నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో జరిగిన ఈ భేటీకి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే సంజయ్‌లు సీఎం రేవంత్ రెడ్డికి శాలువా కప్పి సత్కరించారు.
సీఎం రేవంత్ రెడ్డి వారికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ డిసిసిసి అధ్యక్షుడు రోహిణ్ రెడ్డి కూడా పాల్గొన్నారు. సమావేశం అనంతరం వీరి మధ్య ప్రత్యేక చర్చ జరిగినట్లు సమాచారం. ఈ చర్చలో ప్రధానంగా రాజకీయాలు, రాష్ట్ర అభివృద్ధి అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నట్లు తెలుస్తోంది.

