కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో రైతులకు పెద్ద ఊరట కలిగే కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రైతులకు అందించే రుణ పరిమితి రూ. 3 లక్షలు ఉండగా, ఇప్పుడు దాన్ని రూ. 5 లక్షల వరకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంతో లక్షలాది మంది రైతులకు ఆర్థిక సహాయంగా నిలవనుంది. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కొత్తగా పీఎం ధన్ ధాన్య కృషి యోజనను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా దాదాపు 1.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలగనుంది. ఇదిలా ఉండగా, కేంద్ర ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధికి అధిక నిధులు కేటాయించిందని, వలసల సమస్యను అరికట్టేందుకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు సీతారామన్ ప్రకటించారు.

