హైదరాబాద్, కమాండ్ కంట్రోల్ సెంటర్ లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ బ్రోచర్, వెబ్ సైట్ ను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అలాగే స్కూల్ యూనిఫార్మ్స్ నమూనాలను సీఎం పరిశీలించి తగు సూచనలు చేశారు. సైనిక్ స్కూల్ తరహాలో పోలీస్ స్కూల్ కూడా దేశానికే రోల్ మోడల్ గా ఉండేలా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. విద్యా విధానంలో కొత్త ఒరవడిని అవలంభించాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. విద్యతో పాటు స్పోర్ట్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు చెప్పారు. అలాగే అమరుల కుటుంబాల పిల్లలకు అడ్మిషన్లలో మొదటి ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

