Wednesday, September 23, 2026
26 C
Hyderabad

కవిత్వాన్ని భూమార్గం పట్టించిన మహాకవి!|EDITORIAL

సమాజాన్ని మేల్కొలిపే శక్తి సాహిత్యానికి ఉంది. ఆ శక్తికి రూపం ఇచ్చినవారు కవులు. అలాంటి కవుల్లో అగ్రగణ్యుడు శ్రీరంగం శ్రీనివాసరావు, అంటే “శ్రీశ్రీ”. ఆయన కవిత్వం కేవలం సాహిత్యానికే పరిమితం కాలేదు. అది సమాజ మార్పునకు ఆయుధమైంది. ఆయన జయంతి సందర్భంగా ఆయన సాహిత్య ప్రస్థానం, సామాజిక చైతన్యం, అభ్యుదయ దృక్పథాన్ని ఒకసారి మననం చేసుకుందాం.

1910 ఏప్రిల్ 30న జన్మించిన శ్రీశ్రీ, స్వాతంత్ర్యానంతర భారత పరిస్థితులను చాలా స్పష్టంగా అంచనా వేశారు. “పాడవోయి భారతీయుడా” వంటి పాటల్లో స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ సామాజిక సమస్యలు తొలగలేదని హెచ్చరించారు. అవినీతి, నిరుద్యోగం, అసమానతలు—ఇవి ఆయన కాలంలో ఉన్నట్లే నేటికీ కొనసాగుతున్నాయి. ఈ దృష్టి ఆయనను కాలాతీత కవిగా నిలబెట్టింది.

శ్రీశ్రీ తొలి రచనలు సంప్రదాయ ఛందస్సులో సాగినా, త్వరలోనే ఆయన తన దారిని మార్చుకున్నారు. సామాన్యుడి జీవితం, బాధలు, ఆశయాలు ఆయన కవిత్వానికి కేంద్రబిందువయ్యాయి. క్లిష్టమైన అలంకారాల కంటే, సూటి భాషలో లోతైన భావాలను వ్యక్తం చేయడం ఆయన ప్రత్యేకత. ఇదే ఆయనను ప్రజల కవిగా నిలబెట్టింది.

శ్రీశ్రీ కవిత్వాన్ని చెప్పేటప్పుడు మహాప్రస్థానం ప్రస్తావన తప్పనిసరి. “మరో ప్రపంచం పిలిచింది” అంటూ శ్రామిక వర్గాలను చైతన్యపరిచిన ఈ కవితా సంపుటి, తెలుగు సాహిత్యంలో విప్లవాత్మక మార్పునకు నాంది పలికింది. ఈ గ్రంథం తరువాత తెలుగు కవిత్వాన్ని “మహాప్రస్థానం ముందు – తర్వాత”గా విభజించడం యాదృచ్ఛికం కాదు.

శ్రీశ్రీ దృష్టిలో కవిత్వం కేవలం అలంకార ప్రక్రియ కాదు. అది ఒక బాధ్యత. “కష్ట జీవికే నా కవిత్వం అంకితం” అన్న ఆయన భావం, శ్రమజీవుల పట్ల ఆయనకున్న గౌరవాన్ని తెలియజేస్తుంది. కుల, మత, వర్గ భేదాలతో విభజించబడిన సమాజంలో సమానత్వాన్ని ఆయన తన అక్షరాల ద్వారా ప్రచారం చేశారు.
శ్రీశ్రీ కేవలం పుస్తకాలకే పరిమితమవ్వలేదు. సినీ గీతాల ద్వారా కూడా ఆయన తన భావాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. “తెలుగు వీర లేవరా” వంటి పాటలు కేవలం వినోదానికి మాత్రమే కాదు. అవి జాతీయ చైతన్యాన్ని రగిలించేవి. భావుకతతో పాటు సందేశాన్ని కలిపి చెప్పడం ఆయన ప్రత్యేకత.

యువతలో చైతన్యం నింపడంలో శ్రీశ్రీ పాత్ర ప్రత్యేకమైనది. అలసత్వాన్ని విమర్శిస్తూ, పోరాటానికి పిలుపునిచ్చిన ఆయన పదాలు ఇప్పటికీ ప్రేరణనిస్తాయి. “నెత్తురు మండే సైనికులారా రారండి” అనే పిలుపు, ఆయనలోని విప్లవాత్మక దృక్పథాన్ని తెలియజేస్తుంది.

శ్రీశ్రీ ఒక ఉద్యమం. అభ్యుదయ రచయితల సంఘం, విప్లవ రచయితల సంఘాలతో ఆయన అనుబంధం, ఆయన ప్రయాణం, ఆయన ఆలోచనా విధానాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. “వ్యక్తికి బహువచనం శక్తి” అనే ఆయన భావన, సమూహ శక్తి ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.

కాలం మారినా, పరిస్థితులు మారినా, శ్రీశ్రీ కవిత్వం తన ప్రవాహ స్వభావ ప్రభావాన్ని కోల్పోలేదు. “నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను” అన్న ఆయన మాటలు, ఆయన జీవితం మొత్తం ప్రతిబింబిస్తాయి. తెలుగు సాహిత్యాన్ని ప్రజల భాషలో రాసిన పాల్కురికి సోమన తర్వాత కవిత్వాన్ని భూమార్గం పట్టించిన మహాకవి శ్రీశ్రీయే. నేటికీ చైతన్యానికి మార్గదర్శి. ఆయన సాహిత్యం చదివితే ఆలోచన, ఆవేదన, ఆవేశం, మార్పు అనివార్యమనే శక్తులు మనలో మేల్కొంటాయి. మనకే తెలియన ఓ ఉత్తేజం మనల్ని ఆవహిస్తుంది.

Latest News

గా ఊర్ల పేమ పెండ్లిల్లు నిషేధం!?|ADUGU TRENDS

ఇగీ మద్దెల ఏడ సూసినా, లవ్వు మ్యారేజీలు, లివింగ్ టుగెదర్లేనాయె! గియి ఊర్లు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు దాటి దేశాలు, ఖండాంతరాలకు విస్తరించినయి. ఇగ కులం లేదు, మతం లేదు. ఇల0 లేదు....

యూపీ విభజన ప్రతిపాదనా? రాజకీయ వ్యూహమా?|EDITORIAL

దేశంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై చర్చ జరగడం సహజమే. కానీ ఇలాంటి నిర్ణయాలు ప్రజల దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకోవాలి. యూపీ విభజనపై రాజ్‌భర్‌ చేసిన ప్రకటన అధికారిక విధానంగా మారుతుందా?...

సెప్టెంబర్ 23, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ద్వాదశి రాత్రి 08.43 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శ్రవణ ఉదయం 08.18 వరకు ఉపరి ధనిష్ఠ యోగం సుకర్మ సాయంత్రం 04.50 వరకు ఉపరి ధృతి కరణం బవ ఉదయం 08.03...

పుతిన్ తిరుగులేని నేతేనా!?|EDITORIAL

పుతిన్ రాజకీయ పట్టు బలపడినప్పటికీ, ప్రతిపక్ష స్వేచ్ఛ, ఎన్నికల పారదర్శకత, యుద్ధానికి ముగింపు వంటి అంశాలపై రష్యా ఎదుర్కొంటున్న ప్రశ్నలు అలాగే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పుతిన్ ఆధిపత్యాన్ని కేవలం సీట్ల సంఖ్యతో...

బంగారం కొనే ముందు గీ మూడు సూడాలే!|ADUGU TRENDS

మనం బంగారం, నగలు ఏడ కొంటం? ఔసలోల్ల దగ్గర, బంగారం దుకాణాల్ల కొంటం .పెద్దపెద్ద దుకాణాలకు కూడా పోయేటోల్లు ఉంటరు. కానీ, గీ మూడు ముఖ్యమైన ముచ్చట్లు పట్టించుకోం. కానీ మన సర్కార్...

సెప్టెంబర్ 22, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ఏకాదశి రాత్రి 07.23 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 06.14 వరకు ఉపరి శ్రవణ యోగం అతిగండ సాయంత్రం 04.49 వరకు ఉపరి సుకర్మ కరణం వణజి ఉదయం 06.34...

సెప్టెంబర్ 21, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు దశమి సాయంత్రం 05.43 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం ఉత్తరాషాఢ పూర్తిగా ఉంది యోగం శోభ సాయంత్రం 04.30 వరకు ఉపరి అతిగండ కరణం గరజి సాయంత్రం 05.43 వరకు ఉపరి వణజి రాహుకాలం...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 20 నుండి సెప్టెంబర్ 26 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త అవకాశాలు కనిపిస్తాయి, ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపార రంగాల్లో ముందడుగు వేసే పరిస్థితులు ఏర్పడతాయి. నిలిచిపోయిన పనులను...

కరకరలాడే కరెన్సీ నోట్లతో నాయకుడు!|ADUGU TRENDS

అవును. మీరు ఇ0టున్నది నిజమే. కావాలనంటే మీరే సూడు0డ్రి. గాడ కరకరలాడే కొత్త కరెన్సీ నోట్ల తోటి ఇనాయకుడిని అలంకరించినరు. ఒక్క రూపాయి రెండు రూపాయలతోటి కాదుల్ల ఏకంగా 65.03 లచ్చల నోట్ల...

పన్నుల ఉచ్చులో ప్రపంచ వాణిజ్యం!|EDITORIAL

సుంకాల అస్త్రంతో అమెరికా మరోసారి ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేస్తోంది. రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల పేరుతో భారత్, చైనాలపై కూడా భారీ సుంకాల ముప్పు తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రష్యా చమురు దిగుమతుల విషయంలో...

సెప్టెంబర్ 19, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు అష్టమి పగలు 01.40 వరకు ఉపరి నవమి నక్షత్రం మూల రాత్రి 01.14 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం ఆయుష్మాన్ పగలు 03.20 వరకు ఉపరి సౌభాగ్య కరణం బవ పగలు 01.40...

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News