భూమ్మీద నూకలుండాలె గనీ, గా బొంద పెట్టినా బతుకుతరు! కట్టెల్ల కాల్సినా లేత్తరు!! నడి సంద్రంల ముంచినా తేల్తరు!!! యినడానికి ఇచ్చెంత్రంగున్నా, కనడానికి కట్టుకత లెక్క అనిపించినా, గిదే నిజముల్లా. కావాల్నంటే, ఇగో గిది సదివితే మీకే తెలుత్తది.

అమెరికల సౌత్ కరోలినా రాస్ట్రం లెక్సింగ్టన్ కౌంటీల పోయిన సోమారం ఓ తల్లి పని మీద బయటికి పోయింది. ఇగ ఇంట్ల తండ్రితోపాటు ఉన్న శిన్న పొల్లగాడు కనిపించకుండ పోయిండు. ఇగాతల్లి గా పోలీసులకు ఫిర్యాదు శేసింది. ఇగ గదే రోజు రాత్రి దొంగతనం శేసిండన్న అనుమానం మీద గా తప్పిపోయిన గా పసిపొల్లగాని తండ్రి మైకేల్ కామర్ ను గా పోలీసులు అదుపులకు తీసుకున్నరు. ఇగాతండ్రి మీద అనుమానంతోటి వారింటి సుట్టుపక్కల గాలిచిండ్రు. ఇగాయింటికి కూతవేటు దూరంల ఉన్న అడివిల గప్పుడే తవ్వినట్టున్న బొంద కనపడ్డది. యిగా పోలీసులు గా బొందను తవ్విపిచ్చిండ్రు. గండ్ల ఓ పసిగుడ్డును తువ్వాలల సుట్టి, కుక్కల బోనుల పెట్టి, బొందపెట్టినట్లు గుర్తించిండ్రు. ఇగా సపిపొల్లగాడి ఏడుపు యిని యిస్తుపోయిండ్రు. మరీ లోతుగ లేకుండ పైపైన తొవ్వి పెట్టడంతోటి గా పసోడు బతికిండు. గిట్టాంటోల్లనే మ్రుత్యుంజయుడంటరు మరి.

