Tuesday, August 25, 2026
24.9 C
Hyderabad

రైతుకు అగ్ని పరీక్షగా పంటల కొనుగోలు!|EDITORIAL

దేశ ఆర్థిక వ్యవస్థకు రైతే వెన్నెముక అని చెప్పడం సులువు. కానీ రైతు పండించిన ధాన్యాన్ని గౌరవంగా కొనుగోలు చేసి, సమయానికి చెల్లింపులు చేయడం ద్వారానే ఆ మాటలకు అర్థం వస్తుంది. రైతుకు తన ధాన్యం అమ్ముకోవడం కష్టంగా మారితే, అది కేవలం పరిపాలనా వైఫల్యం మాత్రమే కాదు. రైతు పట్ల సమాజం చూపుతున్న నిర్లక్ష్యానికి కూడా నిదర్శనం.!

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో యాసంగి ధాన్యం కొనుగోళ్లు మళ్లీ రైతుల ప్రాణాల మీదకే తెచ్చాయి. కష్టాలకు, కన్నీళ్ళకు ప్రతీకలుగా మారాయి. పంట పండించడమే కాదు, దాన్ని అమ్ముకోవడమే ఇప్పుడు రైతులకు అగ్నిపరీక్షగా మారింది. కొనుగోలు కేంద్రాల వద్ద రోజులు గడుపుతున్న రైతుల ఆవేదన ప్రతి ఏడాది కనిపిస్తున్నా, ప్రభుత్వాల వ్యవహారశైలిలో మాత్రం పెద్దగా మార్పు కనిపించడం లేదు. రైతు సంక్షేమం పేరుతో సభల్లో గొప్పలు చెప్పుకునే పాలకులు, క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న బాధలను మాత్రం గమనించడం లేదు.

తెలంగాణలో ఈ యాసంగి సీజన్‌లో 90 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా ప్రభుత్వం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా లక్షల టన్నుల సేకరణ జరుగుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి చూస్తే గణాంకాలు ఒకలా, వాస్తవాలు మరోలా ఉన్నాయి. కొనుగోలు కేంద్రాల వద్ద గన్నీ సంచుల కొరత, లారీల సమస్య, హమాలీల లేమి, తూకం యంత్రాల కొరత రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.

అకాల వర్షాలు రైతుల కష్టాలను మరింత పెంచాయి. పలుచోట్ల కల్లాల్లో నిల్వ ఉంచిన ధాన్యం తడిసి మొలకెత్తే పరిస్థితి ఏర్పడింది. వర్షం పడుతుందేమోనన్న భయంతో రైతులు రాత్రింబవళ్లు ధాన్యానికి కాపలా కాస్తున్నారు. కొందరు రోడ్లపైనే వడ్లను ఆరబెడుతుంటే, మరికొందరు టార్పాలిన్ కప్పి వర్షం నుంచి రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయినా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రభుత్వాలు చెబుతుంటే, వాటిని కొనుగోలు కేంద్రాల్లో అధికారులు తిరస్కరిస్తున్నారు.

రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని ప్రభుత్వాలు ప్రకటిస్తున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం “తాలు ఎక్కువ”, “తేమ శాతం అధికం”, “ధాన్యం నాణ్యత సరిగా లేదు” అంటూ కొర్రీలు పెట్టడం సాధారణంగా మారింది. ఫలితంగా రైతులు మిల్లర్ల దయాధీనంగా మారుతున్నారు. చాలాచోట్ల రైస్ మిల్లర్లు నాలుగైదు కిలోల తరుగు పేరిట రైతులను దోచుకుంటున్నారు.

ధాన్యం కొనుగోళ్లలో ప్రధాన సమస్య రవాణా. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యం రోజుల తరబడి నిల్వ ఉండిపోతోంది. లారీలు అందుబాటులో లేకపోవడం, రవాణా కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో లారీ యజమానులు ఒక్కో సంచికి అదనంగా రూ.3 నుంచి రూ.5 వరకు వసూలు చేస్తున్నారు. మరోవైపు హమాలీల కొరత కూడా పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తోంది.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలే లేవన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తాగునీరు, షెడ్లు, విద్యుత్, తూకం యంత్రాలు, నిల్వ సదుపాయాలు సరిగా లేక రైతులు ఎండలోనే రోజులు గడపాల్సి వస్తోంది. కొన్ని చోట్ల రైతులు సీరియల్ నంబర్ల కోసం గొడవలు పడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. రైతు సమస్యను పరిపాలనా అంశంగా కాకుండా, జీవన్మరణ సమస్యగా చూడాల్సిన అవసరం ఉంది.

ఇక రాజకీయ పార్టీల వ్యవహారం కూడా విమర్శలకు తావిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో విధంగా వ్యవహరించడం కొత్తేమీ కాదు. గతంలో “వరేస్తే ఉరే” అంటూ వరి సాగును నిరుత్సాహపరిచిన బీఆర్ఎస్ నాయకత్వం ఇప్పుడు రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని విమర్శిస్తోంది. అదే సమయంలో ప్రస్తుత ప్రభుత్వం కూడా పరిస్థితిని పూర్తిగా నియంత్రించలేకపోతోంది. రైతుల పక్షాన నిలబడాల్సిన ప్రతిపక్షాలు క్షేత్రస్థాయిలో పత్తా లేకుండా పోయాయి.

ధాన్యం కొనుగోళ్లలో ప్రతి ఏడాది ఒకే సమస్యలు పునరావృతమవుతున్నాయంటే, ప్రభుత్వాల వద్ద దీర్ఘకాలిక ప్రణాళికల లోపం స్పష్టంగా కనిపిస్తోంది. వ్యవసాయ ఉత్పత్తి పెరుగుతున్నా, నిల్వ సామర్థ్యాలు, రవాణా వ్యవస్థ, మిల్లింగ్ సామర్థ్యాలను అదే స్థాయిలో పెంచకపోవడం ప్రధాన కారణం. రైతు నుంచి ధాన్యం సేకరణ మొదలుకొని మిల్లులకు తరలింపు వరకు సమన్వయం లేకపోవడంతో సమస్యలు మరింత తీవ్రమవుతున్నాయి.

ఈ పరిస్థితికి తక్షణ పరిష్కారం అవసరం. కొనుగోలు కేంద్రాల వద్ద అదనపు లారీలు, హమాలీలను ఏర్పాటు చేయాలి. గన్నీ సంచుల కొరతను వెంటనే నివారించాలి. తడిసిన ధాన్యాన్ని కూడా నిర్దిష్ట ప్రమాణాలతో కొనుగోలు చేసే విధానాన్ని అమలు చేయాలి. కలెక్టర్లు, ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను పరిష్కరించాలి. రైతులను మిల్లర్లు, మధ్యవర్తుల దోపిడీ నుంచి కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకోవాలి.

దేశ ఆర్థిక వ్యవస్థకు రైతే వెన్నెముక అని చెప్పడం సులువు. కానీ రైతు పండించిన ధాన్యాన్ని గౌరవంగా కొనుగోలు చేసి, సమయానికి చెల్లింపులు చేయడం ద్వారానే ఆ మాటలకు అర్థం వస్తుంది. రైతుకు తన ధాన్యం అమ్ముకోవడం కష్టంగా మారితే, అది కేవలం పరిపాలనా వైఫల్యం మాత్రమే కాదు. రైతు పట్ల సమాజం చూపుతున్న నిర్లక్ష్యానికి కూడా నిదర్శనం.

Latest News

ఆగస్టు 24, సోమవారం, 2026|RASHI PHALALU 

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం తిధి ద్వాదశి రాత్రి తెల్ల 05.13 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 08.43 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం ప్రీతి ఉదయం 08.32 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం బవ సాయంత్రం 04.17...

మౌర్యుల చరిత్ర|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS|HISTORY

(క్రీ.పూ.320 నుండి క్రీ.పూ.180 వరకు) భారతదేశ చరిత్రలో మహా సామ్రాజ్యంగా తొలుత మౌర్య సామ్రాజ్యము వెలిసింది. మౌర్యులు భారత ఉపఖండం(ప్రస్తుత భారతదేశం, పాకిస్థాన్, ఆఫ్ఘానిస్తాన్, బాంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, టిబెట్) మొత్తాన్ని ఇక చక్రాధిపత్యంగా...

నడుస్తున్న మనిషి|POETRY|PARVATHALU

నిలబడిన చోట పెళ్లున కొమ్మ విరిగి పడ్డట్లు మనుషులు కూలిపోతూ కుటుంబాలనొదిలి వెళ్ళిపోతున్నారు అనారోగ్యమిప్పుడు శత్రుదేశాల దాడిలా ప్రమాదకరమైంది వైరస్ ఎప్పుడు మాటుగాస్తుందో ఆరోరోగ్యం ఎప్పుడు మందగిస్తుందో నవ్వుతున్న మనిషి నవ్వుతున్నట్లే అయ్యో !ఇందాకనే ఫోన్ లో మాట్లాడిండని అంటూ...

మనిషి అంటే పర్వతాలే!|PARVATHALU|HUMANITY

పర్వతాలు... పేరుకు తగ్గట్లే, మేరు పర్వతం. అనేక పర్వతాల సరితూగే శక్తిగల మేరునగధీరుడు. ధీశాలి. కోరకున్నా వరాలిచ్చే అపర పరమేశ్వరుడు. ఆ భోళా శంకరుడి లాగే భోళా మనిషి. ప్రార్థించే పెదవులకన్నా, సాయం...

సీఎం సహాయ నిధికి 10 యేలిచ్చిన బిచ్చగాడు!?|ADUGU TRENDS

బిచ్చగాడే గదాని తీసి పారేయొద్దు. తక్కువ సూడొద్దు. ఒక్కొక్కటే వందలు, యేలైతయి. కానీ, గయి కూడబెట్టనీకే ఎంతో కట్ట పడాలె. బిచ్చమెత్తడం అంత అల్కనేం కాదు. అభిమానం సంపుకోవాలె. అవమానాలు భరించాలె. ఇచ్చినా,...

రూపాయి బియ్యంతో కోట్లలో దళారుల దందా!|EDITORIAL

రేషన్ బియ్యం అక్రమ రవాణా కేవలం లబ్ధిదారుల స్థాయిలోనే కాదు. కొన్నిచోట్ల డీలర్లు, దళారులు కుమ్మక్కై నిల్వలను నిలువునా మింగేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గోదాములు, హోటళ్లు, ఇతర రాష్ట్రాలకు అక్రమ రవాణా జరుగుతున్నాయి....

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 23 నుండి ఆగస్టు 29 వరకు వార రాశి ఫలాలు మేష రాశి: ఈ వారం మీకు అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. ప్రారంభించిన పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా మంచి...

ఒక్కరోజు బిచ్చగాడి సంపాదనెంతంటే..!?|ADUGU TRENDS

ఒకాయినెకు ఓ అవుడియా వచ్చింది. తానే బిచ్చమెత్తితే? గట్ల బిచ్చమెత్తి రోజుకు ఎంత సంపాయించొచ్చు? గదాంట్ల ఉండే సాదకబాదకాలు తెలుసుకుందామని. ఇగ ఆగకుండ ఐవుడియా వచ్చిందే లెక్క... యెంటనే ఆ అవతారమెత్తిండు. ఆఖరికి...

ప్రియాంక-బెటర్ ఛాయిసేనా!?|EDITORIAL

కాంగ్రెస్ కు ‘ప్రియాంక బెటర్ ఛాయిసా?” అన్నదానికంటే ‘కాంగ్రెస్ మెరుగైన ప్రతిపక్షంగా ఎలా సాగాలి?’ అన్నదే ముఖ్యం. సభను సజీవంగా మార్చడం ద్వారా ప్రతిపక్షం బలపడుతుంది. ప్రభుత్వాన్ని విమర్శించడంతో పాటు ప్రత్యామ్నాయ విధానాన్ని...

ఆగస్టు 22, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం తిధి దశమి రాత్రి 01.18 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం జ్యేష్ఠ పగలు 03.33 వరకు ఉపరి మూల యోగం వైధృతి ఉదయం 07.15 వరకు ఉపరి విస్కమ్బ కరణం తైతుల పగలు 12.18 వరకు ఉపరి గరజి రాహుకాలం...

కొండా సురేఖ చుట్టూ రాజకీయ ఉచ్చు..|KONDA SUREKHA|CONGRESS|CM|REVANTH REDDY

పార్టీ నుంచి బహిష్కరించాలంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు|MLA|MLC తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ వ్యవహారం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన...

గిదో కుక్కల కు.ని. పంచాయితీ!?|ADUGU TRENDS

గీ మద్దెల కుక్కల రోజులొచ్చినయి. మనుసుల లెక్కనే గా కుక్కల జనాభా కూడా పెరిగింది. గవి జనం మీదకు ఎగపడుడు. కరుసుడు, పీక్కతినుడు కూడా ఎక్కువై పోయింది. గ వాట్ని సంపుదామంటే, జీవ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News