మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని పోలేపల్లి సెజ్ లోని ఎన్ఎంఐఎంఎస్ యూనివర్సిటీలోని విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడంపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వర్సిటీ వీసీ, హాస్టల్ నిర్వహకులపై, వైద్యం అందిస్తున్న తీరుపై తీవ్రంగా స్పందించారు. ఫుడ్ పాయిజన్ విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్ రెడ్డి హుటా హుటీగా యూనివర్సిటీని సందర్శించారు. చికిత్స పొందుతున్న విద్యార్థులతో మాట్లాడారు. ఫుడ్ పాయిజన్ అయిన విషయంపై ఆరా తీశారు. యూనివర్సిటీ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని యూనివర్సిటీ యాజమాన్యానికి సూచించారు.

