Monday, August 3, 2026
30.1 C
Hyderabad

సాహితీ హిమవత్ శిఖరం|ARTICLE|ESSAY

తెలుగు సాహిత్య దిగ్గజం. సాహితీ హిమవత్ శిఖరం డాక్టర్ లింగంపల్లి రామచంద్ర. కవి, రచయిత, విమర్శకుడు, విశ్లేషకుడు, పరిశోధకుడే కాకుండా అలుపెరుగని సాహితీ వేత్త. అతి సామాన్యుడు, సౌజన్యమూర్తి. లింగంపల్లి రామచంద్ర, పెద్ది వెంకటయ్య, పొట్లపల్లి శ్రీనివాసరావులు ఆచార్య పేర్వారం జగన్నాథం స్మారక పురస్కారాలు అందుకున్నారు. అంతేగాక, సోమనాథ కళాపీఠం నుంచి వి. చలపతిరావు సాహిత్య పురస్కారాన్ని లింగపల్లి రామచంద్ర, పెద్ది వెంకటయ్య అందుకున్నారు. అలాగే పొట్లపల్లి శ్రీనివాసరావు కాళోజికి, సోమనాథ కళాపీఠానికి, వరంగల్‌లోని సాహిత్య ప్రముఖులకు సన్నిహితుడుగా ఉన్నారు. ప్రముఖ రచయిత పాలడుగు రత్నాకర్ రావు రాసిన ప్రత్యేక వ్యాసం. అడుగు ఎడిటోరియల్ 

సాహితీ హిమవత్ శిఖరం

అతను

ఏ వేదికమీద కూర్చున్నా
మెడనిండా పూదండలు

భుజాలు వంగేంత
శాలువాల బరువు

రెండు చేతులు వడసిపట్టుకునే
అక్షర ఫలకాలు లెక్కకందనివి

అందుకున్న పురస్కారాలు
కోకొల్లలు

ఇవ్వన్ని సొంతం చేసుకున్నది
ఎవ్వరనుకున్నారు సామాన్యుడిలో
అతి సామాన్యుడు, సౌజన్యమూర్తి.

అని అంటే నమ్ముతారా ఎవ్వరైనా?

పేర్వారం జగన్నాధం ఫౌండేషన్ ఆధ్వర్యంలో..

ఆచార్య పేర్వారం జగన్నాథం స్మారక పురస్కార గ్రహిత డా౹౹ లింగంపల్లి రామచంద్ర గారని అంటే నమ్మాలి.

కవి, రచయిత, విమర్శకుడు, విశ్లేషకుడు, పరిశోధకుడే కాకుండా అలుపెరుగని సాహితీ వేత్త.

ఇల్లే
కార్యశాలగా
చేసుకున్న
అతని ఇంట్లోనే ఇవ్వన్ని
సాదృశ్యాలు

చూపరులకు అమృత
కలశాలు
సాహిత్యాభిలాశకులకు
కనులవిందులు

అతని బాధ్యతలనే కాదు
బరువులను పంచుకుని
వెన్నంటి నిలచే అర్ధాంగి

మేమున్నాము నాన్న..
అంటున్న
ఉతకఱ్ఱలు వారి కూతుళ్లు

అవును ఇప్పుడతను
వృద్దుడు,
సాహిత్యంలో మాత్రం
నిత్యయవ్వనుడు

అతనేనండి లింగంపల్లి!

నాడు బళ్లో పాఠాలు చెప్పినంత
అలవోకగా సాహిత్య మధురిమల్ని
పంచుతున్నాడు ఈనాడు
సాహిత్యలోకానికి

జనగామ సాహిత్యరంగంలో
ఈ తరానికి ఆద్యుడు
రామచంద్రం గారే

జిల్లా సమీప
కుగ్రామం ఆతని జన్మస్థలం
వాల్మీకిమహర్షి నడచిన
పాదముద్రలు
కనిపించాయని చెప్పుకుంటారు అక్కడి పూర్వీకులు

ఆయన పెరుగుతున్న
పాదులో సాహిత్యపు నీళ్లు
ఒలికినట్లున్నవి

జాలువారుతున్న ఆ తడిలో
నేటికింకా తడిచి ముద్దవుతున్నాడు
ఈ సాహిత్యకారుడు

పల్లె నేపద్యం గల పల్లె
జీవితమాతనిది నేటికి

ఆయన సుదూరగతంలో
ఉమ్మడి వరంగల్ జిల్లా నాటి సాహితీ
దిగ్గజాలందరు తన గురు సమానులనే
చెప్పుకుంటాడు ఈయన సవినయంగా

తాను సాహితీ మెట్లుఎక్కించిన
వారి లెక్క చెప్పమంటే మాత్రం మరచిపోయానంటాడు వినమ్రంగా ఎంతో మంది ఔత్సాహికులకు మార్గదర్శి అయ్యుండి కూడ

నేటి సాహితీ లోకంలో సుస్థిర స్థానం ఆతనిది, ఎనలేని విలువలు నిలిపిన మానవతావాది, సాహితీసంచారి

గురుతుల్యులు పేర్వారం గారని సగర్వంగా చాటుకొనే
ఈ సాహితీకారునికి..

పేర్వారం గారి
వారసులు అందించిన స్మారక
పురస్కార ప్రదానోత్సవం

నాటి సాహితీ దిగ్గజాల సరసన
ఒదిగిన మణికిరీటం ఈతను

అవునండీ అతనే, అతనే లింగంపల్లి రామచంద్ర గారు

నా అభినందనాక్షరాలు కూడ నేడు వారికే, వారికే మరి!

 పాలడుగు రత్నాకర్ రావు
(డాక్టర్ లింగంపల్లి రామచంద్ర, పెద్ది వెంకటయ్య, పొట్లపల్లి శ్రీనివాసరావులు ఆచార్య పేర్వారం జగన్నాథం స్మారక పురస్కారాలు అందుకున్న సందర్భంగా)

Latest News

ఆగస్టు 03, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పంచమి రాత్రి 08.18 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 08.37 వరకు ఉపరి రేవతి యోగం సుకర్మ రాత్రి 08.54 వరకు ఉపరి ధృతి కరణం కౌలవ ఉదయం 08.40...

అవుమల్లా! కడుపుల బిడ్డ స్పందిత్తదా!?|ADUGU TRENDS

తల్లి గర్భంల ఉండంగనే బిడ్డలకి బయటియి యినబడ్తయా? గవాటికి గా పిల్లలు గూడ స్పందిత్తరా? యెన్కటికి కడుపుల ఉండంగనే అర్జునుడి కొడుకు అభిమన్యుడు పద్మవ్యూహంలకెట్ల పోవాల్నో తెలుసుకున్నడట. గిది నిజమో కాదో కనీ,...

ఉత్తరాంధ్రకు గేమ్ చేంజర్ గా భోగాపురం!?|EDITORIAL

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు ఒక కొత్త అవకాశాన్ని తెరిచింది. ఈ అవకాశాన్ని స్థిరమైన అభివృద్ధిగా మలచడం కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు, స్థానిక ప్రజల సమిష్టి కృషిపైనే ఆధారపడి ఉంటుంది. మౌలిక వసతుల...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 02 నుండి ఆగస్టు 08 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీరు చేపట్టే పనుల్లో ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో...

యిధి యిసిత్రమైందంటే గిదే మరి!?|ADUGU TRENDS

యిధి శాల యిసిత్రమైంది. ఒకపాలి కలిసున్నోల్లను సిడెంల యిడదీత్తది. యిడిపోయినోల్లని శిటికెల కలిపేత్తది. గసొంటిదే గీ ముచ్చట. గదేందో సూద్దాం పాండ్రి. తమిళనాడు రాస్ట్రం విరుదు నగర్ జిల్లా తిరుచూలి పూమాలై పట్టీకి శెందిన...

పోలీసింగ్ పై పార్లమెంటులో సమీక్షేది!?|EDITORIAL

పార్లమెంట్ వరుసగా వాయిదాలు పడుతూ స్తంభిస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర ప్రతిష్ఠంభనల వల్ల ఉభయ సభల్లో కీలక అంశాలపై అసలు చర్చే జరగడం లేదు. పోలీసు వ్యవస్థలో సంస్కరణలు కూడా అత్యవసరం....

ఆగస్టు 01, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ తదియ రాత్రి 09.20 వరకు ఉపరి చవితి నక్షత్రం శతభిషం రాత్రి 08.09 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శోభ రాత్రి 11.43 వరకు ఉపరి అతిగండ కరణం వణజి ఉదయం 09.10...

తెలంగాణ ‘పెద్ద’న్న అస్తమయం!|TELANGANA|PEDDI SUDHARSHAN REDDY

ప్రకటించిన హాస్పిటల్ వైద్యులు హనుమకొండలో గుండెపోటు మెరుగైన వైద్యానికి హైదరాబాద్ కు 5రోజులు మృత్యువుతో పోరాటం కాంగ్రెస్ తోనే రాజకీయ ప్రస్థానం ఆబాల వెంకట్ రెడ్డితో ఓనమాలు మాజీ ఎంపీ సురేందర్ రెడ్డితో పాఠాలు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆరంగేట్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనూ...

ఎలుక ఎంత పని శేసింది!?|ADUGU TRENDS

మనిసి సహా ఏ పాణి సహజ లచ్చణాలు ఆ పాణికి ఉంటయి. గట్లనే కోతి, కొండెంగ, కుక్క, ఎలుక, మనిసి అసొంటివేవీ అతీతమేమీ కావు. గయి గట్లనే మసులుకుంటయి. గందుకే ‘కనకపు సింహాసనం...

ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమవుతోందా!?|EDITORIAL

ప్రతిపక్షం బలహీనంగా ఉంటే ప్రజాస్వామ్యం కూడా బలహీనపడుతుంది. అధికార పక్షం తప్పులను ఎత్తిచూపే శక్తి లేకపోతే ప్రభుత్వ జవాబుదారీతనం తగ్గుతుంది. అందుకే, కాంగ్రెస్ బలపడటం కేవలం ఆ పార్టీ అవసరం మాత్రమే కాదు....

జూలై 31, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ విదియ రాత్రి 09.03 వరకు ఉపరి తదియ నక్షత్రం ధనిష్ఠ రాత్రి 07.09 వరకు ఉపరి శతభిషం యోగం సౌభాగ్య రాత్రి 12.33 వరకు ఉపరి శోభ కరణం తైతుల ఉదయం 08.40...

మా అమ్మాయిని పెండ్లి చేసుకోండి…|CJP|ABHIJITH DIPKE|MARRIAGE

CJP అధినేత అభిజీత్ దీప్కే తల్లి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు|MOTHER|ANITA DIPKE ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడిగా, విద్యార్థుల హక్కుల పోరాటంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిజీత్ దీప్కే వివాహంపై ఆయన తల్లి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News