వాలు పెద్ద మొత్తంలో నిధులను ఖర్చు చేస్తున్నా, వాటి వినియోగం లోపిస్తున్నది. నిర్దిష్ట లక్ష్యాలు లేకపోవడం, మధ్యంతర సమీక్షలు, విశ్లేషణల కొరత, వ్యవస్థాపిత అవినీతి, పాఠశాలల నిర్మాణం నుంచి ఉపాధ్యాయ నియామకాల వరకు ప్రతిచోటా కనిపిస్తోంది. బడుల్లో బోధన జరిగే తీరుపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాఠ్యాంశాలు స్థానికత లోపించి. అర్థవంతంగా ఉండకపోవడం, ఉపాధ్యాయుల నైపుణ్యం లోపించడం, ఉపకరణాల కొరత వంటి ఆటంకాలు కనిపిస్తున్నాయి. పేద కుటుంబాల పిల్లలు ఇప్పటికీ పనులకే వెళ్ళిపోతున్నారు. బాల కార్మిక వ్యవస్థలో చిక్కుకొని ఇంకా కొందరు చదువుకు దూరంగా ఉండే పరిస్థితులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా గిరిజన, దళిత సమాజాలలో విద్యపై అవగాహన లేకపోవడమే కాక, ఆధునిక విద్యను ‘అవాంఛిత భారంగా’ భావించే ధోరణి కనిపిస్తోంది. విద్యా మాధ్యమం అంటే బోధనా భాష అడ్డంకిగా మారుతోంది. విద్యార్థులు మాతృభాషలో అయితేనే చదువుకోగలరు. సులువుగా అర్థం చేసుగలరు. బాలికల విద్యలో ఇంకా ఉన్న సామాజిక ఆంక్షలు, బాల్య వివాహాలు, భద్రతా భయాలు వంటి అంశాలు సంపూర్ణ అక్షరాస్యతను దూరంగా ఉంచుతున్నాయి. అక్షరాస్యతలో లింగ వ్యత్యాసం ఒక సవాల్ గా నిలుస్తోంది.

భారతదేశంలో సర్వ శిక్షా అభియాన్, మధ్యాహ్న భోజన పథకం, బేటీ బచావో – బేటీ పడావో వంటి కార్యక్రమాలు ఉన్నా, అవి ప్రగతికి కారణమయ్యాయో, లేక ప్రజలకు మరొక సంక్షేమ పథకంగా మిగిలిపోయాయో అన్నది ప్రశ్నార్థకమే. అనేక పాఠశాలలు విద్యార్థుల లెక్కల కోసం ‘ఒకడినీ వదలొద్దు’ అన్న నినాదాన్ని మాత్రమే అనుసరిస్తున్నాయి, బోధనను గాలిక వదిలేస్తున్నాయి.

విద్యా వ్యవస్థను కేవలం పాఠశాల స్థాయిలో కాక, సామాజిక స్థాయిలోనూ ఆధునీకరించాలి. ఉపాధ్యాయుల శిక్షణ, పాఠ్యాంశాల్లో స్థానికతకు ప్రాధాన్యత ఇవ్వడం, భాషను విద్యార్థులకి అర్థమయ్యేలా మార్చడం అవసరం. సమాజం మొత్తంగా విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రచారం జరగాలి. ఇది కేవలం ప్రభుత్వ బాధ్యత కాదు, ప్రతి పౌరుడి బాధ్యత కావాలి. డిజిటల్ విద్యను సామాన్యులకు అందుబాటులోకి తేవాలి. డిజిటల్ విభజనను అధిగమించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్, విద్యా పరికరాలు అందించాలి. బాలికల విద్య, గిరిజన సమాజాల అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలి. జాతీయ నూతన విద్యా – ఎన్ఇపి-2020 – విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి.

ప్రపంచ నిరక్షరాస్యు ల్లో సగం మంది మనదేశంలోనే ఉండటం విచారకరం. స్థిరమైన ఆర్థికాభివృద్ధి సాధించాలంటే దేశంలో 80 శాతం అక్షరాస్యత సాధించాల్సిన అవసరం ఉంది. ప్రధానగా విద్యారంగం పట్ట కేంద్ర, రాష్టాల్రు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ బడ్జెట్ కేటాయింపులను తగ్గించేస్తున్నాయి. జనాభాకు అనుగుణంగా విద్యారంగానికి నిధులు ఇవ్వాలి. ప్రైవేటు, కార్పొరేట్ విద్యపై ప్రభుత్వ అజమాయిషీ కొరవడింది. దీంతో వాటి ఫీజులుం, దోపిడీ కొనసాగుతూనే ఉంది. తెలంగాణలో కెజి టూ పిజి విద్యకు ప్రణాళిక పట్టాలకెక్కడం లేదు. ఏపీలో జగనన్న ‘విద్యా కానుక’ తప్ప స్కూళ్ల బలోపేతం జరగలేదు. ప్రభుత్వ రంగంలో ప్రాథమిక విద్యకు బలమైన పునాదులు పడాలి. అలాగేకార్పోరేట్‌ దోపిడీని అరికటటాలి. అప్పుడే విద్యారంగం విస్తృతం కాగలదు. సామాన్యుడి నుంచి, రాజకీయనాయకుల, అధికారుల పిల్లలంతా ఒకే విద్యావిధానంలో చదవాలన్న ఆకాంక్ష అమలు కావడం లేదు. విద్యాభివృద్దిలో కులరహిత హాస్టళ్లు ఉండకూడదు. కామన్‌ ఎడ్యుకేషన్‌ అన్నది సమాజాంలో అంతరాలను తొలగిస్తుంది. చదువుకుంటే నిరుద్యోగిగా మిగిలిపోతున్న ప్రస్తుత తరుణంలోచదువుతు తగ్గ ఉపాధి దక్కేలా చేయాలి. చిత్తశుద్ధి ఉంటే తప్ప విద్యారంగాన్ని మార్చలేం. అందరికీ విద్య అన్నది ప్రాథమిక హక్కుగా ఉన్నా, ఆచరణలో సాధ్యం కావడంలేదు. దీనిని ఆచరణలోకి తీసుకుని వచ్చేలా చర్యలు తీసుకుంటే తప్ప సంపూర్ణ అక్షరాస్యత సాధ్యం కాదు.

Latest News

కరకరలాడే కరెన్సీ నోట్లతో నాయకుడు!|ADUGU TRENDS

అవును. మీరు ఇ0టున్నది నిజమే. కావాలనంటే మీరే సూడు0డ్రి. గాడ కరకరలాడే కొత్త కరెన్సీ నోట్ల తోటి ఇనాయకుడిని అలంకరించినరు. ఒక్క రూపాయి రెండు రూపాయలతోటి కాదుల్ల ఏకంగా 65.03 లచ్చల నోట్ల...

పన్నుల ఉచ్చులో ప్రపంచ వాణిజ్యం!|EDITORIAL

సుంకాల అస్త్రంతో అమెరికా మరోసారి ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేస్తోంది. రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల పేరుతో భారత్, చైనాలపై కూడా భారీ సుంకాల ముప్పు తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రష్యా చమురు దిగుమతుల విషయంలో...

సెప్టెంబర్ 19, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు అష్టమి పగలు 01.40 వరకు ఉపరి నవమి నక్షత్రం మూల రాత్రి 01.14 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం ఆయుష్మాన్ పగలు 03.20 వరకు ఉపరి సౌభాగ్య కరణం బవ పగలు 01.40...

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

యుద్ధానికి భారీ మూల్యం.. అమెరికాపై ఆర్థిక భారం!|EDITORIAL

యుద్ధం అంటే కేవలం బాంబులు, క్షిపణుల మోత మాత్రమే కాదు.. ఖజానాపైనా భారీ దెబ్బే! ఇరాన్‌తో అమెరికా ఘర్షణ నేపథ్యంలో అగ్రరాజ్యంపై పెరుగుతున్న బిలియన్ల డాలర్ల భారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయుధాల...

సెప్టెంబర్ 18, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు సప్తమి ఉదయం 11.40 వరకు ఉపరి అష్టమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 10.37 వరకు ఉపరి మూల యోగం ప్రీతీ పగలు 02.47 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం వణజి ఉదయం 11.40...

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News