Thursday, July 30, 2026
23.7 C
Hyderabad

కలమెత్తిన ‘అడుగు’..! గళమెత్తిన ‘బడుగు’!!

అడుగు ఎఫెక్ట్

వరంగల్ మిల్లు సమస్యను శాసనమండలిలో ప్రస్తావించిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ

అజంజాహీ మిల్లు కార్మిక భవన స్థల కబ్జాని కట్టడి చేయాలి

స్థల పరిరక్షణకై ప్రభుత్వానికి బస్వరాజు సారయ్య విజ్నప్తి

రాజ్యసభ సభ్యుడిగా డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ ఎంపీ నిధులు

తప్పుడు దస్తావేజులతో ఇంటి, వ్యవసాయ భూమిగా రిజిస్ట్రేషన్లు!

2016లోనే వ్యవసాయ భూమిగా మ్యుటేషన్!?

గత ప్రభుత్వ హయాంలోనే దర్జాగా బడా వ్యాపారి కబ్జా!

మాజీ ఎమ్మెల్యేతో రెవిన్యూ, మున్సిపల్ అధికారులు కుమ్మక్కు!

ఇప్పటి హన్మకొండ కలెక్టరే అప్పటి కమిషనర్ గా అనుమతుల జిమ్మిక్కు!?

మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి స్వయంగా షాపింగ్ కాంప్లెక్స్ కి శంకుస్థాపన!

కార్మిక లోకం ప్రభుత్వ జోక్యాన్ని అర్ధిస్తోంది!

సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తారని ఎదురుచూస్తోంది!

‘అడుగు’ కలమెత్తితే, ‘బడుగు’ గళమెత్తాడు. కార్మికుల కుటుంబాలు కదం తొక్కితే, ప్రజా సంఘాలు పదం కలిపాయి. ప్రతిపక్షాలు అఖిలపక్షమై ఏకపక్షమయ్యాయి. స్వపక్షంలోనే విపక్షం నిరసన స్వరమెత్తింది. శాసన మండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య గళమెత్తాడు. కాసం మోసానికి కార్మికులు కకావికళమయ్యారు. గరళమైన అజంజాహీ మిల్లు కార్మిక భవన స్థల కబ్జాపై ఉద్యమ గళాలన్నీ యుగళమై పిడికిలెత్తాయి. దర్జాగా కబ్జాకు గురైన అజంజాహీ మిల్లు కార్మిక భవన స్థలం ప్రజా ఉమ్మడి ఉద్యమానికి వేదికైంది. కోట్ల రూపాయల విలువైన భూమి పరిరక్షణ కోసం లక్ష సంతకాల సేకరణ లక్ష్యం ఇంకా కొనసాగుతోంది. తమ ఆర్తనాదం అరణ్యరోదనై, సకల కార్మిక లోకం ప్రభుత్వ జోక్యాన్ని అర్ధిస్తోంది. సబ్బండ వర్గాల సమాజం ఆ స్థల పరిరక్షణ కోసం నిరీక్షిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డిగారే స్వయంగా స్పందిస్తారని ఎదురుచూస్తోంది! మరి సీఎం గారు స్పందిస్తారా? కార్మిక లోక నిరీక్షణ ఫలిస్తుందా?

చారిత్రక వరంగల్ అజంజాహీ మిల్లు కార్మిక భవన స్థల వివాదం అసెంబ్లీ దాకా వెళ్ళింది. అందరి దృష్టి ఇప్పుడు కార్మిక భవన స్థల కబ్జాపై మళ్ళింది. మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యే స్వయంగా గళమెత్తారు. తెలంగాణ అసెంబ్లీ 3వ సమావేశం, 5వ సెషన్, 3వ రోజు శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సారయ్య వరంగల్ అజంజాహీ మిల్లు కార్మిక భవన స్థల కబ్జా వ్యవహారాన్ని లేవనెత్తారు. అధ్యక్షా అంటూ ఆయన చారిత్రక మిల్లు సమస్య మొత్తాన్ని సూక్ష్మంలో మోక్షంగా వివరించారు. మండలి చైర్మన్ ద్వారా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు.

అధ్యక్షా!
1934లోనే వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలో అజం జాహీ మిల్స్ ప్రారంభమైంది. ఈ మిల్లుకు కు 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మొదటి కుమారుడు ప్రిన్స్ అజామ్ జాహ్ పేరు పెట్టారు. 200 ఎకరాలకు పైగా భూములతో ఏర్పాటైన ఈ మిల్లు దేశంలో అతిపెద్ద వస్త్ర పరిశ్రమలలో ఒకటి. స్వాతంత్య్రానికి ముందు, ఈ మిల్లు 10 వేల మందికి పైగా ఉపాధిని కల్పించింది. ఈ మిల్లు సైరన్ వరంగల్, చుట్టుపక్కల గ్రామాల నివాసితులకు ఉదయం వేక్-అప్ కాల్‌గా వచ్చేది. 1974లో బెంగళూరుకు చెందిన నేషనల్ టెక్స్‌టైల్ కార్పోరేషన్ ఈ కంపెనీని స్వాధీనం చేసుకుంది.1980 చివరి వరకు ఆరు దశాబ్దాలకు పైగా పనిచేసిన ఈ మిల్లును, 1990ల ప్రారంభంలో మూసివేశారు. 2008లో కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ (కుడా)కి ఈ భూమి ఇవ్వగా, దాన్ని ప్లాట్లుగా తయారుచేసి విక్రయించారు. మిల్లులో పనిచేసి రిటైర్డ్ ఉద్యోగులకు ఒక్కొక్కరికి 200 గజాల చొప్పున స్థలాలు కేటాయించారు. ప్రస్తుతం 30 ఎకరాలు మాత్రమే మిగిలింది. వరంగల్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి 1984నాటి పాపర్టీ ట్యాక్స్ అసెస్ మెంట్ (ఆస్తి పన్ను విధింపు) రికార్డుల సర్టిఫై కాపీని తేదీ: 06-01-2025న అధికారికంగా తీసుకోవడం జరిగింది. శిథిలావస్థలో ఉన్న అప్పటి అసెస్మెంట్ బిల్లును పరిశీలించగా, 1984లో అప్పటి వరంగల్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ పాపర్టీ ట్యాక్స్ అసెస్ మెంట్ (ఆస్తి పన్ను విధింపు) ప్రకారం ఎజె మిల్స్ స్టాఫ్ బిల్డింగ్ పేరున రకరకాల పద్దుల సవరింపులతో రూ.135.55 పై.ల పన్ను విధించినట్లుగా ఉంది. మొత్తానికి 1984 నాటి రికార్డుల ప్రకారమే అంటే 41 ఏళ్ళ క్రితమే అది అప్పటి వరంగల్ మున్సిపాలిటీలో ఒక ఇంటి నెంబర్ కలిగి ఉండటమేగాక, ఆ భవనానికి ఆస్తి పన్ను కింద పన్ను కట్టినట్లుగా కూడా రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. 80 ఏళ్ళుగా కార్మికుల పోరాటాలకు వేదికగా నిల్చిన కార్మిక భవనానికి, మున్సిపాలిటీ ఇంటి నెంబర్ కలిగివున్నప్పటికీ 2016లో అప్పటి వరంగల్ ఎమ్మార్వో వ్యవసాయ భూమిగా మ్యుటేషన్ చేశారు. వరంగల్ అజం జాహి మిల్లుతో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాష్ కు అవినాభావ సంబంధం ఉంది. కార్మికులు వీఆర్ఎస్ తీసుకొని విశ్రాంత ఉద్యోగులుగా జీవితాన్ని గడుపుతున్న క్రమంలో వారికి అజంజాహి మిల్లు భూముల్లోనే స్థలాలు ఇప్పించడంలో బండ ప్రకాష్ కృషి చేశారు. అదే అనుబంధంతో ఎంపీగా రూ.20 లక్షలు నిధులు ఇచ్చారు. దఫా దఫాలుగా నిధులు ఇస్తానని ముందుకు వచ్చారు. ప్రొసీడింగ్ నెంబర్ 26/ఎంపీ లాడ్స్/బిపి/వరంగల్ అర్బన్/2018-19, తేది:12/02/2020 తో అప్పటి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ప్రోసీడింగ్ ఇచ్చారు. కానీ, కార్మిక భవనాన్ని కట్టనివ్వలేదు.

అధ్యక్షా!
తప్పుడు దస్తావేజులు సృష్టించి, వ్యవసాయ భూమిగా, ఇంటి స్థలంగా రెండు వేర్వేరు రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. కార్మిక భవనం ఉన్నచోట బహుళ అంతస్తుల వ్యాపార భవనానికి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అప్పటి కమిషనర్ అనుమతులు ఇచ్చారు. దీనికి అప్పటి స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేషన్ అధికారులు రెవెన్యూ అధికారులు కుమ్మక్కయ్యారు. మంత్రి కొండ సురేఖ భర్త కొండా మురళి స్వయంగా ఆ బహుళ అంతస్తుల భవనానికి శంకుస్థాపన చేశారు. తర్వాత ఆ విషయం తనకు తెలియదని బుకాయించారు. రాజకీయ నాయకుల సలహాతోనే సదర్ వ్యాపారి కోర్టుకు వెళ్లారు. మిల్లు కార్మికుల కుటుంబాల వారసులు, ప్రజా సంఘాలు, అఖిలపక్ష నాయకులు అంతా కలిసికట్టుగా అజం జాహి మిల్లు కార్మిక భవన పరిరక్షణ కోసం ఉద్యమించారు. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. అజంజాహీ మిల్లు కార్మిక భవన స్థలాన్ని పరిరక్షించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. కార్మిక లోకం ప్రభుత్వ జోక్యాన్ని అర్ధిస్తోంది! సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తారని ఎదురుచూస్తోంది!

https://youtu.be/Lre0j7leeqw?feature=shared

Latest News

మా అమ్మాయిని పెండ్లి చేసుకోండి…|CJP|ABHIJITH DIPKE|MARRIAGE

CJP అధినేత అభిజీత్ దీప్కే తల్లి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు|MOTHER|ANITA DIPKE ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడిగా, విద్యార్థుల హక్కుల పోరాటంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిజీత్ దీప్కే వివాహంపై ఆయన తల్లి...

ఆర్యుల/వైదిక నాగరికత|HISTORY|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS

సింధు నాగరికత తర్వాత భారతదేశంలో అభివృద్ధి చెందిన రెండవ నాగరికత ఆర్యుల నాగరికత. ఈ ఆర్యులు నార్దిక్ జాతికి చెందినవారు. ఈ నార్దిక్ జాతి వారు ఆర్య అనే భాషను మాట్లాడడం ద్వారా...

గుండు కొట్టించుకోండ్రి! యేలు పట్టుకుపోండ్రి!?|ADUGU TRENDS

గుండు కొట్టించుకుంటే ఎవలన్నా పైసలిత్తరా? నిజంగనే ఇత్తరాని? ఇత్తరని గవాల్లు నమ్మిండ్రు. గుండు గూడా గీయించుకుండ్రు. పున్నానికొత్తే పినాయిల్ కూడా తాగుతరన్నట్టు, ఉచితాలకు మనోల్లు ఎంత అలవాటైపోయిండ్లో శేప్పే గీ ముచ్చట మీరే...

నీట్ పరీక్షల బిల్లులో పటిష్టతేది!?|EDITORIAL

కొత్త బిల్లు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు. ఎంత కఠినమైన శిక్షల బిల్లు తెచ్చినా, లీకేజీలకు పాల్పడేవారు శిక్షల నుంచి తప్పించుకునే మార్గాలను వెతుకుతూనే ఉంటారు. అందువల్ల శిక్షల కంటే వ్యవస్థను బలోపేతం...

జూలై 30, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పాడ్యమి రాత్రి 07.58 వరకు ఉపరి విదియ నక్షత్రం శ్రవణ సాయంత్రం 05.43 వరకు ఉపరి ధనిష్ఠ యోగం ఆయుష్మాన్ రాత్రి 01.02 నుండి ఉపరి సౌభాగ్య కరణం బాలవ ఉదయం 07.44...

సర్.. ఆ కుటుంబాన్ని కలిపింది సార్!?|ADUGU TRENDS

సర్ పక్రియ ఓట్లను తొలగించి సత్తెనాశనం శేసిందని, పతిపక్ష పార్టీలు అల్లరి శేసి ఆగమాగమైతాంటే, అధికార పార్టీ మాత్రం ఏ గిది మస్తుగుంటాందంటాంది. మొత్తానికి సర్, పార్టీలను యిడగొట్టినా, ఓ కుటుంబాన్ని కలిపింది....

హైడ్రా-పారదర్శకతే ప్రామాణికం కావాలి!|EDITORIAL

ప్రభుత్వ భూములను రక్షించడం ఎంత ముఖ్యమో, రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కు, సహజ న్యాయ సూత్రాలను కాపాడటం కూడా అంతే ముఖ్యమైనది. ప్రభుత్వం హైడ్రా ద్వారా ప్రభుత్వ భూములను కాపాడాలనే లక్ష్యాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం...

జూలై 29, బుధవారం, 2026|RASHI PHALALU

గురు పౌర్ణమి శాకాంబరీ ఉత్సవం శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి పౌర్ణమి రాత్రి 07.05 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 03.48 వరకు ఉపరి శ్రవణ యోగం ప్రీతి రాత్రి 01.03 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం భద్ర ఉదయం...

ద్రవరూప రంగుల విల్లు|ADUGU|SPECIAL STORY|CANO CRYSTALS

కొలంబియాలోని ‘లిక్విడ్ రెయిన్‌బో’ కానో క్రిస్టేల్స్ అద్భుత గాథ! ప్రకృతి ఒడిలో దాగున్న వింతలు, విశేషాలు ఎప్పుడూ మానవాళిని మంత్రముగ్ధులను చేస్తూనే ఉంటాయి. మన భూగోళంపై నీలిరంగులో నిర్మలంగా పారే నదులు, అద్దంలా మెరిసే...

అగ్గి పెట్టెతోటే హాజరీ!?|ADUGU TRENDS

పాఠం సెప్పుడంటే పుస్తకం సూసి సదువుడు కాదు. గండ్లున్నదాన్నే వళ్లె యేసుడు కాదు. బెత్తెం పట్టుకుని, బట్టీ పట్టిచ్చుడు అసలే కాదు. గా పిల్లల మెదల్లకు మేతేసుడు. పదను పెట్టుడు. కొత్తగ ఆచరించుడు,...

పార్టీలకు, ప్రభుత్వాలకు ‘నీట్’ గా ఓ హెచ్చరిక!|EDITORIAL

సామాన్య పౌరులు ప్రారంభించిన చిన్న ఉద్యమాలకు దేశవ్యాప్త ఆదరణ లభించడం రాజకీయ పార్టీలకు ఒక గట్టి హెచ్చరిక. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సంప్రదాయ నాయకత్వంపై మాత్రమే ఆధారపడటం లేదు. కొత్త...

జూలై 28, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 05.30 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం విష్కంబ రాత్రి 12.49 వరకు ఉపరి ప్రీతి కరణం వణజి సాయంత్రం 05.30 వరకు ఉపరి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News