ఓఆర్ఆర్ (ఔటర్ రింగ్ రోడ్) లీజు అంశంపై విచారణ జరుగుతోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ, ఈ విషయంలో అవకతవకలు జరిగాయని, సిట్ విచారణ ద్వారా నిజాలు బయటపడతాయని అన్నారు. మాజీ మంత్రి హరీశ్ రావు తన మామ, బామ్మర్దిని ఇరికించేందుకు సిట్ విచారణ కోసం సీఎం రేవంత్ రెడ్డి వద్ద ప్రస్తావించారని తెలిపారు. ఫార్ములా-ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో దొంగలు పట్టుబడ్డారని, అదే విధంగా ఓఆర్ఆర్ టోల్ లీజులో ఉన్న అవకతవకలు కూడా బయటపడతాయని పేర్కొన్నారు.
మంత్రిత్వ కాలంలో ఓఆర్ఆర్ అభివృద్ధికి తనదైన కృషి చేశానని, 2017లో ఆగిపోయిన ప్రాజెక్టును తిరిగి కొనసాగించడంలో తాను కీలక పాత్ర పోషించానని కోమటిరెడ్డి తెలిపారు. దీనికి కేంద్రం సహకారాన్ని గుర్తు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్రమంత్రి గడ్కరీకి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు కోసం ఢిల్లీలో అనేక ప్రయత్నాలు చేశానని, అందుకు ప్రతిఫలంగా ప్రాజెక్టు ముందుకు సాగడం గర్వకారణమని అన్నారు.

