Friday, April 24, 2026
37.2 C
Hyderabad

ఓ బొజ్జ గణపయ్యా! మా గ్గ్యానమియ్యయ్యా!!|ADUGU TRENDS

గా యినాయకుని పండుగ రానే ఒచ్చింది. యినాయకుడంటే యెవరు? ఆది దేవుడు. అంటే అందరూ అందరికన్నా మొట్ట మెదలే మొక్కే దేవుడన్నట్లు. మనం యే కార్యం సేసుకున్నా, ముందు గీ యినాయకుడ్నే తలుసుకుంటం. దేవుడా! మమ్మల్ని కాపాడు. యిగ్నాలు లేకుండ సల్లంగ సూడంటం. గందుకే గీ యినాయకుని పండుగొస్తే సాలు, మస్తు మజాగ జరుపుకుంటం. ఇంటింటికీ గా రాగడి మట్టి యినాయకుడ్ని నిలుపుకుంటం. పూలూ, పత్రి తెచ్చి మొక్కుతం. పాశం ఒండుకుని, ఉండ్రాల్లు సేసుకుని, తీరొక్క కాయగూరలతో తింటం. గా బొజ్జ వినాయకుని పేరుతోని మన బొజ్జలు నింపుకుంటం. గట్లనే మూషిక వాహనుడు గాబట్టి, ఎల్కలకు కూడా ఉండ్రాల్లు, పాశబువ్వ డొప్పలల్ల పెడతం.
యిగ రాను రాను గీ పండుగ పెనం నుంచి పొయ్యిల పడ్డట్లు… ఇంట్ల నుంచి యీదిల బడ్డది. యిగ యీ యినాయకుడ్ని గా పడుసు పోరగాండ్లు, బుడ్డ బుడ్డ పోరగాండ్లు యీదికి ఒకటా రెండా.. యేడ బడితే గాడ, యెన్ని బడితే గన్ని, యిగ్రహాలు తెచ్చి పెడతాండ్లు. పీఓపీ అంటరు గద. గా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తోని సేసే, రకరకా రసాయ్నాలు కలిపే రంగులతోని అద్దినవి తెచ్చి పెడతాండ్లు. నవరాత్రులూ కొలసి, పూజలు సేసి, బంతి బోజనాలు పెట్టి, తీర్త పసాదాలు ఇస్తరు. ఇగ నిమజ్జనం సేసేటప్పుడు డీజేలు, డాన్సులు, డప్పులతోని ఊరేగింపులు జర్పుతరు. కొందరు గా తిక్క పోరగాండ్లు కాసంత సుక్కేసుకుని ఒక్కతీర్గ యెగురుతరు. గా పడుసోల్ల ఉర్రూతలతోని ఊరూరే గత్తరొచ్చినట్లు మోత మోగుద్దంటే నమ్ముండ్లి.
గిట్ల ఒక్క గా పట్నంలనే మూడు లచ్చల పీఓపీ యిగ్రహాలు పెడతాండ్లట. గియి గాక ఓ లచ్చ మట్టి యిగ్రహాలను గా పట్నం పెద్ద మున్సిపాల్టీ వోల్లు పంచుతాండ్లట. గీ లెక్కన అడుగు డిజిటలోల్లం గూడా మట్టి యినాయకుల్ని మస్తుగ పంచితిమి. యింక లెక్కకు రాని వాటి లెక్కలైతే తెల్వనే తెల్వదు. గీవీట్ని నిమజ్జనం సేయడాన్కి, 30 నిమజ్జన అడ్డాలల్ల, పెద్ద పెద్ద క్రేన్లు పెడ్తాండ్లట. పోయినసారే ఒక్క ఉస్సేన్ సాగర్లనే 5,800 పీఓపీ యర్ధాలను తీసిండ్లట. ఇగ గా పట్నంల ఈసారి యెట్లుంటదో యేందో మరి!
గీ ఒక్క హైదరాబాద్లనే గిట్లుంటే దేశమంతా ఎట్లుంటదో సోచాయించుండ్లి. గందుకే మనం మట్టి యిగ్రహాలనే పెట్టాలె. గవి గూడ సిన్నసిన్నంగనే ఉండాలె. ఇగ సెరువులు, కుంటల్ల వేయనే వద్దు. ఒకేల యేస్తే ఏటా ఎండాకాలంల గా మట్టిని పూడిక లెక్క తీయాలె. గిదంతా మనం సేయకపోతిమి. మన్నలి యేలేటోడు సేయకపాయె. ఇగ ఎట్లైతదుల్ల? గీ పీకులాట లేకుంట సూసుకోవాలె. యేలం యెర్రి లెక్క గాకుండా గా దిమాక్ తోని ఆలోసించాలె. పక్రుతికి, పర్యావరణానికి, గట్లనే గీ జనానికి, పరేషాన్ గాకుంట సూడాలె. ఎకో ఫ్రెండ్లీ అంటరు గద. మనం గూడ గట్లనే ఉండాలె. సమజైతాందా?

Latest News

ఏయేయి ఎప్పుడు కొనాల్నో తెలుసా!?|ADUGU TRENDS

మనకు అవసరం ఉన్నప్పుడే యే వస్తువునైనా కొంటం. ఎప్పుడు పడితే గప్పుడు గా వస్తువలను కొంటే ఎక్కువ ధర పడ్తయి. ఇగ తక్కువ ధరకే గవాట్ని కొనాల్నంటే గవాటి సీజన్లను బట్టి గాకుండ,...

ప్రయాణ ప్రగతి రథ చక్రంపై ప్రభుత్వ నిర్లక్ష్యం!|EDITORIAL

ఎన్నికల రాజకీయాల్లో హామీలు ఇవ్వడం సహజం. కానీ ఆ హామీల అమలు విషయంలో నిర్లక్ష్యం ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరం. హామీలివ్వడం, గాలికి వదిలేయడం.. తెలంగాణలో గత కొన్నేళ్లుగా ఇదే ధోరణి పునరావృతమవుతోంది. అధికారంలోకి...

24-04-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--శుక్లపక్షం తిధి శు అష్టమి రాత్రి 11.34 వరకు ఉపరి నవమి నక్షత్రం పుష్యమి రాత్రి 12.18 వరకు ఉపరి ఆశ్లేష యోగం ధృతి ఉదయం 07.51 వరకు ఉపరి శూల కరణం భద్ర మధ్యాహ్నం...

ఖరీదైన కారుతోటే గా రోడ్డును బాగుశేసిండు!?|ADUGU TRENDS

మనసుంటే మార్గమున్నట్లే గద! మరి గా మార్గమే బాగా లేకపోతే? ఒకాయినె గా బాగా లేని రోడ్డును కోట్ల యిలువ శేసే ఖరీదైన కారుతోటి ఎట్ల బాగు శేసిండో సూడుండ్రి? బెంగళూరులో ఒకాయినె రోజూ...

ఒకటి ఒకటి ఒకటి! రెండు రెండు రెండు!!|EDITORIAL

దేశంలో ప్రతి ఏటా కోటిన్నర మంది విద్యార్థులు పది, ఇంటర్ వంటి కీలక పరీక్షలకు హాజరవుతున్నారు. వీళ్ళంతా ర్యాంకుల పోటీలో చిక్కుకుని తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదికల...

23-04-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--శుక్లపక్షం తిధి శు సప్తమి రాత్రి 01.32 వరకు ఉపరి అష్టమి నక్షత్రం పునర్వసు రాత్రి 01.30 వరకు ఉపరి పుష్యమి యోగం సుకర్మ ఉదయం 10.41 వరకు ఉపరి ధృతి కరణం గరజి మధ్యాహ్నం...

గా కార్ బిల్డింగును సూద్దాం పాండ్రి!?|ADUGU TRENDS

ఒక్కొక్కలు ఒక్కో రకం. ఒక్కొక్కలిది ఒక్కో టేస్టు. ఎవ్వలిట్టం వాల్లది. గా హైదరాబాద్ పట్నంల ఫిష్ హౌజ్, రెడ్ బిల్డింగ్ వంటి ల్యాండ్ మార్క్ లను సూసినం. శేప ఆకారంలనే గా సర్కార్...

మండుటెండల గుణ‘పాఠాలు’! |EDITORIAL

ఈ ఏడాది వేసవి తీవ్రత అసాధారణ స్థాయికి చేరుకుంది. ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరిగి, వర్షపాతం తగ్గే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరికలు చేసినప్పటికీ, వాటి నివారణకు చర్యలు...

22-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 06.05 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం ఆరుద్ర రాత్రి తెల్ల 02.55 వరకు ఉపరి పునర్వసు యోగం అతిగండ మధ్యాహ్నం 01.40 వరకు ఉపరి సుకర్మ కరణం బాలవ...

గోడలకు గట్టిగ నీల్లు గొట్టే శిట్కా!?|ADUGU TRENDS

పెండ్లి శేసి సూడు... ఇల్లు కట్టి సూడన్నరు. గివి రెండు శేసుడు అంత వీజీ కాదన్నట్లు. గందుకే పండ్లి అన్నా, ఇల్లన్నా కనా కట్టమన్నట్లు. గట్లనే ఇల్లు కట్టాల్నంటే గా ముగ్గు పోసి...

కవిత పార్టీతో బీఆర్‌ఎస్‌కు లాభమా? నష్టమా?|EDITORIAL

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామానికి వేదిక సిద్ధమవుతోంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీ ప్రకటించబోతున్నట్లు వస్తున్న సమాచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రకటన కేవలం కొత్త...

21-04-2026, మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--శుక్లపక్షం శ్రీ ఆదిశంకరాచార్య జయంతి తిధి శు చవితి ఉదయం 08.31 వరకు ఉపరి పంచమి నక్షత్రం రోహిణి ఉదయం 06.14 వరకు ఉపరి మృగశిర యోగం శోభ సాయంత్రం 04.45 వరకు ఉపరి అతిగండ కరణం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News